నేస్తమా!
ఎందుకలా దూరంగా
నన్నొదిలి వెళ్ళి పోయావు
నీ వెంట నడవలేక కాదు గాని,
నీకది ఇష్టమో కాదో తెలియక
ఎం చేయాలో తోచక ఆగిపోయా.
ఓ క్షణం ఆగి చూస్తే
నీకూ నాకూ
మధ్య యుగాల దూరం.
నీకూ నాకూ మధ్య
మాటలు కరువయ్యి,
మనుషులు చొరబడ్డరు.
ఈ దూరాలు చెరిపే
అయుధం నీ వద్దే ఉంది.
అందుకే నీ వైపే
ఆశగా చూస్తున్నా.
ఒక్క అడుగు ఇటు
నా వైపు వెయ్యు.
ఒక్క క్షణం గడువియ్యు.
నీతో నడవాలని ఉంది
నీతో మాట్లాడాలని ఉంది ప్లీజ్
అడక్కుండానే మనసులోకి
చొరబడే చొరవ చేస్తావ్
చెప్పకుండానే గుండె చీల్చిపోతావ్.
నాకెప్పుడూ అయోమయం
నువ్వు నాతోనే ఉన్నావా? లేవా?
ఎందుకలా దూరంగా
నన్నొదిలి వెళ్ళి పోయావు
నీ వెంట నడవలేక కాదు గాని,
నీకది ఇష్టమో కాదో తెలియక
ఎం చేయాలో తోచక ఆగిపోయా.
ఓ క్షణం ఆగి చూస్తే
నీకూ నాకూ
మధ్య యుగాల దూరం.
నీకూ నాకూ మధ్య
మాటలు కరువయ్యి,
మనుషులు చొరబడ్డరు.
ఈ దూరాలు చెరిపే
అయుధం నీ వద్దే ఉంది.
అందుకే నీ వైపే
ఆశగా చూస్తున్నా.
ఒక్క అడుగు ఇటు
నా వైపు వెయ్యు.
ఒక్క క్షణం గడువియ్యు.
నీతో నడవాలని ఉంది
నీతో మాట్లాడాలని ఉంది ప్లీజ్
అడక్కుండానే మనసులోకి
చొరబడే చొరవ చేస్తావ్
చెప్పకుండానే గుండె చీల్చిపోతావ్.
నాకెప్పుడూ అయోమయం
నువ్వు నాతోనే ఉన్నావా? లేవా?