. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, June 29, 2014

సూన్యిం లోంచి మల్లీ సూన్యిం లోకి వెలుతున్నా

నాలో నేను
మళ్ళీ మళ్ళీ పుడుతుంటా
అవమానాల్లో కాలిపోతూ
నిరుత్సాహంలో క్రుంగిపోతూ
ఓటమిలో చనిపోతూ
నన్ను నేను నిర్వచించు
కుందాం అనుకుటే
నాలో సూన్యిం ఆవరిస్తుంది
నన్ను నేను ఎప్పుడో 
మర్చిపోయాను
ఏమార్చిన జ్ఞాపకాలు 
నన్ను చూసి వెక్కిరిస్తున్నాయి 

కొన్ని సార్లు మొదలు 
ఎక్కడ పెట్టాలో 
తెలియక నాలో 
నేనువెతుకుతూఉంటా
గండె అంచున చిరిగిన్ స్థానాన్ని
కుట్టుకోడానికి 
లోపలికెళ్ళే దారితెలియక 
నాలోనే ఉండి దాగుడు 
మూతలాడుతున్న 
నీ జ్ఞాపకాలు మనసులో 
గుచ్చేస్తూ ఉంటాయి

శూన్యం తరుముతుంటే 
రాల్చుకున్న
జ్ఞాపకాలు తన రెక్కల స్వేచ్చలో
నన్ను వెతుక్కుంటూ
నడుస్తున్నాను గతకాలపు 
ఉదయం వైపు..
ఏంటో అంతా సూన్యిమే కనిపిస్తంది 
నీవెక్కడ కనిపిస్తా వని 
ఆశగా వెతుకుతున్న నా కళ్ళకు
కన్నీరే మిగులుతంది 
ఏంటో సూన్యిం లోంచి 
మల్లీ సూన్యిం లోకి వెలుతున్నా 

Wednesday, June 25, 2014

గుండె రాయిలా మరిపోయిందేమో అనిపిస్తోంది

నేస్తం నా చెంత నువ్వు లేని క్షణం 
నాకోసం నేనే వెతుకుతున్నా 
నీ జ్ణాపకాల ఒడిలో కరిగిపోతున్న 
ఈ కాలాన్ని ఆపలేకపోతున్నా 
గుండె రాయిలా 
మరిపోయిందేమో అనిపిస్తోంది 
నిన్ను అది మరచిపోమన్నప్పుడు 
మనసే నాకు లేదేమొ అనిపిస్తోందే 
నిన్ను చూడకుండ ఉండమన్నప్పుడు 
నేనే నేనుగా ఇక లేనా అనిపిస్తోందే 
నీ నుండి దూరం అయిపోతున్నప్పుదు 

నీ తలపులే కవితలై 
నా మదిని తడిమిన క్షణం 
చిరుగాలినై నిన్ను చేరాలని 
నా ఇష్టాన్ని నీ ముందు ఉంచాలని 
ఆ క్షణం నీ కళ్ళల్లో కదిలే భావాలను చదవాలని 
నా మది ఆరాటపడుతోంది నేస్తం


ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది

వీధి దీపాల్లో నేను వ్రాసే 
పిచ్చిరాతల్లో జీవితం 
లేదని వెళ్ళిపోయింది.
కళ్ళలో కోటి ఆశలు, 
ఏన్నో ఊహలు,కలలు
వీటిలో ప్రాక్టికాలిటీ 
లేదని వెళ్ళిపోయింది.
దూరంగా ఆకాశం, 
నేల కలిసిపోతుంటే
అనందంతో గంతులు 
వేస్తున్న నన్ను చూసి
వీడింతే లోకం తెలియని 
వెర్రివాడు అనుకుని వెళ్ళిపోయింది.
సంధ్య వేళలో కలిసిపోతున్న వెలుగు చీకట్లను
సంభ్రమంగా చూస్తున్న 
నన్ను చూసి
వీడొట్టి ఎమోషనల్ ఫెల్లో 
అని తేల్చేసి వెళ్ళిపోయింది.
తనకోసమే ఆలోచిస్తుంటే ఒక అడుగు
తనకోసం ఏడుస్తుంటే వంద అడుగులు
పిచ్చివాడిలా అరుస్తుంటే వేయి 
అడుగులు చొప్పున దూరంగా వెళ్ళిపోయింది.
తను నన్ను చూస్తుంటే దూరంగా అఘాధంలో
నేను తనని చూస్తుంటే దగ్గరగా హృదయంలో 

