మౌనం నాతో జతకలిపిన ప్రతిసారీ
అంతరంగం అక్రోశించి
గొంతు సవరించుకుంటుంది
ఏ గుర్తింపు కోసమూ ఎదురుచూడని
నీ జ్ఞాపకం మనసులో
ముళ్ళులా గుచ్చుకొంటూనే ఉంది
పచ్చని కొమ్మలమీద
పూలు విరబూసినట్లు
ఒక అనురాగ కృతి వినపడుతుంది.
నీకై గుండె వేగంగా
కొట్టుకుంటున్న ప్రతిసారి
ఎందుకో ఒక్కోసారి ఉలిక్కిపడి నీకోసం
చప్పున హృదయ
వీధులన్నీ వెదుకుతాను
పెదవి దాటి వృథివిలోకి అడుగుపెట్టే
మానసిక తరంగాలు, ఉల్లాసరాగాలు
ఊహలు మేఘాల మెట్లెక్కి వడివడిగా
సందె వెలుగు స్వల్పతరంగమై
చూస్తుండగానే మాయమై
మిణుగురుల్లా
నక్షత్రాలు మినుకుమినుకులు
నీకోసం ఎదురు చూస్తూ
తన్మయత్వంతో కనురెప్పలను
కుంచెలుగా చేసి కన్నీటితో
ఎన్నిసార్లు నీ చిత్తరువుగీశానో
ఆకాశంలోని అసమాన సౌందర్యపు ఆకృతులు
సుకుమారంగా ఒక్కొక్కదాన్ని అద్దుతుంటే
మనిషిలోని మనిషి కోసం అన్వేషన
ఎక్కడ మొదలయిందో
తిరిగి అక్కడే ముగిసింది
కద అర్దంతంగా ముగిచేసేలా చేశావు కదా,,?
అంతరంగం అక్రోశించి
గొంతు సవరించుకుంటుంది
ఏ గుర్తింపు కోసమూ ఎదురుచూడని
నీ జ్ఞాపకం మనసులో
ముళ్ళులా గుచ్చుకొంటూనే ఉంది
పచ్చని కొమ్మలమీద
పూలు విరబూసినట్లు
ఒక అనురాగ కృతి వినపడుతుంది.
నీకై గుండె వేగంగా
కొట్టుకుంటున్న ప్రతిసారి
ఎందుకో ఒక్కోసారి ఉలిక్కిపడి నీకోసం
చప్పున హృదయ
వీధులన్నీ వెదుకుతాను
పెదవి దాటి వృథివిలోకి అడుగుపెట్టే
మానసిక తరంగాలు, ఉల్లాసరాగాలు
ఊహలు మేఘాల మెట్లెక్కి వడివడిగా
సందె వెలుగు స్వల్పతరంగమై
చూస్తుండగానే మాయమై
మిణుగురుల్లా
నక్షత్రాలు మినుకుమినుకులు
నీకోసం ఎదురు చూస్తూ
తన్మయత్వంతో కనురెప్పలను
కుంచెలుగా చేసి కన్నీటితో
ఎన్నిసార్లు నీ చిత్తరువుగీశానో
ఆకాశంలోని అసమాన సౌందర్యపు ఆకృతులు
సుకుమారంగా ఒక్కొక్కదాన్ని అద్దుతుంటే
మనిషిలోని మనిషి కోసం అన్వేషన
ఎక్కడ మొదలయిందో
తిరిగి అక్కడే ముగిసింది
కద అర్దంతంగా ముగిచేసేలా చేశావు కదా,,?