అంతులేని భాధ నన్ను అల్లుకుని, ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడక చనిపోతానేమో అనిపించినప్పుడు, ఎంత త్యాగం చేస్తావ్ నువ్వు అంతకంటే ఎక్కువ భాదపెడతావు నీజ్ఞాపకాలతో . నా కంటి నుండి కాదు కాదు, నా మది మూలనుండి జారి ఆవిరై నీ ఉనికిని కోల్పోయి నా భాదని కరిగిస్తావ్. ఆవేదనలో దారి కనబడని అయోమయంలో కంటిని కడిగేసి ఓ దారిని చూపిస్తావ్. నీవుండబట్టేకదా నా హృదయం ఈ భాదల్ని తట్టుకోలేక పగిలిపోతూ ముక్కలౌతుంది అంతులేనిభాదలో మాటలు కరువైనప్పుడు మాటల కందని భావాల్ని మోసుకుని జారిపోతావ్. నేను కొత్త పాఠం నేర్చుకున్న నీ స్నేహంలో. కన్నీరంటే రెండు చుక్కల ఉప్పని నీరు కాదు. కన్నీరు ఒక ఎక్స్‌ప్రెషన్, ఒక భాష, ఒక కమ్యూనికేషన్ చానెల్. అందరూ అంటారు అంతులేని భాదను, ప్రేమని, భాదని చెప్పగలిగే భాష లేదు భూమి పైన అని. కానీ ఉంది ఎంత సంక్లిష్టమైన భావాన్నయినా చెప్పగలిగే భాష కన్నీరు. నీ గురించి వ్రాస్తున్న ఈ క్షణంలో కూడా కళ్లలో నువ్వే. ఎందుకంటే కన్నీరంటే ఏంటొ చెప్పటానికి నేను నేర్చుకున్న తెలుగు భాష సరిపోవటం లేదు. అందుకే మరలా కన్నీటి భాషే నా ఎక్స్‌ప్రెషన్.నన్ను నేను నీతోనే కొలుచుకుంటాను తెలుసా? ఎక్కడో చదివా. నీ వలన ఇతరుల కళ్ళల్లో కన్నీటితో నీ పతనాన్ని, నీ కోసం నీ వాళ్ళ కళ్ళలో కన్నీటితో నీ విజయాన్ని కొలుచుకో అని.అయినా నువ్వు నాకే కాదు అమ్మని, అక్కని, నా స్నేహితుల్ని అందర్ని ఆదుకుంటావ్, అందరితోనూ ఉంటావ్. నువ్వు ఫ్యామిలీ ఫ్రెండ్. కాదులే యూనివర్సల్ ఫ్రెండ్.ఇంత మేలు చేసినా నిన్ను ఎవ్వరికీ కనబడనివ్వరు ఎవరూ. కాస్త అహం దెబ్బతింటుందని. నువ్వు కావలని ఎవరూ కోరుకోరు. ఎందుకంటే వాళ్ళంతా నువ్వు భాదల్లో ఉన్నప్పుడు వస్తావను కుంటారే గాని, భాదని పంచుకోవటానికి, నీతో మోసుకుపోవటానికి వచ్చావని అర్ధం చేసుకోరు. సారీ దోస్త్.ఈ జన్మలో కూడా కడ దాక నా తోడై ఉంటావు కదూ? పూర్తిగా మన అనుభందం వ్రాయలేకపోయిన భాదలో కన్నీళ్ళతో...అయినా నీవు నన్నుకాదని వెల్లినా నా మనస్సునీకోసం ఆక్రోసిస్తూనే ఉంది..నాది పిచ్చా పిచ్చిన్నరా చెప్పవూ