Monday, June 23, 2014

దిగులుతో మనసు బరువెక్కినపుడు

నలుగురిలో నేను ఉన్నపుడు,
పదేపదే నువ్వు గుర్తుకొచ్చినపుడు,
దిగులుతో మనసు బరువెక్కినపుడు,
మాట్లాడేందుకు మాటలు రానపుడు,
ఏమయిందని అందరు అడిగినపుడు,
ఎంచెప్పాలో తెలియక తడబడుతున్నపుడు,
నా అవస్థ నాకే నవ్వు తెప్పించినపుడు,
ఆనవ్వు నీతో పంచుకోవాలనిపించినపుడు,
ఎంత వెతికిన నువ్వు కనిపించనపుడు,
అది నీ జ్ఞాపకమని నాకు అనిపించినపుడు,
నా కన్నీళ్ళను ఆపేందుకు ప్రయత్నిచినపుడు,
నా కళ్ళల్లో  కన్నీరు ఆగనపుడు,
నా మనసుపడే వేదన నీకేమని చెప్పను???
గుండె బరువై,
మనసులో గుబులై,
మమత కరువై,
నీ ప్రేమ దూరమై,
ఇంకేమని చెప్పను..
ఎలా బ్రతకను...

అయినా నీ ధ్యాస

నాలో పెరుగుతూనే ఉంది.
ఉఛ్వాస నిచ్వాసలే నీవైనప్పుడు
నాకు ఇంకేం కావాలి,
నీవు తోడు రాకపోయినా
నీవు మిగిల్చిన
తడి ఆరని జ్ఞాపకాల ఊతం చాలు.
ఈ జీవితం మోడుబారకుండా గడిపేందుకు
నీవు వెదజెల్లిన
వెన్నెల వెలుగుల జిగేలు చాలు.
ఈ చీకటి పయనంలో చింతలేకుండా ఉండేందుకు.

Saturday, June 21, 2014

సంక్లిష్టమైన భావాన్నయినా చెప్పగలిగే భాష కన్నీరు

అంతులేని భాధ నన్ను అల్లుకుని, ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడక చనిపోతానేమో అనిపించినప్పుడు, ఎంత త్యాగం చేస్తావ్ నువ్వు అంతకంటే ఎక్కువ భాదపెడతావు  నీజ్ఞాపకాలతో   . నా కంటి నుండి కాదు కాదు, నా మది మూలనుండి  జారి ఆవిరై నీ ఉనికిని కోల్పోయి నా భాదని కరిగిస్తావ్. ఆవేదనలో దారి కనబడని అయోమయంలో కంటిని కడిగేసి ఓ దారిని చూపిస్తావ్. నీవుండబట్టేకదా నా హృదయం ఈ భాదల్ని తట్టుకోలేక పగిలిపోతూ ముక్కలౌతుంది అంతులేనిభాదలో మాటలు కరువైనప్పుడు మాటల కందని భావాల్ని మోసుకుని జారిపోతావ్. నేను కొత్త పాఠం నేర్చుకున్న నీ స్నేహంలో. కన్నీరంటే రెండు చుక్కల ఉప్పని నీరు కాదు. కన్నీరు ఒక ఎక్స్‌ప్రెషన్, ఒక భాష, ఒక కమ్యూనికేషన్ చానెల్. అందరూ అంటారు అంతులేని భాదను, ప్రేమని, భాదని చెప్పగలిగే భాష లేదు భూమి పైన అని. కానీ ఉంది ఎంత సంక్లిష్టమైన భావాన్నయినా చెప్పగలిగే భాష కన్నీరు. నీ గురించి వ్రాస్తున్న ఈ క్షణంలో కూడా కళ్లలో నువ్వే. ఎందుకంటే కన్నీరంటే ఏంటొ చెప్పటానికి నేను నేర్చుకున్న తెలుగు భాష సరిపోవటం లేదు. అందుకే మరలా కన్నీటి భాషే నా ఎక్స్‌ప్రెషన్.నన్ను నేను నీతోనే కొలుచుకుంటాను తెలుసా? ఎక్కడో చదివా. నీ వలన ఇతరుల కళ్ళల్లో కన్నీటితో నీ పతనాన్ని, నీ కోసం నీ వాళ్ళ కళ్ళలో కన్నీటితో నీ విజయాన్ని కొలుచుకో అని.అయినా నువ్వు నాకే కాదు అమ్మని, అక్కని, నా స్నేహితుల్ని అందర్ని ఆదుకుంటావ్, అందరితోనూ ఉంటావ్. నువ్వు ఫ్యామిలీ ఫ్రెండ్. కాదులే యూనివర్సల్ ఫ్రెండ్.ఇంత మేలు చేసినా నిన్ను ఎవ్వరికీ కనబడనివ్వరు ఎవరూ. కాస్త అహం దెబ్బతింటుందని. నువ్వు కావలని ఎవరూ కోరుకోరు. ఎందుకంటే వాళ్ళంతా నువ్వు భాదల్లో ఉన్నప్పుడు వస్తావను కుంటారే గాని, భాదని పంచుకోవటానికి, నీతో మోసుకుపోవటానికి వచ్చావని అర్ధం చేసుకోరు. సారీ దోస్త్.ఈ జన్మలో కూడా కడ దాక నా తోడై ఉంటావు కదూ? పూర్తిగా మన అనుభందం వ్రాయలేకపోయిన భాదలో కన్నీళ్ళతో...అయినా నీవు నన్నుకాదని వెల్లినా నా మనస్సునీకోసం ఆక్రోసిస్తూనే ఉంది..నాది పిచ్చా పిచ్చిన్నరా చెప్పవూ

