అదిగో అల్లదిగో
కనువిందు చేస్తున్న
కమనీయదృస్యం
ఒకసారి మోవిపై జారి
ఒకమారు గాలితో జత చేరి నీ జ్ఞాపకాలకు
ఎన్ని విలాసాలో
ఎన్నెన్ని విన్యాసాలో
పలకరించి
పులకరించేలా చేస్తాయి
అభ్యంజనానంతరం
చిరుగాలికి
నీ మోముపై తేలియాడుతున్న
ఆ కురుల కెంత సంబరం
మోమున ఆ స్వైర విహారం పచ్చని ప్రాంగణాన చేరి
ఆ కేరింతల వినోదం
అవి పలకరింపులో
పలవరింతలో
రహస్య సంప్రదింపు లో
మారుతున్న రంగులేన్నీ
లెక్కబెట్టే సరికే
తెల్లని వర్నం లోకి మారుతోంది
నిసిరాతిరి వేళ
ఎదపై పవళించిన వేళ
మోమును కప్పినవి
కురుల రాగాలా
కారు మేఘాలా
ఆకురుల నింగిలో దాగిన
నగు మోము సోయగం
విరుల పరిష్వంగం లో
రంగు రంగుల వైభవం
వర్ణించగ నాకు సాధ్యమా