. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, July 31, 2014

ఈ ఏకాంతం నీవు నాకిచ్చిన వరమేమో .

గడిచిన చీకటి రాత్రుల్లో
నేను గడిపిన ఏకాంత తాత్రులెన్నో 
నాలాగా కొట్టుకు చచ్చే 
ఒంటరి జీవిత గాధలెల్లో 
ఏమీ చేయలేని అచేతున్నై 
అస్థిత్వపు మనస్సు ఆరాటపు  పోటీల్లో
నాకు నేను తడుముకొంటూనేఉన్నా  
ఒరిగిన క్షతగాత్రున్నై 
ఒంటరిగా తిరుగుతూనే ఉన్నా  
ఆశా సౌధపు మార్గాన్ని  మరచి
దిక్కు తోచక తిరుగుతున్నా
దిక్కులు చూసే కన్నుల్లో
నాదిక్కు చూసే చూపుకోసం 
నాకు నేను ఎదురు చూస్తూనే ఉన్నా
తీరని కోర్కెల సమాధుల్లో
నన్ను నేను పూడ్చుకొంటూ 
ఆరాటము చావని ఆత్మల సాక్షిగా 
మృతకలేబరంగా మారిన ఈ క్షనం 
రాకుంటే బాగుండు అనుకున్నా 
కాని ఈ ఏకాంతం 
నీవు నాకిచ్చిన వరమేమో కదూ 

Wednesday, July 30, 2014

మన జ్ఞాపకం మరో ఎర్ర గులాబై పూసింది నాగుండెలో

ఆక్రోశం. ఆవేదనై
అక్కరకు రాని అక్షరాలుగా 
మారుతున్నాయి
కదిలే భావాలతో గతమంతా
కవితలో ఉప్పొంగుతుంది
ఆరాటమా పదాల్లో నుండి తొణుకుతుంది.
ఆ రెప్పల అలికిడి నా అధరాలనొణికిస్తుంది..

చేదు జ్ఞాపకాల 
అనుభవాలు ఆ ముళ్ళు.
మనసు నిండిన 
ముళ్ళు నా లోనేపెట్టుకొని 
మధురంగా ..నీకోసం..
తలయెత్తి పూసిన
నా ఆశ గులాబీలవి.. 
నా రుధిర జ్ఞాపికలవి
అవును కేవలం నీకోసం.. 
విధినేమనను ?
నీది కానప్పుడు .. 
వినలేని తీరిక నీకు లేనప్పుడు
నిచెవికి చేరి నీమనస్సుకు చేరలేని 


అవన్నీ నీజ్ఞాంపకాలుగా మారి  
గులాబి ముళ్ళై నన్నే గుచ్చేస్తున్నాయి 

నీ నా ల బేధాలున్నాయని
ఇంకా మన మధ్య ఉంటాయని అనుకోలేదు
నీ నవ్వులు, ఆ మధుర భావాలు, ఊసులు
నా మది గాయాలకు నవనీతాలు గామారాయి 
నీవన్నీ నావనుకున్నా.. 
నేనే నీవాడనుకున్నా
ఆ నవ్వులు నీవంటావా ... 
కాదని తేల్చేకదా 
కనికరంలేకుండా వెల్లిపోయావు    
ఇప్పుడే మల్లీ  
నా మనసు మీద మరో ముల్లు
మొలిచింది.. 
నాగుండెకు గుచ్చుకుంది..
చూశావా.. నీకోసం. 
మన జ్ఞాపకం మరో  
ఎర్ర గులాబై పూసింది 
నాలో ఇంకా 
రక్తం మిగిలి ఉండేమో అని 
గుండెలో ఉందేమొనని 
రక్తాని తోడుతోంది 
నిర్దయగా 
జాలనేది లేదుకదా నీకు 

నిన్ను నా ఊహల్లో 
నింపుకుంటూ..
గుండె గాయాలు 
పూడ్చుకుంటూ..
నీ బాటన గులాబీలు 
పరుచుకుంటూ..
విధి వెల్లువలో 
కొట్టుకు పోతున్న నేను... 
నీ చెలిమి కోసం ఎదురు చూస్తున్న 
ఆశచావని నిరాశను మిగుల్చుకున్న 
చకోరాన్ని నేను..
నా కంటి స్వాతి చినుకులు గుండెల్లో
దాచుకుని.. నీకోసం ముత్య మవుతున్న
ఆలు చిప్పను నేను.
నీకై గులాబీలు పూయిస్తున్నా 
నా గత జ్ఞాపకాల కంపను నేను
ఎప్పటికి నన్ను నన్నుగా గుర్తిస్తావో ఏమో 

Tuesday, July 29, 2014

కోబ్రా న్యూస్ ...> స్వచ్చంద నిఘా సంస్థ


కోబ్రా న్యూస్ ...గ్త్; స్వచ్చంద నిఘా సంస్థ.
..చీకటిమాటున జరుగుతున్న అన్యాయాలపై...మీడియా మిత్రులచే స్థాపించిన సంస్థ..అత్యాధునిక సీక్రెట్ కెమేరాలతో వెలుగుకు రాని వాస్తవాలపై ..ఏర్పాటు చేసిన సంస్థ ఇది .బ్లాక్ మైలింగ్...అక్రమాలు అన్యాయాలు ఎలాంటి సమాచారం అయినా మాకు సాక్ష్యాదారాలందిస్తే లోతైన పరిశోదన చేసి పోలీసుల సహకారంతో నిజాలను వెలికి తీస్తాం.. మా సంస్థలో ప్రముఖ న్యాయవాదులు సాంఘిక కావిద్యావేత్తలు, కార్యకర్తలు,రిటైర్ట్ పోలీస్ ఆఫీసర్లసలహాలతో స్వచ్హందా పని చేస్తారు సమాజానికి సేవచేయాలనే దృక్పదం ఉన్న ఎవరైనా మా సంస్థలో బాగస్తులు అవ్వొచ్చు..ఒక ఆలోచన... ఎన్నీ మార్పులకు కారణం అవుతుంది .. సమాజాన్ని సమూలంగా మార్చలేం.. ఓ కొత్త ఒరవడితో .మనకోసం మనం పోరాడుదాం .మరొకరికి చెప్పుకోలేక భాదపడుతున్న వారికి మా ఆసర...మీ వివరాలు చాలా సీక్రెట్ గా ఉంచుతాం ఎలాంటి సమాచారానైనా మాకు ఇవ్వొచ్హు చట్టపరిదిలో ...మనకు జరిగాల్సిన న్యాయాన్ని మనమే సాదించుకుందా...ఈ స్వచ్చంద నిఘా సంస్థలో మీరు మాతో చేతులు కలపంది.. ఈ ఆలోచనకు అన్ని మీడియా సంస్థలు సహకరించేందుకు ముందుకొస్తున్నాయి..నిజం భయాన్ని కోరదు నిద్బయంగా నిజకోసం పోరాడుదాం ..అవినీతి పరుల ఆటకట్టిద్దాం...సీక్రెట్ గా ఎప్పుడు ఎక్కడ మన ఉనికి చూసి అక్రమార్కులు దడుచుకోవాలి .,, ఈ యజ్ఞంలో మీరు మాకు సహకరించాలి


Monday, July 28, 2014

నాకు నేనే అజ్ఞాత నవుతున్నాను కన్నీటి చలమల్లో ఇమడలేక

శతకోటి కోణాల్లో విరిగిపోయిన
సజీవ శిల్పాన్ని నేను
తెరమీద బొమ్మ గానే
తడిమి చూస్తున్నారు...
చేతికంటిన తడిని
తుడుచుకెళుతున్నారు..
నేను ఒకడిని ఉన్నాను
అన్న ధ్యాసేలేకుండా

అద్దం మీద
ఊదిన ఆవిరవుతున్నాను..
నాకు నేనే అజ్ఞాతనవుతున్నాను
కన్నీటి చలమల్లో ఇమడలేక
ఇక నా పరిచయమెవరినడగను ?
ఎన్నీ సార్లు నీ మౌనం ముందు
నన్ను నేను పరిచయం చేసుకోను

పగులుతున్న గుండెను
పెదిమల్లో చూపే సరికి
నీవే అనుకొంటున్నారు
నీ విరహంతో పగిలిపోయిన
మనస్సు ముక్కలేరుకుంటూ
మిగిలిపోయాను ఒంటరిగా

నా లోతులు తవ్వి
నీలో నన్ను పూడ్చాలను
చూస్తున్నాను
నేను నీకోసం
పోసిన కన్నీటి గుట్టలు
నన్ను నన్నుగా...
చూపలేక పోతున్నాయి..
ఏకాంతంగా మిగిలిపోయాయి
మన జ్ఞాపకాలు   అందుకేనేమో