Friday, June 20, 2014

మన జ్ఞాపకాల ముక్కలేరుకుంటూ మిగిలిపోయాను ఒంటరిగా

పగులుతున్న గుండెను
పెదిమల్లో చూపే సరికి
నవ్వను కున్నారు..
మన  జ్ఞాపకాల ముక్కలేరుకుంటూ 
మిగిలిపోయాను ఒంటరిగా 

రగులుతున్న మంటల్ని
పంటి బిగువున పట్టిఉంచి 
గతం చేసిన గాయం సాక్షిగా 
మౌనంగానే  ఇలా మిగిలిపోయాను .

 ఇప్పుడు నిర్జీవంగా మారిన 
సజీవ శిల్పాన్ని నేను
నీ మనస్సు  తెరమీద బొమ్మ గానే
తడిమి చూస్తున్నావు 
చేతికంటిన తడిని
కనిపించకుండా చేయడానికి 
నరక యాతన పడుతున్నాను 

నా లోతులు తవ్వి
పోసిన కన్నీటి గుట్టలూ..
నన్ను నన్నుగా...
చూపలేక పోతున్నాయి..
ఇప్పుడు నేనైమై పోతున్నానో 
కాస్త చెప్పవూ ప్లీజ్ ..
నాకు నేనేంటో తెలియడంలేదు

అద్దం మీద ఊదిన ఆవిరిలా
నాకు నేను  ఆవిరవుతున్నాను..
నాకు నేనే అజ్ఞాతనవుతున్నాను
ఇక నా పరిచయమెవరినడగను ?

Thursday, June 19, 2014

అంతరంగం అక్రోశించి గొంతు సవరించుకుంటుంది

మౌనం నాతో జతకలిపిన ప్రతిసారీ
అంతరంగం  అక్రోశించి 
గొంతు సవరించుకుంటుంది
ఏ గుర్తింపు కోసమూ ఎదురుచూడని
నీ జ్ఞాపకం మనసులో 
ముళ్ళులా గుచ్చుకొంటూనే ఉంది
పచ్చని కొమ్మలమీద 
పూలు విరబూసినట్లు
ఒక అనురాగ కృతి వినపడుతుంది.
నీకై గుండె వేగంగా 
కొట్టుకుంటున్న ప్రతిసారి
ఎందుకో ఒక్కోసారి ఉలిక్కిపడి నీకోసం
చప్పున హృదయ 
వీధులన్నీ వెదుకుతాను
పెదవి దాటి వృథివిలోకి అడుగుపెట్టే
మానసిక తరంగాలు, ఉల్లాసరాగాలు
ఊహలు మేఘాల మెట్లెక్కి వడివడిగా
సందె వెలుగు స్వల్పతరంగమై
చూస్తుండగానే మాయమై
మిణుగురుల్లా 
నక్షత్రాలు మినుకుమినుకులు
నీకోసం ఎదురు చూస్తూ
తన్మయత్వంతో కనురెప్పలను
 కుంచెలుగా చేసి కన్నీటితో 
ఎన్నిసార్లు నీ చిత్తరువుగీశానో
ఆకాశంలోని అసమాన సౌందర్యపు ఆకృతులు
సుకుమారంగా ఒక్కొక్కదాన్ని అద్దుతుంటే
మనిషిలోని మనిషి కోసం అన్వేషన
ఎక్కడ మొదలయిందో
తిరిగి అక్కడే ముగిసింది 
కద అర్దంతంగా ముగిచేసేలా చేశావు కదా,,?

