మనసు తవ్వి జ్ఞాపకాలు పూడ్చి
త్యాగమనో గెలుపనో ఫలకన్ని తగిలించి
ఆశ నీళ్ళతో అభ్యంగన మాడించి
గుండె పెంకుల్లో ముఖం చూడలేను.
నన్ను నేను ఒదార్చుకోలేను
నీ పేరు పిలిచి పిలిచి
నాలుక పిడచకడుతున్నా..
నీకోసం ఎదురు చూసిచూసి
కళ్ళు రంగుమారుతున్నా..
శ్వాస బదులు నిట్టూర్పులు
సెగలు రేపుతున్నా.
గుంటకంటిలో జీవం
నను వీడిపోతున్నా ఎక్కడో ఆశ
నీవొస్తావని ఎక్కడీ మినుకు
మినుకు మంటున్న చిన్ని ఆశ
ప్రణయమని పగిలి మిగిలేకంటే
అహంతో గద్దించి గెలవడంకంటే
మొండి ప్రేమలో..
దీపపు పురుగులా కాలేకంటే
కన్నీటి లొ కొట్టుకుపోవడమే మేలు
త్యాగమనో గెలుపనో ఫలకన్ని తగిలించి
ఆశ నీళ్ళతో అభ్యంగన మాడించి
గుండె పెంకుల్లో ముఖం చూడలేను.
నన్ను నేను ఒదార్చుకోలేను
నీ పేరు పిలిచి పిలిచి
నాలుక పిడచకడుతున్నా..
నీకోసం ఎదురు చూసిచూసి
కళ్ళు రంగుమారుతున్నా..
శ్వాస బదులు నిట్టూర్పులు
సెగలు రేపుతున్నా.
గుంటకంటిలో జీవం
నను వీడిపోతున్నా ఎక్కడో ఆశ
నీవొస్తావని ఎక్కడీ మినుకు
మినుకు మంటున్న చిన్ని ఆశ
ప్రణయమని పగిలి మిగిలేకంటే
అహంతో గద్దించి గెలవడంకంటే
మొండి ప్రేమలో..
దీపపు పురుగులా కాలేకంటే
కన్నీటి లొ కొట్టుకుపోవడమే మేలు