Saturday, July 26, 2014

మనసు తవ్వి జ్ఞాపకాలు పూడ్చి

మనసు తవ్వి జ్ఞాపకాలు పూడ్చి
త్యాగమనో గెలుపనో ఫలకన్ని తగిలించి
ఆశ నీళ్ళతో అభ్యంగన మాడించి
గుండె పెంకుల్లో ముఖం చూడలేను.
నన్ను నేను ఒదార్చుకోలేను 

నీ పేరు పిలిచి పిలిచి 
నాలుక పిడచకడుతున్నా..
నీకోసం ఎదురు చూసిచూసి 
కళ్ళు రంగుమారుతున్నా..
శ్వాస బదులు నిట్టూర్పులు 
సెగలు రేపుతున్నా.
గుంటకంటిలో జీవం 
నను వీడిపోతున్నా ఎక్కడో ఆశ 
నీవొస్తావని ఎక్కడీ మినుకు 
మినుకు మంటున్న చిన్ని ఆశ

ప్రణయమని పగిలి మిగిలేకంటే
అహంతో గద్దించి గెలవడంకంటే 
మొండి ప్రేమలో..
దీపపు పురుగులా కాలేకంటే 
కన్నీటి లొ కొట్టుకుపోవడమే మేలు

Friday, July 25, 2014

గుండె తెరలలో చెలరేగుతున్న అలజడి

నా గుండె తెరలలో అనుక్షణం చెలరేగుతున్న అలజడి నీతో చెప్పబోయేసరికి అట్టడుగు పొరలను వీడి బయటకు రావటంలేదు. మన్సులోని మాట కళ్ళలో కనిపిస్తుందని అంటారు. నా కళ్ళు చేసే గుస గుసలు, చెప్పే ఊసులు నీ వరకు చేరాయో లేదో నాకు తెలియదు. నేను నీతో గడిపే క్షణాలలో ఓ చిరునవ్వు లేదంటే కాస్త మౌనం తప్ప ఏమీ సాధించలేకపోయాను.నీ స్పందన కోసం అనుక్షణం అన్వేషిస్తున్న నాకు నీ మౌనమనే చీకటి నిరంతరం అంతరాయం కలిగిస్తుంది. ఈ అన్వేషణలో చిత్తుగా ఓడిపోయాను. అందుకే ధైర్యం చేసి ముందడుగు వేసి చెబుతున్నా, లయ బద్దమైన నా హృదయస్పందన విను. నేను…నిన్ను…ప్రేమిస్తున్నా. నాకున్న అంతులేని ప్రేమని ఎంతగా చెప్పాలని ప్రయత్నిస్తున్నా ఈ మూడు మాటలు తప్ప ఏమీ స్ఫురించటం లేదు. అయినా ఇంకా ఏదో చెప్పాలనే తపన నన్నింకా వ్రాయమని ముందుకు తోస్తుంది. నీవులేని లోకంలో నేను కోరుకునేది ఏదీ లేదు, చావుని తప్ప. నా ఆశలు,ఆశయాలు,ఆకాంక్షలు అన్నీ నీకై వేచి ఉన్నాయి, నీతో ముడిపడి ఉన్నాయి. కళ్ళముందు అనుక్షణం నీ రూపమే కనిపిస్తుంది. ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా  నీ ఆలొచనలే నన్ను వెంటాడుతున్నాయి. ఎవరు పిలిచినా నీవే అనిపిస్తుంది. కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది, ఒక మనసుని మరో మనస్సు ఇంతలా వెంటడుతుందా? వూపిరితీయనీకుండా వుక్కిరిబిక్కిరి చేస్తుందా? నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పగలరు నీవు తప్ప.అందుకే నీ సానుకూల స్పందన కోరుకుంటూ మరొక్కసారి చెబుతున్నా.I Love You ఈ మాటలన్నీ ఎన్నోసార్లు ఎంతో మంది చెప్పి మాములు మాటలయిపోయాయి. కానీ ప్రతి మనిషి జీవితం విలువయినదే, ప్రతి మనిషి ప్రేమ, అనుభూతులు అమూల్యమైనవే. ఇంకా ఏదో చెప్పాలని వున్నా తరువాత ఉత్తరానికై వాటిని నా హృదయంలో భద్రంగా పొందుపరిచాను. కానీ ఈసారి సంభోదన నేస్తమా అనికాక, ప్రియతమా అని వ్రాయగలిగే అవకాశం కోరుకుంటూ..

Thursday, July 24, 2014

ఏంటో ఏటు చూసినా శూన్యం


 ఏంటో ఏటు చూసినా శూన్యం 
నువ్వు వెళ్ళిపోయావు ..... 
చుట్టుతా ... శూన్యం ....
ఎటుచూసినా శూన్యం .
నేనేమో కారనాలెతుక్కుంటూ 
కారుచీకట్లో పరుగులు పెడుతున్నా 


శూన్యాన్ని పారద్రోలే ....
ఓ ..... బలీయ ఆయుధం కోసం 
అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నా 
అవిశ్రాంతంగా వెతుకుతున్నాను ..... నేను .

ఎక్కడో దూరంగా ..
మెరుపు మెరిసింది 
అక్కడ నీవు కనిపిస్తావేమో  అని   
ఆత్రంగా వెతికా కాని చుట్టూ ఏమీ లేదు   
అయినా ...... చుట్టూ ..... శూన్యం 


వేల కాంతి దీపాలు ...
వెలుగుతున్నాయి ... చుట్టూ .
అక్కడ నీ ఆనవాల్లు 
కనిపించినట్టే కనిపించి 
కనిపించకుండా పోతున్నాయి 
తిరిగి చూస్తే ఏమీ కనిపించడంలేదు 
అయినా ...... చుట్టూ ..... శూన్యం .. 

కోటి కాంతులతో ... ప్రభాకరుడూ
మిల మిలా ... మెరుస్తున్నాడు
ఆ మెరుపుల సందుల్లో 
నీవు కనిపీంచి దగ్గరకు వెల్లే సరికి 
కనిపించకుండా పోతున్నావు 
అక్కడకు నీకోసం వెలితే 
 చుట్టూ ..... శూన్యం

కోటి మంది జనాన్ని ..
కూడగట్టుకుని .....
చుట్టూ .... పోగేసుకున్నాను 
అయినా ...... చుట్టూ ..... శూన్యం 

గాలిలో ఎగురుతున్న ...
రాగాలనన్నింటినీ .... కట్ట కట్టి ....
చెవిలో పోసుకున్నాను 
అయినా ...... చుట్టూ ..... శూన్యం 
ప్రకృతిలోని రంగులన్నింటినీ ...
ఏరి కోరి .... పిండి ... పిండి ....,
కంట్లో పోసుకున్నాను 
అయినా ...... చుట్టూ ..... శూన్యం

సృష్ఠిలోని రుచులనన్నింటినీ .....
ఏర్చి కూర్చి .... ముద్దచేసి .....
నోట్లో .. పోసుకున్నాను 
అయినా ...... చుట్టూ ..... శూన్యం 

లోకంలోని ఆనందాన్నంతా ......
రంగరించి ..... ముద్దచేసి .....
మనసుకి ... పట్టించుకున్నాను 
అయినా ...... చుట్టూ ..... శూన్యం

నీ జ్ఞాపకాలన్నింటినీ ......
చుట్టూ ... ఒలకబోసుకుని .....
మళ్ళీ ..... మళ్ళీ .....
ఏరుకునే ప్రయత్నం ..... చేస్తున్నాను
అయినా ...... చుట్టూ ..... శూన్యం


సర్వేంద్రియాలతో .... 
దేహం పొడుచుకున్నా
కానరాని ఈ శూన్యంలో .......
అక్షరాల్లో ..... అర్ధాల్నీ ....,
పదాల్లో ..... భావాన్నీ ..... వెతుక్కుంటూ
వ్యర్ధ తాపత్రయం .... పడుతున్నాను

నీవు లేని శూన్యాన్ని ......
వృధా కవిత్వంతో నింపే ప్రయత్నం చేస్తూ 
కాగితాల్ని ...ఖరాబు చేస్తున్నాను
ఎప్పుడైనా ..... నువ్వు చూడకపోతావా 
ఎప్పుడైనా ..... నీ కంట పడకపోతుందా 

జోరుగ వర్షం కురుస్తోంది


కిటికీ అవతల 
జోరుగ వర్షం కురుస్తోంది
తెల్లని పువ్వయి విచ్చుకున్న 
ఆకాశపు హృదయం నుండీ
సౌహార్ద్రం జాల్వారినట్లు వాన
జననాంతర సౌహృదాలేవో 
జలజలా పారుతూ
రోడ్లను తడుపుతోంది
మదిలో వర్షపు చినుకుల
చప్పుడు లయబద్దకంగా
మ్రోగుతూ జాలువారుతున్న
 వర్షంలా ఆలొచనలు ఏటో వెల్లిపోతున్నాయి