Tuesday, June 17, 2014

ట్యా0క్ బండ్ లో ఒంటరిగా నేను


అచ్చ మైన ముద్ద బంతి లాంటి తెలుగు పడుచు

సంక్రాంతి రంగులతో ముగ్గులేయడానికి కూర్చుతున్న
చుక్కల్లా వున్నాయి దీపాలు
టాంక్ బండ్ చుట్టూ
ఒద్దికగా .
అక్కడ బెంచ్ పై ఒంటరిగా నేను , నా ప్రక్కన ఆకాశం.
పైన కూడా ఆకాశమే!
ఒక్కొక్క జంటా నా వెనుక నుంచి నడచి వెళ్లి తమ
స్థానాల్ని వెతుక్కుంటున్నాయి.
చుట్టూ చేమంతి రేకలతో , మరువం చిగుళ్ళతో
పరిచిన నీటి ముగ్గుకి మద్యలో గొబ్బెమ్మలా ఉన్న
బుద్ధుడే సాక్షి - ఈ జంటలన్నిటికి.
నీటిని చీల్చుకుంటూ దూసుకెళ్తున్న మరపడవలో
జంట ఎంత సంతోషంగా వుందో - పడవ వదిలి వెళ్ళిన 
అలల్ని చూస్తే తెలిసింది.
రెహ్మాన్ విరుపో లేక ప్రయాణికుల అరుపో 
హుస్సేన్ సాగర్ లో పోతున్న దీపాల పడవ నుంచి విన్పిస్తోంది. 
దానికి తగినట్టు మరుమల్లెల నృత్యం అందులో!
అది కన్పిస్తోంది లీలగా! 
మినుకు మినుకు మంటూ దూరంగా వెలిగింది- 
మిణుగురు పురుగులా-
అంతకంతకు దగ్గరై యు టర్న్ తీసుకుని 
మాదాపూర్ వైపు దూచుకెల్లింది  
విమానం- నా తలపై నుంచి!
వరుసగా కన్పిస్తున్న బిర్లా మందిర్, సచివాలయం, ఐమాక్స్ లైట్లు 
నగరాన్ని తామే పాలిస్తున్నట్లు ఠీవిగా నిలబడ్డాయి! 
వెనుక ప్రపంచాన్ని చీల్చుకుని గమ్యాలకి పరుగులు పెట్టే
బస్సులు, ఆటోలు, సైకిళ్ళు - ఆలస్యానికి చింతిస్తున్నట్లున్నాయి ఎక్కడా 
ఆగడం లేదు!
తలపైకెత్తి చూస్తే ఒక్క చుక్కా లేదు- 
నక్షత్రాలన్నిటిని ఒక పరదా కప్పేసింది.
మనుషుల ఆశల్లోంచి పుట్టిన వాహనాల శ్వాస నిట్టూర్పులు- వెచ్చని 
సెగలై ఈచుక్కల్ని కన్పించకుండా చేసేసాయి.
పాపం- చంద్రుడు గట్టివాడు. అందుకే పున్నమి రాత్రయినా 
మసక మసగ్గా కన్పించాడా పొగలో.
భవిష్యత్తులో చూడగలనో లేదో అని తనివితీరా చంద్రుడిని 
అలాగే చూస్తూ కూర్చున్నాను- 
తలపైకెత్తి.

Monday, June 16, 2014

ఒక్కతే.... మృత్యువు

అక్కడ ఒంటరి శ్మశానాలు, 
ఎముకల నిశ్శబ్దం నిండిన సమాధులు, 
ఒక సొరంగం గుండా పోతూ హృదయం 
చీకటి, చీకటి, కటిక చీకటి 
ఓటారిన ఓడలా, మెల్లగా లోలోపలకి 
మనసులోకి మునిగిపోతూన్నట్టు, 
ఈ మరణం 
చర్మం అంచు పైనుంచి ఆత్మలోకి - ఒక అనంత పతనం. 
అక్కడ శవాలున్నాయి 
చల్లగా జిగురు జిగురుగా రాతిపలకల అడుగులున్నాయి 
ఆ ఎముకల్లో మృత్యువుంది 
అచ్చమైన రవంలా 
కుక్క లేని మొరుగులా 
ఏవో సమాధుల్లోంచి, ఎక్కడో గంటల్లోంచి వస్తూ 
చిత్తడిలో పొంగుకొచ్చే ఆక్రందనలా 
జడివానలా 
అప్పుడప్పుడూ, ఒక్కడినే, నేను చూస్తూంటాను 
శవపేటికలు లంగరెత్తి 
చాపకట్టి పాలిపోయిన కళేబరాలు, ఆడవాళ్ళ నిర్జీవ కచభారాలు, 
గంధర్వ గాయకుల మూగబోయిన గాత్రాలు, 
గుమాస్తాల పడుచు భార్యల ముడుచుకున్న మొహాలు, 
మోసుకుంటూ 
నిర్జీవుల నిలువెత్తు నదిని అధిరోహిస్తూ 
శవపేటికలు, 
క్షతజ కాంతులీనే ఆ నదిలో 
పైపైకి, మృత్యు రవానికి ఉబ్బిపోయిన 
మృత్యు నిశ్శబ్ద రవానికి ఉబ్బిపోయిన 
తెరచాపలతో. 
మౌనంలో రవళిస్తూ మృత్యువు వస్తుంది 
రాయీ వేలూ లేని ఉంగరంతో 
తలుపు తడుతుంది. 
ఆమె పిలిచే పిలుపుకి 
నోరుండదు, నాలిక ఉండదు, గొంతూ ఉండదు. 
అయినా ఆ అడుగుల సడి, 
ఆమె దుస్తుల రెపరెపలు, ఒక చెట్టు ఊగినంత మెల్లగా 
నీకు వినిపించే తీరుతాయి. 
నాకంతగా తెలీదు, అర్థం కాదు, చూడనూ లేను 
అయినా, నాకు నమ్మకం. మృత్యుగీతానిది తడి ఊదాపూల రంగు 
మట్టితో జతకలిసిన ఊదాపూలది. 
మృత్యుముఖం ముదురాకుపచ్చ కాబట్టి, 
మృత్యువుది ముదురాకుపచ్చని చూపు కాబట్టి 
ఊదా పూరేకుల పదునైన చెమ్మతో 
చిక్కబడ్డ శీతకాలపు బూడిద రంగు 
అంతేనా, చావు చీపురు పుచ్చుకొని భూమంతా తిరుగుతుంది. 
శవాల కోసం నేలంతా నాకుతూ 
ఆ చీపురే మృత్యువు 
మృతదేహాలకై సాచిన నాలిక, 
సూత్రం కోసం వెదికే మృత్యు సూచి. 
మడత మంచాల్లో 
స్తబ్ధమైన పరుపులు, నల్లని కంబళ్ళలో 
అంతటా మృత్యువే 
విస్తరించుకొని ఉండి, హఠాత్తుగా ఒక్కసారి ఊపిరి వదుల్తుంది 
గట్టిగా ఊదుతుంది, దుప్పట్లన్నీ తెరచాపలై ఉబ్బిపోయే ఒక కటిక రవం… 
అప్పుడు రేవులోకి తేలుకుంటూ వచ్చే శయ్యలు 
అదిగో అక్కడే ఎదురుచూస్తూ, అడ్మిరల్ వేషంలో. 

....> ( శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు )

Wednesday, June 11, 2014

నిశిరాత్రిన నా జ్ఞాపకాల అరణ్యంలో నన్ను నేను వెతుక్కుంటున్నాను

ఈరోజు రాత్రి నా నిస్సత్తువలా
నాకంటే ముందే నిషృహ నన్ను చేరింది
మామూలుగా ఈపాటికి నిద్రా దేవి 
నా కళ్ళ తలుపులు తట్టాల్సింది
మనసు తలుపులవద్ద ఆగిన జ్ఞాపకాలు
తన ఉనికిని ముళ్ళలా మనస్సులో గుచ్చుతుంటే
మనిషిని అన్న మాటే మర్చి .. మాటలు రాని 
మూగవానిలా మారాను..గతం గాయం చేస్తే 
నిజ నిప్పులా ఇప్పటికీ నన్ను
 తగల బెడుతూనే ఉంది 

గోడమీద చిన్న ముల్లు
ఈ బరువైన కాలాన్ని నెట్టటానికి
అష్టకష్టాలు పడుతుంది
అచ్చం ఆగిపోయిన నా జీవితంలా 
కాలం నడుస్తూనే ఉంది 
కాని గతం లో జీవితం ఆగిపోయింది 
కదలని గడియారపు ముల్లులా మారాను 
నీవు బాగానే ఉన్నావు ..
కొత్త పరిచయాలు కొత్తజీవితంతో 
నిన్ను నీవు మర్చిపోయావు 
నీకు గతం అక్కరలేదు 
ప్రస్తుతం నీవు ఆనందంగా ఉండాలి
దానికోసమేగా గతాన్ని ఫనంగా పెట్టావు
అస్సలు నేనెవరో గుర్తున్నన్నా
కనిపిస్తే ఎవ్వరూ అని అడుగుతవేమో 

బాధలొ భావుకత వెతుక్కుంటూ
నవ్వులు పులుముకుని ఆనందం నటిస్తూ
నా ప్రస్తుతాన్ని గడిపేస్తున్నా 

ఇక అలిసిపోయాను, ఇంకేమైనా చెయ్యాలని
ఈ నిశిరాత్రిన నా జ్ఞాపకాల అరణ్యంలో
నన్ను నేను వెతుక్కుంటున్నాను
నీకు ఎలాగు దొరకను
ఎందుకంటే నీకు నేను అవసరం లేదు
అందుకే నాకు నేనైనా దొరుకుతనేమో అని
వెతుక్కుంటున్నా అయినా   నా పిచ్చి గాని
ఇంకా ఎక్కడని వెతకను నన్ను నేను  ఎందుకు దొరుకుతాను చెప్పు............................?

నా గతం నుండి నన్ను నేను
పెరికి తెచ్చుకుంటున్నాను
ఎక్కడినా నిన్ను చూద్దమని 
నా గతంలో నీవున్నవు 
కాని నాకు నేను దూరం అయ్యనే అని బాధ 
ఇప్పటికి ప్రతిక్షనం నన్ను వేదిస్తూనే ఉంది 

Monday, June 9, 2014

నిశిరేయి నిదురలో నిన్ను అడిగాను..?

