శతకోటి కోణాల్లో విరిగిపోయిన
సజీవ శిల్పాన్ని నేను
తెరమీద బొమ్మ గానే
తడిమి చూస్తున్నారు...
చేతికంటిన తడిని
తుడుచుకెళుతున్నారు..
నేను ఒకడిని ఉన్నాను
అన్న ధ్యాసేలేకుండా
అద్దం మీద
ఊదిన ఆవిరవుతున్నాను..
నాకు నేనే అజ్ఞాతనవుతున్నాను
కన్నీటి చలమల్లో ఇమడలేక
ఇక నా పరిచయమెవరినడగను ?
ఎన్నీ సార్లు నీ మౌనం ముందు
నన్ను నేను పరిచయం చేసుకోను
పగులుతున్న గుండెను
పెదిమల్లో చూపే సరికి
నీవే అనుకొంటున్నారు
నీ విరహంతో పగిలిపోయిన
మనస్సు ముక్కలేరుకుంటూ
మిగిలిపోయాను ఒంటరిగా
నా లోతులు తవ్వి
నీలో నన్ను పూడ్చాలను
చూస్తున్నాను
నేను నీకోసం
పోసిన కన్నీటి గుట్టలు
నన్ను నన్నుగా...
చూపలేక పోతున్నాయి..
ఏకాంతంగా మిగిలిపోయాయి
మన జ్ఞాపకాలు అందుకేనేమో
సజీవ శిల్పాన్ని నేను
తెరమీద బొమ్మ గానే
తడిమి చూస్తున్నారు...
చేతికంటిన తడిని
తుడుచుకెళుతున్నారు..
నేను ఒకడిని ఉన్నాను
అన్న ధ్యాసేలేకుండా
అద్దం మీద
ఊదిన ఆవిరవుతున్నాను..
నాకు నేనే అజ్ఞాతనవుతున్నాను
కన్నీటి చలమల్లో ఇమడలేక
ఇక నా పరిచయమెవరినడగను ?
ఎన్నీ సార్లు నీ మౌనం ముందు
నన్ను నేను పరిచయం చేసుకోను
పెదిమల్లో చూపే సరికి
నీవే అనుకొంటున్నారు
నీ విరహంతో పగిలిపోయిన
మనస్సు ముక్కలేరుకుంటూ
మిగిలిపోయాను ఒంటరిగా
నా లోతులు తవ్వి
నీలో నన్ను పూడ్చాలను
చూస్తున్నాను
నేను నీకోసం
పోసిన కన్నీటి గుట్టలు
నన్ను నన్నుగా...
చూపలేక పోతున్నాయి..
ఏకాంతంగా మిగిలిపోయాయి
మన జ్ఞాపకాలు అందుకేనేమో