నీతో మాట్లాడాలని ఉంది ప్లీజ్

నేస్తమా!
ఎందుకలా దూరంగా 
నన్నొదిలి వెళ్ళి పోయావు
నీ వెంట నడవలేక కాదు గాని,
నీకది ఇష్టమో కాదో తెలియక
ఎం చేయాలో తోచక ఆగిపోయా.
ఓ క్షణం ఆగి చూస్తే
నీకూ నాకూ 
మధ్య యుగాల దూరం.
నీకూ నాకూ మధ్య 
మాటలు కరువయ్యి,
మనుషులు చొరబడ్డరు.
ఈ దూరాలు చెరిపే 
అయుధం నీ వద్దే ఉంది.
అందుకే నీ వైపే 
ఆశగా చూస్తున్నా.
ఒక్క అడుగు ఇటు 
నా వైపు వెయ్యు.
ఒక్క క్షణం గడువియ్యు.
నీతో నడవాలని ఉంది 
నీతో మాట్లాడాలని ఉంది  ప్లీజ్
అడక్కుండానే మనసులోకి 
చొరబడే చొరవ చేస్తావ్
చెప్పకుండానే గుండె చీల్చిపోతావ్.
నాకెప్పుడూ అయోమయం
నువ్వు నాతోనే ఉన్నావా? లేవా?


Monday, July 21, 2014

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(36)

1) నా కంటి స్వాతి చినుకులు గుండెల్లో
దాచుకుని.. నీకోసం ముత్య మవుతున్న ఆలు చిప్పను నేను.

2) గుండె గాయాలు పూడ్చుకుంటూ..
నీ బాటన గులాబీలు పరుచుకుంటూ..విధి వెల్లువలో కొట్టుకు పోతున్నా..?

3) ఎన్ని ఆనందాలను జ్ఞాపకాలు చేస్తావు?
ఎన్ని ఆశలు నిరాశలు చేస్తావ్‌ ?..నీకిది న్యాయమా.. నీకిది దర్మమా..?

4) నన్ను గుర్తించిన ఒక్కో జ్ఞాపకం
నన్నో ఏకాంతాన్ని చేసి వెళ్ళిపోతున్నాయి

5) రెప్పల చాటున దాగిన దృశ్యాలన్నీ
పెదాలు బిగించి ఒక్కొ వంతెన్నీ దాటుకుంటూ వెళ్ళుతున్నాయి

6) న‌న్నే గమనిస్తున్న నా నీడ‌
కాళ్ళీడ్చుకుంటూ నా వెంటే ఉంటుందనుకున్నావా?

7) సెలయేరులో గులకరాళ్ళలా ఒదిగిపోయి..
కాలంతో కోసుకుపోతూ మృదుత్వం మొహాన పులుముకుంటూ.సాగిపోతున్నా ఇలా

8) అయోమయంలో అవస్థలకన్నా..
కారే కన్నీళ్ళలో కలిసి కొట్టుకుపోవడమే.. సుఖమనిపిస్తుంది.

9) స్పందించే మనసు కరువయినప్పుడు
ఊసులతో కలిసి సమాధవడమే ఎందుకో సుఖమనిపిస్తుంది..

10) గుండె లోతుల్లోని కొన్ని ఊసులు
కళ్ళతో చెపితే మనసుతో వినాల్సిందే ఆ ఊసులు చెప్పరాకే నా మౌనం

11) అలుపెరుగని అలల మధ్య దరిలేని తీరాలు, తీరని దాహాలతో
హృదయానికి ఊతమిచ్చే మనస్సు కోసం నిన్నటిలానే ఈరోజూ ఎదురు చూసున్నా

12) మడతపడిన నాలుకపై పన్ను దిగి 
రక్తం కారుతోంది పోగేసుకొచ్చిన మాటలన్నీ ఎర్రగా మారాయి

13) మనిద్దరి మధ్య జరిగిన మాటలన్నీ పోగేసి 
గుట్టలుగా చేసి నీ దగ్గరకొస్తే దగ్గరితనం దూరం అవుతోంది

14) నీతో మాట్లాడాలనే 
ఉద్వేగం అధరాలపై ఆత్రంగా నీపేరును పలుకుతొంది

15) వెన్నులో వచ్చే అలజడిలో 
నిన్ను చూడాలనే ఆరాటం గుండెల్లోంచి తన్నుకొస్తుంది

16) నాలో నేను నలిగి అడవిలో పడీన ఎండుతాకుల్లా 
మనిద్దరి జ్ఞాపకాలను తొక్కుకుంటూ వెల్తున్నావుగా

17) నా కంటి స్వాతి చినుకులు గుండెల్లో
దాచుకుని.. నీకోసం ముత్య మవుతున్న ఆలు చిప్పను నేను.

18) గుండె గాయాలు పూడ్చుకుంటూ..
నీ బాటన గులాబీలు పరుచుకుంటూ..విధి వెల్లువలో కొట్టుకు పోతున్నా..?

19) ఎన్ని ఆనందాలను జ్ఞాపకాలు చేస్తావు?
ఎన్ని ఆశలు నిరాశలు చేస్తావ్‌ ?..నీకిది న్యాయమా.. నీకిది దర్మమా..?

20) నన్ను గుర్తించిన ఒక్కో జ్ఞాపకం
నన్నో ఏకాంతాన్ని చేసి వెళ్ళిపోతున్నాయి

21) రెప్పల చాటున దాగిన దృశ్యాలన్నీ
పెదాలు బిగించి ఒక్కొ వంతెన్నీ దాటుకుంటూ వెళ్ళుతున్నాయి

22) న‌న్నే గమనిస్తున్న నా నీడ‌
కాళ్ళీడ్చుకుంటూ నా వెంటే ఉంటుందనుకున్నావా?

23) సెలయేరులో గులకరాళ్ళలా ఒదిగిపోయి..
కాలంతో కోసుకుపోతూ మృదుత్వం మొహాన పులుముకుంటూ.సాగిపోతున్నా ఇలా

24) అయోమయంలో అవస్థలకన్నా..
కారే కన్నీళ్ళలో కలిసి కొట్టుకుపోవడమే.. సుఖమనిపిస్తుంది.

25) స్పందించే మనసు కరువయినప్పుడు
ఊసులతో కలిసి సమాధవడమే ఎందుకో సుఖమనిపిస్తుంది

26) గుండె లోతుల్లోని కొన్ని ఊసులు
కళ్ళతో చెపితే మనసుతో వినాల్సిందే ఆ ఊసులు చెప్పరాకే నా మౌనం..

27) అలుపెరుగని అలల మధ్య దరిలేని తీరాలు, తీరని దాహాలతో
హృదయానికి ఊతమిచ్చే మనస్సు కోసం నిన్నటిలానే ఈరోజూ ఎదురు చూసున్నా

28) మడతపడిన నాలుకపై పన్ను దిగి 
రక్తం కారుతోంది పోగేసుకొచ్చిన మాటలన్నీ ఎర్రగా మారాయి

29) మనిద్దరి మధ్య జరిగిన మాటలన్నీ పోగేసి 
గుట్టలుగా చేసి నీ దగ్గరకొస్తే దగ్గరితనం దూరం అవుతోంది

30) నీతో మాట్లాడాలనే 
ఉద్వేగం అధరాలపై ఆత్రంగా నీపేరును పలుకుతొంది

31) వెన్నులో వచ్చే అలజడిలో 
నిన్ను చూడాలనే ఆరాటం గుండెల్లోంచి తన్నుకొస్తుంది

32) నాలోని నరాలన్నిటిని తెంచేసి నాలో నేను లేకుండా వంటర్ని చేసి
చావును నాపక్కన పడుకోబెట్టి వెర్రి నవ్వులు నవ్వుతాయి నీ "జ్ఞాపకాలు

33) అనుక్షణం వెంటాడుతూ నాతో పోరాడతాయి
నే పోరాడలేనని ఎదిరిస్తే నాకు దూరమై శిక్షిస్తాయి నీ జ్ఞాపకాలు

34) నీ నవ్వుని జయించలేనేమో అని భాదేస్తుంది
ఒకర్ని భాదపెడుతున్నాం అనే స్పృహలేకుండా నవ్వటం కూడా ఒక వరమే కాదా.

