రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
నిరాశగా నిసృహగా
నిస్తేజంగా వాలిపోతూంది
గుండెగా బరువుగా బిగిసిన
తలుపుల వెనక, చీకట్లో..
ఆరిపోతున్న జీవితం
వెల వెలబోతున్న
రంగుల ప్రపంచం
మనస్సు లోయ
సరిహద్దుల్లో జీవితం
అంతమయి పోతూనే ఉంది
విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది
గుండేను మండిస్తూనే ఉంది
ఆరని చిచ్చురగిల్చావుగా
గతం రాత్రిలాగే, ప్రతి రాత్రీ
రెప్పలు చీల్చుకుని
ఉదయిస్తుంది
మనసులో చీకట్లను
అలాగే మిగిల్చి
మనసు గోడల పై
రక్తపు మరకలంటించావుగా
అందుకే మనసు రోదిస్తుంది
విరహగీతాలను ఆలపిస్తుంది
ఆ పదును గీతాలు
సేద తీర్చడంలేదు
తనువును తడుపుతున్న
స్వేదబిందువులై
మనసులోవేడి జారి కారిపోతోంది
అన్నీ అస్తమయ మెరుగని
ఉదయాలే.. ఎంత ఒద్దనుకున్నా
వడిన పూలైన
గతం..నిజమేరుగని
వాస్తవం..
ప్రస్తుతాన్ని మరచి
అచేతనంగా మిగిలిన
కొవ్వొత్తిలాంటి జీవితం
కరిగి కారిపోతూనే ఉంది
ఎప్పటి కైనా మిగిలని
ఆవిరయ్యే మైనంలా
అలసి వాలిన తనువు
నిరాశగా నిసృహగా
నిస్తేజంగా వాలిపోతూంది
గుండెగా బరువుగా బిగిసిన
తలుపుల వెనక, చీకట్లో..
ఆరిపోతున్న జీవితం
వెల వెలబోతున్న
రంగుల ప్రపంచం
మనస్సు లోయ
సరిహద్దుల్లో జీవితం
అంతమయి పోతూనే ఉంది
విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది
గుండేను మండిస్తూనే ఉంది
ఆరని చిచ్చురగిల్చావుగా
గతం రాత్రిలాగే, ప్రతి రాత్రీ
రెప్పలు చీల్చుకుని
ఉదయిస్తుంది
మనసులో చీకట్లను
అలాగే మిగిల్చి
మనసు గోడల పై
రక్తపు మరకలంటించావుగా
అందుకే మనసు రోదిస్తుంది
విరహగీతాలను ఆలపిస్తుంది
ఆ పదును గీతాలు
సేద తీర్చడంలేదు
తనువును తడుపుతున్న
స్వేదబిందువులై
మనసులోవేడి జారి కారిపోతోంది
ఉదయాలే.. ఎంత ఒద్దనుకున్నా
వడిన పూలైన
గతం..నిజమేరుగని
వాస్తవం..
ప్రస్తుతాన్ని మరచి
అచేతనంగా మిగిలిన
కొవ్వొత్తిలాంటి జీవితం
కరిగి కారిపోతూనే ఉంది
ఎప్పటి కైనా మిగిలని
ఆవిరయ్యే మైనంలా