. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, July 3, 2014

కనుల గుమ్మాలకు వేలాడే ఒంటరి పక్షిలా నా నిరీక్షణ

ఆరిపోబోతున్న అవేదనను 
అదేపనిగా ఎగదోస్తూ
తెల్లవార్లూ తల్లకిందులుగా
నీకోసం తపస్సు చేస్తూ
కనుల గుమ్మాలకు వేలాడే
ఒంటరి పక్షి నిరీక్షణ
నిలువెత్తు చెమట చుక్కను
ముత్యాలుగా చేసి నీకోసం
కుప్పలుగా చేసి నిరీక్ష్స్తున్నా
ఎంతకే రావేందుకో అందుకే నాకు 
ప్రతీ రాత్రీ... నిషిద్ధ రాత్రే!
నిజాల నీడలో అబద్దాల అలికిడిలో 
అక్కరకురాని గతనికి 
అతుక్కొన్న జ్ఞాపకాలను 
పట్టిలాగినా రావడం లేదు
నీవేనా అనుకునే లోపు
అక్కడే కనిపిస్తావు
చిరునవ్వులు నవ్వుతూ 
అన్ని మర్చిపోయి 
ఎంత ఆనందంగా వున్నావో 
నిజానికి అబద్దానికి 
నీవో ప్రత్య్క్ష సాక్షివి 
అర్ధరాత్రి దాటాక
ఆశ చావని సేద్యకాడొకడు
సాయుధుడై
నడిచిపోతున్న అలికిడి
అల్లుకున్న ముళ్లపొదల
పానాదుల వెంట
పాయలుగా కదిలిపోతున్న
మట్టి పాదాల్ని
పలకరిస్తున్న పలుగురాళ్ళ సవ్వడి
నడిసంద్రంలో చిక్కిన
నావికుడి ఆక్రందనలా
అంతకంతకూ చిక్కనవుతూ
అలలు అలలుగా
గాలి ఆర్తనాదం
దిగూట్లో దిగులు పడుతున్న
వెలుగు పువ్వును
కొండచిలువలా ముట్టడిస్తూ
ఊపిరి సలపనివ్వని రాత్రి
అర అడుగు దూరంలోనే
ఉరితాడు వేలాడుతున్నా
సడలని సంకల్పం
తనువు గాయాల పాలైనా
తలవంచని తత్వం
బతుకంతా మెతుకును సృష్టిస్తూ
అణువణువూ చిగురించే వానికి
పగలూ రాత్రులేం పట్టింపు
మట్టిబెడ్డల కింద
నలిగిపోతున్న మనిషికి
పచ్చదనాన్ని
బహుకరించాలన్న తపన తప్ప
కళ్ళు తెరవని పైరు శిశువులు
పొలాలకు పాలు తాపడం మీదే
తన ధ్యాసంతా...
ఆరిపోబోతున్న వృత్తిని
అదేపనిగా ఎగదోస్తూ
తెల్లవార్లూ తల్లకిందులుగా
తపస్సు చేస్తూ
కనుల గుమ్మాలకు వేలాడే
ఒంటరి పక్షి నిరీక్షణ