35) నాకై నేనే పేర్చుకున్న చితిలో తగలబడిపోతున్న 
నా వెర్రితనాన్ని చూసి నవ్వుకుంటావ్ కదూ నేనెవరో తెలియనట్టు

36) నన్ను నేనే ఈ లోకం నుండి వెలివేసుకున్నా
ఒంటరి తనాన్ని కావలించుకుని చీకట్లో పడుకున్నా తప్పని పరిస్థితుల్లో

37) ఇద్దరుగా మొదలయిన మన ప్రయాణంలో 
నువ్వు మాత్రం ఒడ్డుకు చేరుకున్నావు..నన్ను నడి సముద్రంలో వదలి

38) ఏకాంత సాయంత్రాలు నన్ను ఒంటరిగా నడిపిస్తాయి...
కొన్ని మదురక్షనాలు నా ఒక్కడితోనే సంభాషిస్తాయి...

39) నీ జ్ఞాపకం ఓ చురకత్తి అయి 
ప్రతి క్షనం గుండెల్లో పొడుస్తూనే ఉంది

40) సందెలు వాలిపోతాయి..నీడలు చీకట్లో కలిసిపోతాయి జ్ఞాపకాలు
ఎదురుచూస్తూ ఉంటా..ఎనాడైనా ఈ కొమ్మలపై మరలా వాలతావని.వస్తావుకదూ,,?

41) ఏడుస్తూ వస్తాం ...ఏడిపిస్తూ పోతాం
ఏడ నుండి వస్తామో...ఏడకెళ్ళిపోతామో

42) కర్కశత్వపు అమాయకత్వానికి జాలితో కృతజ్ఞతలు చెబుతూ
కుట్లుపడ్డ పెదాల మీద రక్తం చిమ్ముతూ గులాబీలా విచ్చుకుందో చిరునవ్వు

43) అన్నీనేనె అనుకున్నది స్వార్థమే అ౦తా నాకే కావాలనుకున్న 
పొసెసివ్ నెస్ నన్నిలా చేస్తో౦దా? ఏమో నాది నిజ౦గా ఐడె౦టిటీ ప్రాబ్లమే...

44) నా హృదయారణ్యంలో నీ ప్రేమ సమాధిపై రాస్తున్నా 
ఈ అక్షరాలు అక్షరాలు కావివి, నా గుండె గాయపు రక్తాశ్రువులు ....

45) కన్నీరు కడలయి చెక్కిలి తీరం చేరగా, 
మూగబోయిన స్వరం మౌన రాగం ఆలపించగా,

46) నేస్తం నా చెంత నువ్వు లేని క్షణం
నాకోసం నేనే వెతుకుతున్నా నీ జ్ణాపకాల ఒడిలో కరిగిపోతున్న

47) నువ్వు కాగితాల రెప రెపలతో పోలిస్తే.....
నా కలలన్నిటిని నోట్ల కట్టల్లా....బీరువాలో దాచాల్సిందేనా....?

48) నువ్వు జీవితం కోసం వేస్తున్న స్కెచ్లలలో...
పనికిరాని గీతల్ల నా కోరికలు ఏరేజ్ అవుతున్నాయి.

49) గోడమీద చిన్న ముల్లు
ఈ బరువైన కాలాన్ని నెట్టటానికి అష్టకష్టాలు పడుతుంది

50) చిక్కబడ్డ శీతకాలపు బూడిద రంగు 
అంతేనా, చావు చీపురు పుచ్చుకొని భూమంతా తిరుగుతుంది

51) నీకై గుండె వేగంగా కొట్టుకుంటున్న ప్రతిసారి
పచ్చని కొమ్మలమీద పూలు విరబూసినట్లు ఒక అనురాగ కృతి వినపడుతుంది

52) మౌనం నాతో జతకలిపిన ప్రతిసారీ
అంతరంగం అక్రోశించి గొంతు సవరించుకుంటుంది

53) ఓటమిలో చనిపోతూనే వున్నా
నన్ను నేను నిర్వచించు కుందాం అనుకుంటే నాలో సూన్యిం ఆవరిస్తుంది

54) నాలో నేను మళ్ళీ మళ్ళీ పుడుతుంటా
అవమానాల్లో కాలిపోతూ నిరుత్సాహంలో క్రుంగిపోతూ

55) కాలంతో సమాంతరంగా 
పరిగెడుతూనే ఉన్నా జీవితాన్నో, ప్రపంచాన్నో ఇంకాదేన్నో తెలుసుకోవాలని

56) హృదయాంతరాల దగిన భాదను నేలమాళిగల్లో ఛేదించలేని 
ఇంత విశాలమైన ప్రపంచంలో చిక్కుముడులు విప్పి చెప్పుకునేందుకు ఒక్కమనిషి లేడా

57) ఎదనిండా ఖాళీ.. 
భర్తీ చేయలేని శూన్యం ప్రశాంతతను ఎవరు భగ్నం చేసారు?

58) మనసు గలాన్ని విప్పి మనసులోపల 
దాగున్న నిజాన్ని చెప్పాలనుకున్న ప్రతిసారి గొంతును నొక్కేస్తున్నారు

59) ఒక్కోసారి తనువును తగలబెడుతున్న వెలుగు కంటే...
కళ్ళు కనిపించనంత చీకటే నయమనిపించేలా చేసావు ఎందుకో చెప్పవూ

60) నీ కలలును ఆపలేకపొయింది..
నీ భావాలు ముట్టడిస్తున్నాయని తెలిసి

61) నల్లటి మేఘాలు కమ్ముకొని చిమ్మచీకట్లు కమ్ముకున్నవేల 
ఆ చీకట్లో వర్షిస్తున్న నిశ్శబ్దంలో తడుస్తూ వెతుకుతున్నా నీకోసం

62) శూన్యం తరుముతుంటే రాల్చుకున్న గతాన్ని
సీతాకోకచిలుకల రెక్కల స్వేచ్చని ఏరుకుంటూ నడుస్తున్నాను

63) పోగొట్టుకోవడం చాలా తేలిక
తిరిగి పొందాలంటేనే మరో జీవితకాలం తపస్సు చేయాలి

64) మేఘాలను ఒరుసుకున్నప్పుడు తీరని తాపపు
అసంతౄప్తి కెరటం అంతరంగం నిలువెత్తు అగ్నిగుండంలో అహూతి అవుతూనే ఉంది

65) రాత్రంతా మదనవేదన పడిన తనువు అనంతాకాశాన్నుంచి 
జాలువారుతున్న జాలిలేని మౌనంలొ మగ్గిపోతూనేవుందిగా

66) రాత్రికి రాత్రే కంటికి కనిపించకుండా..నన్ను కబలిస్తూ
కడుపారా ఆరగిస్తున్నగొంగడి పురుగులకు జ్ఞాపకాలను బలిచేస్తే ఎలా..?

67) మనసు కాలిన వాసనల మధ్య ఉక్కిరిబిక్కిరవుతూ
అప్పుడు గుర్తొస్తుందా గతంలోకి జారిపోయిన మన జ్ఞాపకాల తలపులు

68) ఆచ్ఛాదనే లేని అంతరంగాలకు
పొరలు పొరలుగా పేరుకుంటున్న జ్ఞాపకాల మరకలను చెరపలేవులే..?

69) రాలిపోతున్న రాత్రుళ్ళ సాక్షిగా..గాడితప్పిన గతాన్ని
దుమ్ముకొట్టుకుపోయిన స్వగతాలను తలచుకోని క్షనంలేదులే..?

70) దేహకమండలంలో కాసిన్ని నిశ్శబ్దపు నీళ్ళు నింపుకుని
నీకోసం పరితపించిన ప్రతిసారి ఆ నీళ్ళ కళ్ళను చేరుతున్నాయి కాని నీవెక్కడ

71) అలసిన దేహంలోంచి మొలుచుకు వచ్చిన 
జ్ఞాపకం నన్ను చూసి వెక్కిరిస్తుంది ఎందుకో చెప్పవూ

72) తణువు అణువణువు భావాల పూల పుప్పొడి
మనువులో వెన్నెల నిప్పుల అనుభవాల వేడి సెగ నాకు మత్రమే తగులుతోంది

73) ఈ క్షణాన్నే నిన్ను చేరాలని రెక్కలు కట్టుకుని
మొదలెట్టాను నా పయనాన్ని ఎందుకో అర్దాతరంగా అగిపోయింది

74) సవాల్ల మధ్యో శవాల మధ్యో మనుగిడలేక మునిగిపోతానో..
నిన్నే తలస్తూ నేనిలా బ్రతికున్న శవంగా మిగిలిపోతానో తెలియడంలేదు

75) నక్షత్రాలన్నీ నింగినుండి పోగుచేసి
నీపై కురిపించాలనివుంది..కాని కాలం కన్నెర్ర చేసిందిగా

76) ఒక్కడినే కూర్చున్నా నీగురించి ఆలోచిస్తూ
సముద్రమంత నిశబ్దం అలుముకుంది నా చుట్టూ..చిటపటచినుకులు నిశ్శబ్దాన్ని చేదిస్తున్నాయి

77) ఏమితోచక తోకచుక్కలా రాలుతున్న నా కన్నీళ్ళు 
అక్కడక్కడా నీటిచెమ్మలుగా మారి వర్షపు చినుకులై పడూతునే ఉన్నాయి

78) కాసింత శూన్యాన్ని తోడుకుని ముఖాన్ని దాచుకోవాలని చూస్తుంటే
గొంతులో కుక్కబడిన మౌనాన్ని చేదించినా లోన ఓకింత ఖాళీ మిగిలే ఉందిలే

79) మన జ్ఞాపకాలను కన్నీటితో కడుక్కుంటూ
నిన్ను నిన్నుగా చూసుకోవాలంటే వర్షం నన్ను తడిపేస్తున్నావుగా..?

