ఈరోజు రాత్రి నా నిస్సత్తువలా
నాకంటే ముందే నిషృహ నన్ను చేరింది
మామూలుగా ఈపాటికి నిద్రా దేవి
నా కళ్ళ తలుపులు తట్టాల్సింది
మనసు తలుపులవద్ద ఆగిన జ్ఞాపకాలు
తన ఉనికిని ముళ్ళలా మనస్సులో గుచ్చుతుంటే
మనిషిని అన్న మాటే మర్చి .. మాటలు రాని
మూగవానిలా మారాను..గతం గాయం చేస్తే
నిజ నిప్పులా ఇప్పటికీ నన్ను
తగల బెడుతూనే ఉంది
గోడమీద చిన్న ముల్లు
ఈ బరువైన కాలాన్ని నెట్టటానికి
అష్టకష్టాలు పడుతుంది
అచ్చం ఆగిపోయిన నా జీవితంలా
కాలం నడుస్తూనే ఉంది
కాని గతం లో జీవితం ఆగిపోయింది
కదలని గడియారపు ముల్లులా మారాను
నీవు బాగానే ఉన్నావు ..
కొత్త పరిచయాలు కొత్తజీవితంతో
నిన్ను నీవు మర్చిపోయావు
నీకు గతం అక్కరలేదు
ప్రస్తుతం నీవు ఆనందంగా ఉండాలి
దానికోసమేగా గతాన్ని ఫనంగా పెట్టావు
అస్సలు నేనెవరో గుర్తున్నన్నా
కనిపిస్తే ఎవ్వరూ అని అడుగుతవేమో
బాధలొ భావుకత వెతుక్కుంటూ
నవ్వులు పులుముకుని ఆనందం నటిస్తూ
నా ప్రస్తుతాన్ని గడిపేస్తున్నా
ఇక అలిసిపోయాను, ఇంకేమైనా చెయ్యాలని
ఈ నిశిరాత్రిన నా జ్ఞాపకాల అరణ్యంలో
నన్ను నేను వెతుక్కుంటున్నాను
నీకు ఎలాగు దొరకను
ఎందుకంటే నీకు నేను అవసరం లేదు
అందుకే నాకు నేనైనా దొరుకుతనేమో అని
వెతుక్కుంటున్నా అయినా నా పిచ్చి గాని
ఇంకా ఎక్కడని వెతకను నన్ను నేను ఎందుకు దొరుకుతాను చెప్పు............................?
నా గతం నుండి నన్ను నేను
పెరికి తెచ్చుకుంటున్నాను
ఎక్కడినా నిన్ను చూద్దమని
నా గతంలో నీవున్నవు
కాని నాకు నేను దూరం అయ్యనే అని బాధ
ఇప్పటికి ప్రతిక్షనం నన్ను వేదిస్తూనే ఉంది
నాకంటే ముందే నిషృహ నన్ను చేరింది
మామూలుగా ఈపాటికి నిద్రా దేవి
నా కళ్ళ తలుపులు తట్టాల్సింది
మనసు తలుపులవద్ద ఆగిన జ్ఞాపకాలు
తన ఉనికిని ముళ్ళలా మనస్సులో గుచ్చుతుంటే
మనిషిని అన్న మాటే మర్చి .. మాటలు రాని
మూగవానిలా మారాను..గతం గాయం చేస్తే
నిజ నిప్పులా ఇప్పటికీ నన్ను
తగల బెడుతూనే ఉంది
గోడమీద చిన్న ముల్లు
ఈ బరువైన కాలాన్ని నెట్టటానికి
అష్టకష్టాలు పడుతుంది
అచ్చం ఆగిపోయిన నా జీవితంలా
కాలం నడుస్తూనే ఉంది
కాని గతం లో జీవితం ఆగిపోయింది
కదలని గడియారపు ముల్లులా మారాను
నీవు బాగానే ఉన్నావు ..
కొత్త పరిచయాలు కొత్తజీవితంతో
నిన్ను నీవు మర్చిపోయావు
నీకు గతం అక్కరలేదు
ప్రస్తుతం నీవు ఆనందంగా ఉండాలి
దానికోసమేగా గతాన్ని ఫనంగా పెట్టావు
అస్సలు నేనెవరో గుర్తున్నన్నా
కనిపిస్తే ఎవ్వరూ అని అడుగుతవేమో
బాధలొ భావుకత వెతుక్కుంటూ
నవ్వులు పులుముకుని ఆనందం నటిస్తూ
నా ప్రస్తుతాన్ని గడిపేస్తున్నా
ఇక అలిసిపోయాను, ఇంకేమైనా చెయ్యాలని
ఈ నిశిరాత్రిన నా జ్ఞాపకాల అరణ్యంలో
నన్ను నేను వెతుక్కుంటున్నాను
నీకు ఎలాగు దొరకను
ఎందుకంటే నీకు నేను అవసరం లేదు
అందుకే నాకు నేనైనా దొరుకుతనేమో అని
వెతుక్కుంటున్నా అయినా నా పిచ్చి గాని
ఇంకా ఎక్కడని వెతకను నన్ను నేను ఎందుకు దొరుకుతాను చెప్పు............................?
నా గతం నుండి నన్ను నేను
పెరికి తెచ్చుకుంటున్నాను
ఎక్కడినా నిన్ను చూద్దమని
నా గతంలో నీవున్నవు
కాని నాకు నేను దూరం అయ్యనే అని బాధ
ఇప్పటికి ప్రతిక్షనం నన్ను వేదిస్తూనే ఉంది