వలదన్న వినని నా మనసు
నీకోసం తనకు తాను బందీ అవుతుంటే
తొంగిచూసిన నన్ను చెదరగొట్టింది నువ్వే కదూ
నాకు తెలియని తావుకి తోసుకెళ్ళిందీ
ఆ తర్వాత తెల్సింది ఆ చిరునవ్వు
మరికరి సొంతం అని
నిన్ను తిరిగి రారమ్మని కంటినీరువిడిచా నీకోసం
ఇన్నిటా మూగనై నీ వర్ణనలో మునిగి
ప్రతినిమిషం పరితపిస్తూనేఉన్నా
నీకోసం తనకు తాను బందీ అవుతుంటే
తొంగిచూసిన నన్ను చెదరగొట్టింది నువ్వే కదూ
నాకు తెలియని తావుకి తోసుకెళ్ళిందీ
ఆ తర్వాత తెల్సింది ఆ చిరునవ్వు
మరికరి సొంతం అని
నిన్ను తిరిగి రారమ్మని కంటినీరువిడిచా నీకోసం
ఇన్నిటా మూగనై నీ వర్ణనలో మునిగి
ప్రతినిమిషం పరితపిస్తూనేఉన్నా
ఎక్వేరియం చేపలా … నేనూ..
మునివేలి గోటితో..
చెక్కిళ్ళు మీటుతావు
ఆసాంతం నీ ప్రేమలో..
అందంగా బందీగా ..
నా పిలుపు.. ఊచలకావల
ఏవో రావాలవుతుంటే..చూస్తాను
నన్నల్లిబిల్లి తిప్పుతూ.. నువ్వు
నీ చుట్టూ తిరుగుతున్న..
నా ఆలోచనలు..
నువ్వెళ్ళిపోతావు..
నీరు సద్దు మణుగుతుంది
పంజరమాగిపోతుంది !!
నా ఊసులు నీకర్ధమయ్యాయోలేదో
ఐనా.. స్థిరంగా నేనక్కడే !
నీకోసం ఎదురు చూస్తూ…