80) విడుస్తున్న శ్వాసలో గతాన్ని వదులుతూ
శూన్యాన్ని పాన్పుగా చేసుకొని ప్రాణాన్ని వదిలేస్తున్నాలే

81) కొన్ని భయంకర జ్ఞాపకాల తరువాత చీకట్లో వర్షిస్తున్న
నిశ్శబ్దంలో తడుస్తూ నడుస్తున్నాను కన్నీటి తడిని గుర్తించలేని జనాలను చూస్తూ

82) ఘనీభవించిన చీకటిపై
మొలకెత్తుతున్న నల్లటి జ్ఞాపకాల నీడలు

83) ఏకాంత సాయింకాలపు పలుచని వెలుతురులో
హృదయంలో విరిసిన సన్నజాజుల్లా జ్ఞాపకం మదిలో గిలిగింతలు పెడుతూనే ఉంది

84) మనసు విషాదపు రోదనలను 
ఒంటరితనపు భావాలను మదిలోనిండిన మౌనాన్ని దాచలేకపోతున్నా

85) నీ కళ్ళలో కన్నీరులా జారి..
మనసులో భావంగా మారి నీ ఊపిరిలో శ్వాసగా చేరిందిగా

86) ఎదలోపలి అనుభూతులన్నీ ఎగిరిపోతూ
నిశిరాతిరి తారకలై,నిశీధిలో వేకువలై నిట్టూర్పుల్లో జారిపోయాయి

87) మది లోపలి ఊహలన్నీ
మౌనపు అంచున దాగి పెదవి దాటనంటున్నాయి

88) నిశ్శబ్దపు నిశీధుల్లోకి నా స్వరం తప్పిపోయింది
చీకటి ముసుగులో కనురెప్పల సరిహద్దుపైన కన్నీళ్ళే గెలిచాయి

89) కాసింత శూన్యాన్ని తోడుకుని ముఖాన్ని దాచుకోవాలని చూస్తుంటే
గొంతులో కుక్కబడిన మౌనాన్ని చేదించినా లోన ఓకింత ఖాళీ మిగిలే ఉందిలే

90) మన జ్ఞాపకాలను కన్నీటితో కడుక్కుంటూ
నిన్ను నిన్నుగా చూసుకోవాలంటే వర్షం నన్ను తడిపేస్తున్నావుగా..?

91) విడుస్తున్న శ్వాసలో గతాన్ని వదులుతూ
శూన్యాన్ని పాన్పుగా చేసుకొని ప్రాణాన్ని వదిలేస్తున్నాలే

92) కొన్ని భయంకర జ్ఞాపకాల తరువాత చీకట్లో వర్షిస్తున్న
నిశ్శబ్దంలో తడుస్తూ నడుస్తున్నాను కన్నీటి తడిని గుర్తించలేని జనాలను చూస్తూ

93) ఘనీభవించిన చీకటిపై
మొలకెత్తుతున్న నల్లటి జ్ఞాపకాల నీడలు

94) ఏకాంత సాయింకాలపు పలుచని వెలుతురులో
హృదయంలో విరిసిన సన్నజాజుల్లా జ్ఞాపకం మదిలో గిలిగింతలు పెడుతూనే ఉంది

95) మనసు విషాదపు రోదనలను 
ఒంటరితనపు భావాలను మదిలోనిండిన మౌనాన్ని దాచలేకపోతున్నా

96) నీ కళ్ళలో కన్నీరులా జారి..
మనసులో భావంగా మారి నీ ఊపిరిలో శ్వాసగా చేరిందిగా

97) ఎదలోపలి అనుభూతులన్నీ ఎగిరిపోతూ
నిశిరాతిరి తారకలై,నిశీధిలో వేకువలై నిట్టూర్పుల్లో జారిపోయాయి
98) మది లోపలి ఊహలన్నీ
మౌనపు అంచున దాగి పెదవి దాటనంటున్నాయి

99) నిశ్శబ్దపు నిశీధుల్లోకి నా స్వరం తప్పిపోయింది
చీకటి ముసుగులో కనురెప్పల సరిహద్దుపైన కన్నీళ్ళే గెలిచాయి

100) ఎప్పట్లాగానే విషాదాన్ని నాలో నింపుకొని
ఏకాంతాన్ని కప్పుకుని నాలోనేనే దూరిపోయాను

101) రాత్రి తలువు మూసింది కాసేపటీ క్రితమే 
వెలుగులతో ఉదయపు తెరలు తెరుచుకున్నాయి

102) నిద్దురని టీ కప్పు లో పోసుకొని 
నా కళ్ళలో మనసునింపుకొని ఎదురు చూస్తూనే వున్నా

103) గుప్పెడు చీకటి మొహంపై చల్లుకొని 
పరిష్కారంలేని మనసు ప్రశ్నలతో మదన పడుతూనే ఉన్నా

104) రెప్పల్లోకి రేపటిని ఒంపి ఆటలాడే ఓ మనసా... 
నీకు అలుపు లేదని నీకైనా తెలుసా..నా మనసుతో ఆడే నీ ఆటబాగుంది

105) ఎంత పరుగులెట్టినా ఎన్ని దారులు మారినా 
అలసినప్పుడు నేను కోరే మజిలీ నీ జ్ఞాపకం

106) నువ్వు ఏమవ్వాలని ఆశ పడుతున్నావు 
అని నన్ను అడిగితే నేను నీ శ్వాసగా అవ్వాలని ఆశ పడతాను

107) గతం తనలో దూకి 
జ్ఞాపకాల ఊబిలో ఆత్మ హత్య చేసుకుంది

108) కను రెప్పలు పట్టుకొని వ్రేలాడకు
నీ జ్ఞాపకం కదిలి కన్నీటిరూపంలో కారిపోతాయేమో

109) చేరువైన నేస్తం ఒంటరిగా వదిలి వెళ్ళిపోయి
ఙ్ఞాపకాలు ముసురుకుని చీకట్లో కూర్చున్నప్పుడు నువ్వేగుర్తొస్తావు

110) కనుచూపుమేరా పేరుకున్న జ్ఞాపకాల దొంతరలు

Sunday, July 20, 2014

ఇకనైనా చెప్పు నన్ను ఎందుకు పుట్టించావ్? దేవుడా..?

కాలంతో సమాంతరంగా 
పరిగెడుతూనే ఉన్నా
జీవితాన్నో, ప్రపంచాన్నో
ఇంకాదేన్నో తెలుసుకోవాలని.
తీరం తెలియని ప్రయాణం
ఆకాశం వైపే 
నిశ్చలంగా చూస్తున్నా
ఆశతో కాదు
ఆవేదనతో.
అలసట తీరని మజిలీలు
దప్పికతో దహించుకుపోయా.
కనుచూపుమేరా 
సాంద్రంగా పేరుకున్న ఇసుక
అయినా ఆగలేని నిస్సాహయత
సాగలేని నిరాసక్తత.
అడక్కుండానే 
మనసులోకి చొరబడే చొరవ చేస్తావ్
చెప్పకుండానే గుండె చీల్చిపోతావ్.
నాకెప్పుడూ అయోమయం
నువ్వు నాతోనే ఉన్నావా? లేవా?
ఇంకెన్ని అవంతరాలు అవరోదాలు
చాలు భగవాన్ ఈ పరీక్షలు
ఇకనైనా చెప్పు నన్ను
 ఎందుకు పుట్టించావ్? దేవుడా..?


మీ కురుల అందాలు వర్నించ తరమా ...?


