. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, July 11, 2014

తగలబడిపోతున్న నా వెర్రితనాన్ని చూసి నవ్వుకుంటావ్ కదూ

నన్ను నేనే ఈ లోకం నుండి వెలివేసుకున్నా
ఒంటరి తనాన్ని కావలించుకుని చీకట్లో పడుకున్నా
అక్కడ కూడా అదే నవ్వు. కలలో కూడా అదే నవ్వు.
ఆ నవ్వే మెల్ల మెల్లగా నన్ను కమ్మేసింది
ఆ నవ్వే నాలో ఆవేశాన్నో కసినో పెంచింది
చివరకి అదే నిన్ను ద్వేషించేలా చేసింది.
కానీ ఇప్పుడు నన్ను నిర్వీర్యం చేయలేకపోయిన 
నీ నవ్వుని చూసి నేను నవ్వుకుంటున్నా. 
మానసికంగా బలంగా మారుతున్న 
ప్రతి నిమిషం నవ్వుకుంటున్నా
నాలో ఆత్మవిశ్వాసం పెరిగేంతలా,
నాలో పరిణతి కలిగేంతలా,
నన్ను నేను తిరిగి కనుగొంటూ నవ్వుకుంటున్నా.
ఇప్పుడు మరలా నేను నేనయ్యాను.
హమ్మయ్య నన్ను నేను ఎవరికీ కోల్పో లేదు.
ఇప్పుడు మరింత గర్వంగా,నమ్మకంగా
నాకు తెలుసు 
నువ్విప్పుడు నవ్వుకుంటావ్
నన్ను నువ్వు గెలిచావనో?
నేను నిన్ను గెలవలేదనో?
ఇద్దరుగా మొదలయిన ప్రయాణంలో 
నువ్వు మాత్రం ఒడ్డుకు 
చేరుకున్నావన్న సంతోషంతో
తప్పయినా సరే తప్పక చేస్తున్నా అని చెప్పి, 
తప్పించుకున్న ఆనందంతో
నాకై నేనే పేర్చుకున్న 
చితిలో తగలబడిపోతున్న నా వెర్రితనాన్ని చూసి
నవ్వుకుంటావ్ నవ్వుకుంటావ్ 
నేనెవరో మర్చిపోతావ్.
ఒకర్ని భాదపెడుతున్నాం 
అనే స్పృహలేకుండా నవ్వటం 
కూడా ఒక వరమే కాదా.
ఆ నవ్వుని జయించలేనేమో 
అని భయంవేసింది, భాదనిపించింది.
ముఖం చాటేసి తప్పుకుతిరిగా
అనందాన్నిచ్చే ప్రతిది ఆశ్రయించా
అప్పుడూ కూడా అదే నవ్వు