నిశిరేయి నిదురలో నిన్ను అడిగాను..?
నాకు దొరకని సమాదానం నీదగ్గరే ఉంచుకున్నావుగా..
నన్ను వీడి దూరమయ్యావెందుకని?
దగ్గర ఉన్నా గుర్తించలేని పరిస్తితుల్లొ ఉన్ననీవు ఎలా గుర్తిస్తావులే 
నీ కంట జారే నీరు చూసి ఏమడగను
ఏమడిగినా అది కోరేది నిన్నే .. ఆకన్నీరు తపన పడేది నీకోసమే ..
మరి ఎందుకు నన్ను ఏడిపించావని!
నన్ను ఏదిపిస్తూ నీవేదిస్తే ఆ ఏడుపులో నిజాన్ని గుర్తించవా 
నాకు తెలుసు నన్ను నీవు మరిచావని
మరిచానని అనుకొంటున్నావు మరిచి పొమ్మని బలవంతం చేస్తుంది నీవేగా 
నీవు అనుకోకు నేను నిన్ను మరిచానని
నేలో నేణు చూసుకున్న ప్రతిసారి కనిపించేది నీవే అని నీకూ తెల్సు 
మనిద్దరి వలపూ ఎన్నటికీ వమ్ముకాదని
ఆ నమ్మకమే ఇప్పటికే బ్రతికిస్తుంది అదెన్నాల్లో తెలీక 
నీవుకాదు విధిరాతే నన్ను వంచించిందని!
ఆ విదితాతలో .. గతితప్పిన మనస్సైంది నాది ఏమని చెప్పను

నా ఊసులు నీకర్ధమయ్యాయోలేదో

వలదన్న వినని నా మనసు
నీకోసం తనకు తాను బందీ అవుతుంటే
తొంగిచూసిన నన్ను చెదరగొట్టింది నువ్వే కదూ 
నాకు తెలియని తావుకి తోసుకెళ్ళిందీ 
ఆ తర్వాత తెల్సింది ఆ చిరునవ్వు 
మరికరి సొంతం అని
నిన్ను తిరిగి రారమ్మని కంటినీరువిడిచా నీకోసం
ఇన్నిటా మూగనై నీ వర్ణనలో మునిగి
ప్రతినిమిషం పరితపిస్తూనేఉన్నా  

ఎక్వేరియం చేపలా … నేనూ..
మునివేలి గోటితో..
చెక్కిళ్ళు మీటుతావు
ఆసాంతం నీ ప్రేమలో..
అందంగా బందీగా ..
నా పిలుపు.. ఊచలకావల
ఏవో రావాలవుతుంటే..చూస్తాను
నన్నల్లిబిల్లి తిప్పుతూ.. నువ్వు
నీ చుట్టూ తిరుగుతున్న..
నా ఆలోచనలు..
నువ్వెళ్ళిపోతావు..
నీరు సద్దు మణుగుతుంది
పంజరమాగిపోతుంది !!
నా ఊసులు నీకర్ధమయ్యాయోలేదో
ఐనా.. స్థిరంగా నేనక్కడే !
నీకోసం  ఎదురు చూస్తూ…

Sunday, June 8, 2014

నేను ఇప్పుడు అబద్దంగా మిగిలిపోయిన నిజాన్ని

చెక్కిళ్ళ చెరువు గట్లు తెగకముందే
యాతమేదైనా తవ్వి తీయాలి.
నీ నీడలోని జవసత్వాలు..
ఇకనైనా నా తోడు కావాలి.
నేనోడిపోయాను..నీ జోడు కావాలి
కాని నీవు నాదగ్గర లేవు
మరొకరి చెంత ఆనందంగా ఉన్నావు
నన్ను  గుర్తించలేనంతగా 
నేనెవరో తెల్సుకోలేనంతగా 
నీ  ఆనందానికి నేనెప్పుడు అడ్డు రను
అందుకే నన్ను నేను శిక్షించుకుటున్న 
నీ ఆనందంకోసం నీ పెదవిపై చిరునవ్వు 
ఎప్పుడు అలగే ఉండాలి 
నీ జీవితంలో నాలంటీ వేష్టుగాల్లు 
వస్తారు పోతారు ...నాలాగా 