అదిగో అల్లదిగో 
కనువిందు చేస్తున్న 
కమనీయదృస్యం 
ఒకసారి మోవిపై జారి 
ఒకమారు గాలితో జత చేరి 
నీ జ్ఞాపకాలకు 
ఎన్ని విలాసాలో 
ఎన్నెన్ని విన్యాసాలో 
పలకరించి 
పులకరించేలా చేస్తాయి


అభ్యంజనానంతరం 
చిరుగాలికి 
నీ మోముపై తేలియాడుతున్న 
ఆ కురుల కెంత సంబరం 
మోమున ఆ స్వైర విహారం 
పచ్చని ప్రాంగణాన   చేరి 
ఆ కేరింతల వినోదం 
అవి పలకరింపులో 
పలవరింతలో 
రహస్య సంప్రదింపు లో 
మారుతున్న రంగులేన్నీ 
లెక్కబెట్టే సరికే 
తెల్లని వర్నం లోకి మారుతోంది 

నిసిరాతిరి వేళ 
ఎదపై పవళించిన వేళ 
మోమును కప్పినవి 
కురుల రాగాలా 
కారు మేఘాలా 

ఆకురుల నింగిలో దాగిన
నగు మోము సోయగం 
విరుల పరిష్వంగం లో 
రంగు రంగుల వైభవం
వర్ణించగ నాకు సాధ్యమా

Friday, July 18, 2014

నీలోనే ఆ జవాబు నీడలకై వేటుకుతూనే ఉంటాను

నీలోకి చూసిన వేళ
నాకు నేను ఒక ప్రశ్న లా తోస్తాను
అయినా,నీలోనే ఆ జవాబు
నీడలకై వేటుకుతూనే ఉంటాను.
సమాదానం దొరుకుతుందేమో అని 
నీవు నాకు ఒక ప్రశ్నలానే మిగిలిపోతావు….
అయినా కూడా ఎక్కదో ఎదో అలజడి
నీలో సమాదానం పొందే వరకు
వెతుకుతూనే ఉంటాను
నీకోసంగతి తెలుసా ..
నాకు సమాదానం దొరకదు అని తెల్సి 
ఈంకా వెతుకుతూనే ఉంటాను 
నిజాం తెల్సి ..అబద్దాన్ని నమ్మలేక  
అయినా జరుగుతున్న వన్నీ  నిజాలు కావేమో అని
అయినా ప్రశ్నలేని సమాదానాలున్నాయని తెల్సీ  
ఎందుకో తెలుసా నా ప్రశ్నకి జవాబు
నీవు మాత్రమే చెప్పగలవు,
నీలో మాత్రమే చూపగలవు.
చూశావా అన్నీ తెల్సి మల్లీ నీవైవే చూస్తున్నా
అసలు సమాదానం నీదగరే వుంది కదూ
సమాదానం చెప్పవూ ప్లీజ్... 

Tuesday, July 15, 2014

గుండెగా బరువుగా బిగిసిన తలుపుల వెనక, చీకట్లో.

రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
నిరాశగా నిసృహగా 
నిస్తేజంగా వాలిపోతూంది 

గుండెగా బరువుగా బిగిసిన
తలుపుల వెనక, చీకట్లో..
ఆరిపోతున్న జీవితం
వెల వెలబోతున్న
రంగుల ప్రపంచం
మనస్సు లోయ 
సరిహద్దుల్లో  జీవితం
అంతమయి పోతూనే ఉంది


విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది
గుండేను మండిస్తూనే ఉంది 
ఆరని చిచ్చురగిల్చావుగా 
గతం రాత్రిలాగే, ప్రతి రాత్రీ
రెప్పలు చీల్చుకుని
ఉదయిస్తుంది
మనసులో చీకట్లను 
అలాగే మిగిల్చి 

మనసు గోడల పై 
రక్తపు మరకలంటించావుగా
అందుకే మనసు రోదిస్తుంది
విరహగీతాలను ఆలపిస్తుంది 
ఆ పదును గీతాలు
సేద తీర్చడంలేదు
తనువును తడుపుతున్న
స్వేదబిందువులై 
మనసులోవేడి జారి కారిపోతోంది

అన్నీ అస్తమయ మెరుగని
ఉదయాలే.. ఎంత ఒద్దనుకున్నా
వడిన పూలైన 
గతం..నిజమేరుగని 
వాస్తవం..
ప్రస్తుతాన్ని మరచి
అచేతనంగా మిగిలిన 
కొవ్వొత్తిలాంటి జీవితం
కరిగి కారిపోతూనే ఉంది 
ఎప్పటి కైనా మిగిలని 
ఆవిరయ్యే మైనంలా 


నా చుట్టూ నేనే నాలో నేనే... నే వొంటరిన‌వుతాను


న‌న్నే గమనిస్తున్న నా నీడ‌
కాళ్ళీడ్చుకుంటూ నా వెంటే ఉంటుందనుకున్నావా?
దానికో సాయింత్రమొస్తుంది
న‌ను వీడి వెళ్ళిపోతుంది అప్పుడు
నా చుట్టూ నేనే
నాలో నేనే...
నే వొంటరిన‌వుతాను
నేనో ఏకాంత క్షణమవుతాను
అప్పుడు నాలో ఏ ఉద్వేగమూ మిగల‌దు
నాకంతా రహస్యమే....> ఆరహస్యిం నాలోదాచుకునే వాన్ని చెప్పుకునేందుకు నీవున్నావు...ఓదార్పుగా చెప్పేనీమాటలు నన్ను ఎప్పుడూ నీడలా వెంటాడేవి...ఎందుకో నాకు చాలా దైర్యంగా ఉండేది... ప్రపంచం చిన్నదిగా అనిపించేది .. మల్లీ నీ తీయ్యని స్వరం వినేదాకా నా మనస్సు నీ మాటలకోసం సూన్యింలో వెతికేవి ... మనస్సేమో నీమాటల్ మూటలు గుండెళ్ళీ నిక్షిప్తంచేసి..అంత మండుటేండలోకూడా చల్లని గాల్లులో తేలియాడేట్టు చేసేవి..నేను ఒంటరిగా ఉన్నా నన్నమాట మర్చేవాన్ని ఎందుకంటే ఎదోసమయంలో నీస్వరం వింటాననే దైర్యం ,,,గతం చేసిన గాయాలకు అదో మందు..అన్ని మర్చి నీ తీయ్యని స్వరం కోసం వెతికే వాన్ని..గుర్తిచ్చిన క్షనాన్నెSMS నీ సెల్ లో నింపేవాన్ని అప్పుడు గాని నాకు తృప్తిగా ఉండేది ఏంటో కదా ..నీవు ఎక్కడికన్నా వెళ్ళావంటే గుండె తడబడేది..ఎందుకో నీకోసం తీవ్రంగ ఆలోచిస్తుండగానే నీ కాల్..అంతే అప్పటిదాకా పడ్డ ఆవేదన తుర్రుమని ఎగిరిపోయేది..ఇలాంటి తియ్యటి జ్ఞాపకాలన్ని నీడల్లా వెంటాడుతున్నాయి
" రెప్పల చాటున దాగిన దృశ్యాలన్నీ
పెదాలు బిగించి
ఒక్కొ వంతెన్నీ దాటుకుంటూ వెళ్ళుతున్నాయి
అంతా జ్ఞాపకాల గొడవే
నన్ను గుర్తించిన ఒక్కో జ్ఞాపకం
నన్నో ఏకాంతాన్ని చేసి వెళ్ళిపోతున్నాయి
ఇక నేనంతా బట్ట బయలే
నాకే రహస్యాలూ లేవు" నామనస్సునిండా నీజ్ఞాపకాలే అంటే నీవు నమ్ముతావా...ఒకప్పటి నీజ్ఞాపకాలే గాయాలై ఇప్పుడూ బాదిస్తున్నాయి..అప్పుడలా ఇప్పుడిలా ఏంటో జీవితం..నీపరిచయం లో నా అంత అదృష్టవంతుడు లేడు మరి ఇప్పుడూ నా అంత దురదృష్టవంతుడు లేడు అదృష్టానికి , దురదృష్టానికి వ్యత్యాసం ఇంత భాదాకరం అని తెలీదు అప్పుడు నీకు దూరంకాకుండా ఉండేందుకు జాగ్రత్త పడేవాన్ని ,,,కాని నీవు నా అనుకున్నా...అందుకే అంతస్వార్దంగా ప్రవర్తించా,,,అదే నీమనసును గాయం చేసిందేమో...అగాయం నాకు మిగిల్చి నాకు దూరం అయ్యావు..

Monday, July 14, 2014

నాకు నీవు ఎప్పటికీ దక్కవన్న నిజాన్ని తట్టుకోలేక మరణిస్తున్నాను

జననానికి మరణానికి నడుమ మిగిలేది
ఒకే ఒక కన్నీటి పంక్తి మాత్రమే..
నలుదిక్కులనుండి చేయి చాస్తున్నది
ఎపుడో ఒక నాటి నవ్వు మాత్రమే..
అందుకే.. దేన్నీ ఆహ్వానించలేక
అలాగని త్యజించలేక
నాలో ఉన్నా నీతో బతికే ధైర్యం లేక
నాకు నీవు ఎప్పటికీ దక్కవన్న నిజాన్ని తట్టుకోలేక
మరణిస్తున్నాను మన్నించు నేస్తం.

