పగులుతున్న గుండెను
పెదిమల్లో చూపే సరికి
నవ్వను కున్నారు..
మన జ్ఞాపకాల ముక్కలేరుకుంటూ
మిగిలిపోయాను ఒంటరిగా
రగులుతున్న మంటల్ని
పంటి బిగువున పట్టిఉంచి
గతం చేసిన గాయం సాక్షిగా
మౌనంగానే ఇలా మిగిలిపోయాను .
ఇప్పుడు నిర్జీవంగా మారిన
సజీవ శిల్పాన్ని నేను
నీ మనస్సు తెరమీద బొమ్మ గానే
తడిమి చూస్తున్నావు
చేతికంటిన తడిని
కనిపించకుండా చేయడానికి
నరక యాతన పడుతున్నాను
నా లోతులు తవ్వి
పోసిన కన్నీటి గుట్టలూ..
నన్ను నన్నుగా...
చూపలేక పోతున్నాయి..
ఇప్పుడు నేనైమై పోతున్నానో
కాస్త చెప్పవూ ప్లీజ్ ..
నాకు నేనేంటో తెలియడంలేదు
అద్దం మీద ఊదిన ఆవిరిలా
నాకు నేను ఆవిరవుతున్నాను..
నాకు నేనే అజ్ఞాతనవుతున్నాను
ఇక నా పరిచయమెవరినడగను ?
పెదిమల్లో చూపే సరికి
నవ్వను కున్నారు..
మన జ్ఞాపకాల ముక్కలేరుకుంటూ
మిగిలిపోయాను ఒంటరిగా
రగులుతున్న మంటల్ని
పంటి బిగువున పట్టిఉంచి
గతం చేసిన గాయం సాక్షిగా
మౌనంగానే ఇలా మిగిలిపోయాను .
ఇప్పుడు నిర్జీవంగా మారిన
సజీవ శిల్పాన్ని నేను
నీ మనస్సు తెరమీద బొమ్మ గానే
తడిమి చూస్తున్నావు
చేతికంటిన తడిని
కనిపించకుండా చేయడానికి
నరక యాతన పడుతున్నాను
నా లోతులు తవ్వి
పోసిన కన్నీటి గుట్టలూ..
నన్ను నన్నుగా...
చూపలేక పోతున్నాయి..
ఇప్పుడు నేనైమై పోతున్నానో
కాస్త చెప్పవూ ప్లీజ్ ..
నాకు నేనేంటో తెలియడంలేదు
అద్దం మీద ఊదిన ఆవిరిలా
నాకు నేను ఆవిరవుతున్నాను..
నాకు నేనే అజ్ఞాతనవుతున్నాను
ఇక నా పరిచయమెవరినడగను ?