తెలియలేని దారుల్లో తచ్చాడడానికి
ఏ కాంతి తీగలూ వంచలేను..
తడి కంటి కాంతి ఇప్పటికే
కానరాకుండా పోయింది 
నేనిప్పుడు చీకట్లో తచ్చాడుతున్నా 
నాకు వెలుగు అస్సలు వద్దు 
నాకు ఈ చీకటే బాగుంది 
నన్ను నేను నాకు నేను 
ఎప్పుడో నమ్మటం మానేశాను 
ఎందుకంటే నేను ఓడిపోయాను 
నిర్జీవంగా పడి ఉన్నా 
చలనం లేని నన్ను 
ఓడార్చాలని ఒక్కప్పుడూ 
ఆశించే వాడిని ఇప్పుడూ 
చలనం లేణి శవాన్ని 
వద్దు నాకు నేనే మర్చిపోయిన మనిషిని 
సిదిలాన్ని ఇప్పుడు నేను 
ఓడిపోయి వాడిపోయిన వాన్ని

నా మనసు గాయాలకి
ఏ మందూ వెదకలేను...
కాలంతో తిరిగిన పాదాల క్రింద
విధి అరిగిపోయింది.
నేను విది అడిన నాటకంలో సమిధను 
వద్దు నాకు ఎవ్వరు వద్దు ..
ప్రపంచంలో నేనొక ఒంటరి జీవిని 
మోసపోయాను ...నమ్మాను 
నన్ను నేణు కూడా నమ్మలేనంతగా 
నిజాన్ని కల్ల్దురుగా చూస్తు ఇంకా 
నన్ను నేను ఎల మోసం చేసుకోను 
ఇదేన నమంకం ఇదేన జీవితం
ఎవస్రి స్వార్దం వాల్లది ...
ఎవరి జీవితం వాల్లది 
నేనెవర్ని వాళ్ళను అడగటానికి 
అప్పుడేదో టైం పాస్ కోసం 
నేను వాల్లకు తారస్ పడ్డా
ఇప్పుడూ నాకంటే గొప్ప మనుషులు 
గొప్ప మనసున్న వాల్లమధ్య నేను
ఎందుకు గుర్తుకు రావాలి 

రెప్ప బరువు లేపలేనిది న జీవితం 
చీకట్లో కరిగి ఈకల్లోకింకుతూ..
ఎంత సమయం మింగిందో!

అటుప్రక్క వాలు చూడని ఆశ,
వద్దన్నా.. నడినెత్తికెగబాకుతుంది.
ఇదేనా జీవితం చీ అనిపిస్తుంది నాకు నాకే  

తూర్పు కొండలు కృంగిన శబ్దాన్ని
ఆకు సందులు చిలకరించే సరికి..
ముళ్ళకంప మీద ఎర్ర గులాబీలు
బద్ధకంగా పూశాయి..
నా ఓటమిని నాకు గుర్తు చేస్తూ 
నేనేంటో చెప్పేస్తున్నాహి 
నమ్మాలి నమంక తప్పదు కదా 
జరుగుతున్నవి నిజాలు 
నేను ఇప్పుడు అబద్దంగా మిగిలిపోయిన నిజాన్ని 

Friday, June 6, 2014

అబద్దపు రక్తపుచారికలే కనిపిస్తున్నాయి నిజాయితీ ఇప్పుడు చోటు ఎక్కడిది

అన్ని నాకే తెల్సు అని నిబ్బరంగా ఉంటాను 
నెట్టురోడుతున్న చేతుల్ని వెనక్కు పెట్టుకొని మరీ..?
ఏం తెలియనట్టు అమాయకంగా ఫేస్ పెట్టి 
నటిస్తున్న నీ నటన అమోఘం

పైకి చేప్పే వన్నీ నీతులే ఎదుటోడి జీవితంలో 
గాట్లు పెట్టి వచ్చే  ఆ రక్తపు చుక్కలను  ఎవ్వరూ 
చూడకుండా ఆత్రంగా తాగుతున్నావు ..?

మనసు వెనక తడి తెరలను తడుముతునే కొద్దీ 
మనసు  నిండా బాధ నెత్తురు.

నా జ్ఞాపకాల దొంతరలను కుప్పలను కదిలిస్తే 
అన్నీ అస్పష్టపు మాటలు ..నీతి భాహ్యపు చేష్టలు 

నిజాన్ని చూడాలని ఆత్రంగా తడుముకొన్న ప్రతిసారి
అబద్దపు రక్తపుచారికలే కనిపిస్తున్నాయి నిజాయితీ ఇప్పుడు చోటు ఎక్కడిది 

కన్నీటి ఊబిలో  రొజు రోజు కు కూరుకపోతున్నా
ఇక ఎప్పటికీ లేవలేనేమో ..?
పగిలిన గుండె ముక్కలు తొక్కి మరీ 
నీ ఆనందాన్ని వెతుక్కున్నవు ..ఇదా నీ నైజం ప్రియతమా

నీకేదో చెబుదామని మొదలుపెట్టానా? 
తలలో నాడుల మద్యి ప్రకంపనలు ..
అస్పుష్టమైన సమాదానాల మద్యి ఇరుక్కపోయిన నిజాలు 

Thursday, June 5, 2014

నన్ను నాకు తిరిగి ఇవ్వవా ప్లీజ్..