Sunday, July 13, 2014

నామనస్సుతో నేను నాతో నేనే యుద్దం చేస్తున్నా

ఈ లోకాన్ని పరిచయం చేసిన అమ్మ చనిపోయిన క్షనాల్లో నీవిచ్చిన దైర్యం..ఇప్పటికీ మనస్సులో పదిలంగా ఉంది...ఏందుకు నీవు నన్ను శత్రువుగా చూస్తున్నావో తెలీదు అయినా ..నేను వద్దు అనుకున్నావు అందుకే నిన్ను ఇబ్బంది పెట్టకుడాదని మౌనాన్ని  అశ్రయించా మాటలయుద్దం లో నన్ను అవమానిస్తున్న మాటలు నీనోటవినలేక....ఇంకా నన్ను పరాయి వానిగా చూస్తూ ఎవరో నీకు చెప్పారని నిజం తెల్సుకోకుండా నీవు నన్ను మోసం చేశావని చెబుతున్నా అంటున్నావు... అలా ఎప్పటికీ అనను వేష్టుగాళ్ళు ఎందుకు ఇలా నీతో చెప్పరో తెలీదు ..వాళ్ళేం సాదిస్తారొ ఇలా నీతో చెప్పి తెలీదు 

జీవితం ఎవర్ని ఎందుకు కలుపుతుందో, ఎందుకు దూరంచేస్తుందో తెలీదు. నా జీవితం కలిపిన, దూరంచేసిన మధురమైన జ్ఞాపకానివి నువ్వు. మదిలో మెదిలీ మెదలగానే మరోలోకానికి తీసుకెళ్ళే అందమైన జ్ఞాపకం నీది. చిత్రంలో విచిత్రం ఏమిటోగానీ ఆ జ్ఞాపకానికి మాటలు తొడగడనికా అన్నట్టు మళ్ళీ వినిపించావు నువ్వు. అందంగా వినిపిస్తావు, ఆనందంగా వినిపిస్తావు కానీ కనిపించవు. కనిపించకుండా వినిపించే జ్ఞాపకానివైన నీవే కావాలని కోరుకుంటుంది మనస్సు.

మీటగలిగేవాళ్ళుండాలే కానీ రాయయినా సరిగమలు పలుకుతుంది. మరి నీ మాటలు నా మనసు మీటితే  ప్రేమ రాగం పలకకుండా ఉండగలదా. నీ ప్రేమ అందదు అని తెలిసినా, అందుకోవాలని ఆశపడటం దానికి అలవాటే. ఓ క్షణం అందుకోవాలని ఆశపడి, మరుక్షణం అందదు అని తెలిసి నిరాశపడి; ఆశ నిరాశల మధ్య సతమతమైన నా మనసు, ఆ నైరాశ్యంతో కూడిన అసహనన్ని చిరుకోపంగా నీపై చూపిస్తే దాన్ని తప్పుపట్టబోకు సుమీ. ఆ కోపం ప్రేమతో కూడుకున్నదేకానీ నిజమైన కోపం కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. తెలుసుననే విషయం ఏనాడూ నీ మాటల్లో చెప్పకపోయినా, నాకోపాన్ని మనస్పూర్తిగా అంగీకరిస్తూ నీ చేతలతో చెప్పావు.

నీ మాటలు వింటుంటే ఈ ప్రపంచం అన్నది ఒకటి ఉంది అన్న విషయం కూడా గుర్తురాదు నా మనసుకు.  మరునిమిషం నువ్వు వెళ్ళిపోతావన్న విషయాన్ని ఆలోచించకుండా ఆ నిమిషం నీ మాటల్లోని చల్లదనంలో సేదతీరుతుంది నా మనసు. అన్నీ మరచిన ఆ క్షణం నువ్వు తనసొంతమనుకొని ప్రేమగా మాట్లాడితే, నువ్వు అందని చందమామవని తెలిసి నీపై అలుగుతుంది నా మనసు. "చందమామ మనకండదని.....ముందు గానే అది తెలుసు కొని... చేయి చాచి పిలవద్దు అని... చంటిపాపలకు చెపుతామా?". అందని జాబిల్లివైన నిన్నుకోరే నా మనసు కూడా చంటిపాపలాంటిదే, మరి నా మనసుకి ఈ చందమామ అందదు అని ఎలా చెప్పను. పోనీ అందని చందమామను అద్దంలో అయినా చూపిద్దామా అంటే, నిన్ను చూపించగల అద్దం నా మనసే కదా. మరి మనసుకు మనసులో నిన్ను ఎలా చూపను. నా మనసుకు నేను ఇవ్వగలిగింది వెన్నెలలాంటి నీ మాటలే కదా..

నా మనసులోనయ్యే ప్రతి భావావేశాన్ని మనస్పూర్తిగా అంగీకరిస్తూ, ఆ ఆవేశంతో చేసే ప్రతిపనిని ప్రేమగా మన్నిస్తూ; నన్ను నన్నుగా నాలోని ప్రతి గుణాన్ని అర్థం చేసుకునే నువ్వు, ఈ జన్మకు నాకు దొరికిన ఒక వరం. ఆ వరం నా సొంతం కానందుకు బాధ ఉన్నా, ఈ జీవితానికి ఈ మాత్రం భాగ్యమైనా దక్కినందుకు ఆనందంగా ఉంది. నన్ను ఇంతగా అర్థం చేసుకునే నీకు నేను ఏమివ్వగలను? ఎప్పటిలాగే కోపం, అలక, పంతం, మొండితనం తప్ప.నీలో దాచేందుకు నిన్ను వేలెత్తి చూపే ఒక్కమచ్చకూడా లేని స్వచ్చమైన స్నేహం నీది

Friday, July 11, 2014

తగలబడిపోతున్న నా వెర్రితనాన్ని చూసి నవ్వుకుంటావ్ కదూ

నన్ను నేనే ఈ లోకం నుండి వెలివేసుకున్నా
ఒంటరి తనాన్ని కావలించుకుని చీకట్లో పడుకున్నా
అక్కడ కూడా అదే నవ్వు. కలలో కూడా అదే నవ్వు.
ఆ నవ్వే మెల్ల మెల్లగా నన్ను కమ్మేసింది
ఆ నవ్వే నాలో ఆవేశాన్నో కసినో పెంచింది
చివరకి అదే నిన్ను ద్వేషించేలా చేసింది.
కానీ ఇప్పుడు నన్ను నిర్వీర్యం చేయలేకపోయిన 
నీ నవ్వుని చూసి నేను నవ్వుకుంటున్నా. 
మానసికంగా బలంగా మారుతున్న 
ప్రతి నిమిషం నవ్వుకుంటున్నా
నాలో ఆత్మవిశ్వాసం పెరిగేంతలా,
నాలో పరిణతి కలిగేంతలా,
నన్ను నేను తిరిగి కనుగొంటూ నవ్వుకుంటున్నా.
ఇప్పుడు మరలా నేను నేనయ్యాను.
హమ్మయ్య నన్ను నేను ఎవరికీ కోల్పో లేదు.
ఇప్పుడు మరింత గర్వంగా,నమ్మకంగా
నాకు తెలుసు 
నువ్విప్పుడు నవ్వుకుంటావ్
నన్ను నువ్వు గెలిచావనో?
నేను నిన్ను గెలవలేదనో?
ఇద్దరుగా మొదలయిన ప్రయాణంలో 
నువ్వు మాత్రం ఒడ్డుకు 
చేరుకున్నావన్న సంతోషంతో
తప్పయినా సరే తప్పక చేస్తున్నా అని చెప్పి, 
తప్పించుకున్న ఆనందంతో
నాకై నేనే పేర్చుకున్న 
చితిలో తగలబడిపోతున్న నా వెర్రితనాన్ని చూసి
నవ్వుకుంటావ్ నవ్వుకుంటావ్ 
నేనెవరో మర్చిపోతావ్.
ఒకర్ని భాదపెడుతున్నాం 
అనే స్పృహలేకుండా నవ్వటం 
కూడా ఒక వరమే కాదా.
ఆ నవ్వుని జయించలేనేమో 
అని భయంవేసింది, భాదనిపించింది.
ముఖం చాటేసి తప్పుకుతిరిగా
అనందాన్నిచ్చే ప్రతిది ఆశ్రయించా
అప్పుడూ కూడా అదే నవ్వు

