వీధి దీపాల్లో నేను వ్రాసే
పిచ్చిరాతల్లో జీవితం
లేదని వెళ్ళిపోయింది.
కళ్ళలో కోటి ఆశలు,
ఏన్నో ఊహలు,కలలు
వీటిలో ప్రాక్టికాలిటీ
లేదని వెళ్ళిపోయింది.
దూరంగా ఆకాశం,
నేల కలిసిపోతుంటే
అనందంతో గంతులు
వేస్తున్న నన్ను చూసి
వీడింతే లోకం తెలియని
వెర్రివాడు అనుకుని వెళ్ళిపోయింది.
సంధ్య వేళలో కలిసిపోతున్న వెలుగు చీకట్లను
సంభ్రమంగా చూస్తున్న
నన్ను చూసి
వీడొట్టి ఎమోషనల్ ఫెల్లో
అని తేల్చేసి వెళ్ళిపోయింది.
తనకోసమే ఆలోచిస్తుంటే ఒక అడుగు
తనకోసం ఏడుస్తుంటే వంద అడుగులు
పిచ్చివాడిలా అరుస్తుంటే వేయి
అడుగులు చొప్పున దూరంగా వెళ్ళిపోయింది.
తను నన్ను చూస్తుంటే దూరంగా అఘాధంలో
నేను తనని చూస్తుంటే దగ్గరగా హృదయంలో
పిచ్చిరాతల్లో జీవితం
లేదని వెళ్ళిపోయింది.
కళ్ళలో కోటి ఆశలు,
ఏన్నో ఊహలు,కలలు
వీటిలో ప్రాక్టికాలిటీ
లేదని వెళ్ళిపోయింది.
దూరంగా ఆకాశం,
నేల కలిసిపోతుంటే
అనందంతో గంతులు
వేస్తున్న నన్ను చూసి
వీడింతే లోకం తెలియని
వెర్రివాడు అనుకుని వెళ్ళిపోయింది.
సంధ్య వేళలో కలిసిపోతున్న వెలుగు చీకట్లను
సంభ్రమంగా చూస్తున్న
నన్ను చూసి
వీడొట్టి ఎమోషనల్ ఫెల్లో
అని తేల్చేసి వెళ్ళిపోయింది.
తనకోసమే ఆలోచిస్తుంటే ఒక అడుగు
తనకోసం ఏడుస్తుంటే వంద అడుగులు
పిచ్చివాడిలా అరుస్తుంటే వేయి
అడుగులు చొప్పున దూరంగా వెళ్ళిపోయింది.
తను నన్ను చూస్తుంటే దూరంగా అఘాధంలో
నేను తనని చూస్తుంటే దగ్గరగా హృదయంలో