ఏకాంత సాయంత్రాలు

ఏకాంత   సాయంత్రాలు
నన్ను ఒంటరిగా నడిపిస్తాయి...
కొన్ని మదురక్షనాలు  
నా ఒక్కడితోనే సంభాషిస్తాయి...
నాలో నేను లేనన్నా ఒప్పుకోదు 
నీకై వేచి వున్నా అన్నా
నానుండి తప్పుకోదు నీ జ్ఞాపకం 
మరుపైనా కాదు 
మరల మరల నన్ను
ఓ మనిషిలా ఉండనీయదు 
నీ జ్ఞాపకం 
ఓ చురకత్తి అయి 
ప్రతి క్షనం గుండెల్లో 
పొడుస్తూనే ఉంది 

Wednesday, July 9, 2014

మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు చేసేందుకే ఈ చిన్న ప్రయత్నం

ఇంటర్నేట్ లో అనేకమోసాలు..కాన్సెప్టు పాతదే కాని రూటే సపరేట్ అంటూ మోసాళు చేస్తున్నారు కొన్ని గ్యాంగ్ లు ఇలా 100 మందికి మైల్స్ పంపితే దాదాపు 10 మందైనా వారి బారినపడి మోసపోతున్నారు సో ఆ కదా కమీషు ఏంటో తెల్సుకొండీ ..చూడటానికి ఇంతేనా అనిపిస్తుంది కాని..దిగితేగాని లోతు తెలీదని మోసపోతేగాని అసలు భాదేంటో తెలీదు..రకరకాలుగా మోసాలు చేస్తున్నారు కొందరు గ్యాంగ్ లు..మనిషి ఆశే ఇక్కడ పెట్టు బడి..అంతే పని మొదలు పెట్టారో టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే..టార్గెట్ రీచ్ అయితే మన జేబులు గుల్ల అవ్వాల్సిందే అవునాకాదు నిజం తెల్సుకునే ప్రయత్నం చేయండి..వాస్తవం తో కాస్త జాగ్తత్త ఉంచాలన్నదే మాఈ చిన ప్రయత్నం..ఆశకు అంతుండాలి కాని కోట్లు ఒక్కసారే కొట్టేద్దాం అనే ఆశే ఇలాంటి మోసాలకు పెట్టు బడీ..మొసపోయినంతకాలం ఇలా మోసాలు చేస్తుంటారు..ఆ రియల్ ష్టోరీ కదా కమీషు ఏంటో తెల్సుకొని నిజం తెల్సుకొండీ ప్లీజ్ మీచుట్టూ మోసగాల్లు ఉంటారు ..ఎప్పటికపుడూ అప్రమత్తం గా ఉడాలి మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు చేసేందుకే ఈ చిన్న ప్రయత్నం

ఈ రాత్రి జీవించాలని ఉంది

కటిక చీకటిలో 
మనసుపై మిగిలిపోయిన
ఆఖరి కన్నీటి 
చారికను అదృశ్యం చేస్తూ
చీకటి చిక్కపడుతుంది..
ఆకాశమల్లెలు 
ఒక్కొక్కటిగా విరబూస్తాయి
నాలుగు మాటలు 
చెప్పుకోడానికో
లేక తప్పిపోయిన 
కలల్ని వెదుక్కోడానికో
ఓంటరిగా ఆకాశంవైపు చూస్తు 
ఆక్షనంలో ఏం చేస్తున్నావంటూ 
నీజ్ఞాపకం నన్ను  
ఆడిగితే ఏమని చెప్పను 

ఎందుకో అనిపిస్తుంది  
జ్ఞాపకాల శకలాలనీ.. 
సుదూర స్వప్నాలనీ
పగటి పాట్లనీ
వాటంతట వాటికి వదిలేసి
ఈ రాత్రిని జీవించాలని ఉంది
నాలోకి నేను కాకుండా
నా నించి నేను దూరంగా..
నన్ను నేను గా
ముక్కలుగా 
వేరుచేసి విసిరేస్తూ
తేలికై పోవాలి.. 
నాలో నేను ఏకమై పోవాలి 
జాబిల్లి ఆకాశంలో ముసిముసి
నవ్వులు నవ్వుతోంది 
అది జరిగదులే అని 
వృదారయాస అని నిజమే కదూ  

Thursday, July 3, 2014

ఏంటో జీవితం ఇది నేనే ( MY Pic )


కనుల గుమ్మాలకు వేలాడే ఒంటరి పక్షిలా నా నిరీక్షణ

ఆరిపోబోతున్న అవేదనను 
అదేపనిగా ఎగదోస్తూ
తెల్లవార్లూ తల్లకిందులుగా
నీకోసం తపస్సు చేస్తూ
కనుల గుమ్మాలకు వేలాడే
ఒంటరి పక్షి నిరీక్షణ
నిలువెత్తు చెమట చుక్కను
ముత్యాలుగా చేసి నీకోసం
కుప్పలుగా చేసి నిరీక్ష్స్తున్నా
ఎంతకే రావేందుకో అందుకే నాకు 
ప్రతీ రాత్రీ... నిషిద్ధ రాత్రే!
నిజాల నీడలో అబద్దాల అలికిడిలో 
అక్కరకురాని గతనికి 
అతుక్కొన్న జ్ఞాపకాలను 
పట్టిలాగినా రావడం లేదు
నీవేనా అనుకునే లోపు
అక్కడే కనిపిస్తావు
చిరునవ్వులు నవ్వుతూ 
అన్ని మర్చిపోయి 
ఎంత ఆనందంగా వున్నావో 
నిజానికి అబద్దానికి 
నీవో ప్రత్య్క్ష సాక్షివి 
అర్ధరాత్రి దాటాక
ఆశ చావని సేద్యకాడొకడు
సాయుధుడై
నడిచిపోతున్న అలికిడి
అల్లుకున్న ముళ్లపొదల
పానాదుల వెంట
పాయలుగా కదిలిపోతున్న
మట్టి పాదాల్ని
పలకరిస్తున్న పలుగురాళ్ళ సవ్వడి
నడిసంద్రంలో చిక్కిన
నావికుడి ఆక్రందనలా
అంతకంతకూ చిక్కనవుతూ
అలలు అలలుగా
గాలి ఆర్తనాదం
దిగూట్లో దిగులు పడుతున్న
వెలుగు పువ్వును
కొండచిలువలా ముట్టడిస్తూ
ఊపిరి సలపనివ్వని రాత్రి
అర అడుగు దూరంలోనే
ఉరితాడు వేలాడుతున్నా
సడలని సంకల్పం
తనువు గాయాల పాలైనా
తలవంచని తత్వం
బతుకంతా మెతుకును సృష్టిస్తూ
అణువణువూ చిగురించే వానికి
పగలూ రాత్రులేం పట్టింపు
మట్టిబెడ్డల కింద
నలిగిపోతున్న మనిషికి
పచ్చదనాన్ని
బహుకరించాలన్న తపన తప్ప
కళ్ళు తెరవని పైరు శిశువులు
పొలాలకు పాలు తాపడం మీదే
తన ధ్యాసంతా...
ఆరిపోబోతున్న వృత్తిని
అదేపనిగా ఎగదోస్తూ
తెల్లవార్లూ తల్లకిందులుగా
తపస్సు చేస్తూ
కనుల గుమ్మాలకు వేలాడే
ఒంటరి పక్షి నిరీక్షణ


Tuesday, July 1, 2014

భగవాన్ ఇకనైనా చెప్పు నన్ను ఎందుకు పుట్టించావ్?

తీరం తెలియని ప్రయాణం
అలసట తీరని మజిలీలు
దప్పికతో దహించుకుపోయా.
కనుచూపుమేరా 
సాంద్రంగా పేరుకున్న ఇసుక
అయినా ఆగలేని నిస్సాహయత
సాగలేని నిరాసక్తత.
ఇంకెన్ని అవంతరాలు అవరోదాలు
చాలు భగవాన్ ఈ పరీక్షలు
ఇకనైనా చెప్పు నన్ను 
ఎందుకు పుట్టించావ్?
ఆకాశం వైపే నిశ్చలంగా చూస్తున్నా
ఆశతో కాదు
ఆవేదనతో.
కాలంతో సమాంతరంగా 
పరిగెడుతూనే ఉన్నా
జీవితాన్నో, ప్రపంచాన్నో
ఇంకాదేన్నో తెలుసుకోవాలని.
ఏమీ తెల్సుకోలేక 
నిర్వేదగా ఆకాశం 
వైపు ఆసగా చూస్తున్నా 
నిన్నటికి నేటికి తేడా తెల్సుకోలేక 
నేటికి రేపటిలో ఒదిగిపోయిన 
గతాన్ని తడుముకోలేక 
నేనున్నానో లేనో అర్దంకాక
అవేదనగా ఆందోలనగా
నాకు నేను అర్దంకాలేక 
అర్దం చేసుకునే మనుషులు 
దగ్గరలేక ఎందుకిలా   
ఎన్నాలిలానో ఆర్ధం కాల
అపార్దల సుడిగుందంలో 
కొట్టుకపోతూనే ఉన్నా