నీ స్నేహం నేను ఎన్నడు అడుగలేదు...నీ తోడు కావాలని నేను ఎప్పుడు కోరలేదు నేను ఊహించని నీ స్నేహం నాకు పంచావు.అప్పటికే దెబ్బతిన్న నాగుండెకు ఓదార్పు నౌతాఅంటూ నీ అంతట నీవే వచ్చావు...ఎదురు చూడని ఏవత ఎదురేగి నాకోసమే వచ్చిందేమో అని ఎంతగా మురిసిపోయానో నీకు తెల్సు.నాకే తెలియకుండా నా తోడుగా నిలిచావు
నాగుండమేల్లో దైర్యాన్ని నింపి..ప్రపంచంలో ఇలాంటీ స్నేహాన్ని పొందిన
నేను ఏంత అదృష్టవంతున్నో అని మురిపోతు క్షనానే ఒక్కసారి అవమానం అనేకత్తులతొ కసిగా పొడిచావు అది చాలదన్నట్టూ వాడితో మాటలు నీవే అనిపించావు కదా..నిన్ను మర్చిపొమ్మని ఇప్పుడు ఎందుకు నన్ను అడుగుతున్నావు..నన్ను వీడి పోవడానికి కావాలని అందరిలో
నన్నెందుకు అవమానిస్తున్నావు...

కన్నీరు ఒలికి చెదిరిన
అక్షరాలు ముద్దగా అయ్యాయి
కంటిని ఆకట్టుకున్న
చిత్రాలు విచిత్రాలై
గుండెను పిండేసే
కావ్యాలుగా మారాయి
మూగగా రోధించే నీజ్ఞాపకాలు
నా గుండెల్లో రక్తనమూనాలుగా
మిగిలిపోయాయి మౌనంగా
నీకన్నీ తెలుసు కాని తెలియనట్టు నటిస్తావు .... ఒకప్పుడు నీకేం తెలియని అమాయకురాలివి కాని ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ గుండెలమీద కొడితే భాదపడాతనో తెల్సి మరీ గుండెళ్ళో అవమానించి అక్రోశించేలా చేస్తున్నావు .. అన్నిటిలో నన్ను బ్లాక్ చేశావు ..నా మనసును బ్లంక్ గా మార్చావు ... మనసునే ఏమార్చావు ...బాపు బొమ్మవని మురిసిపోయా ప్రేమబందానికి నీవో సింబల్ గా నాగుండెల్లో శాశ్వితంగా నీపేరు రాసుకున్నా...
నీ చిరునవ్వులు
ఇప్పుడు నావికావు
నీ ప్రేమ పిలుపులు
నావికావు ఇప్పుడు
నీ ఆప్యాయమైన
పలుకరింపుల్లో
ఎవరో చేరారు.. వాళ్ళకోసమే
నీ మనస్సు తపిస్తుంది

ఆశించని ఎంతో గొప్ప అందమైన ప్రపంచంఅని ఊహించుకున్నా , నీవు ఆశించిన ప్రపంచం ముందు అది ఎందుకూ కొరగాదు. అనుకున్నది నెరవేరనప్పుడు వజ్రాలే అరచేతిలో వాలిపోయినా అవి ఇసుక రేణువులే అయిపోతాయి. అద్భుతమైన పగలు, అత్యంత ఆహ్లాదకరమైన రేయి ఇలా ఏముంటేనేమిటి? అవన్నీ అప్రధానమే. అనసవరమే. అనుకున్నది నీ ముందు వాలిపోయి.కాని ప్రతి కదలికలో నీవిప్పుడు లేవు నన్నొక్కడిని చేసి నీదారు చూసుకున్నావు మరొకరి వంచన చేరి నన్ను ఎప్పుడో మర్చిపోయావు కదూ ..? ఆశించిందే కరువైపోయాక నాకు మిగతావన్నీ ఎన్ని సొగసులు పులుముకున్నా, అవి శవానికి చేసిన అలంకారాల్లాగే ఉంటాయి. ప్రకృతి సహజంగా ఎన్నెన్ని వచ్చి మన ఎదురుగా నిలిస్తే నేమిటి? తన ప్రాణమైన ప్రేయసి తనతో లేకపోతే అంతా ఎడారిలా, అనంతమైన శూన్యంలా అనిపిస్తుంది. ఆ స్థితిలో అతని చూపులన్నీ ఆమె కోసమే వెతుకుతాయి.కాని ఆమె పట్టించుకోని క్షనాలన్నీ కస్సుమని కస్సుమని గుందెల్లో దిగబడి రక్తం ఓడుతున్నా తనకోసమే తపనపడీ తడబడుతుంది ఇదేనేమో నిజమైనా ప్రేమ అంటే ... ఏంటో పిచి పిచి ఆలోచనలు గుండెల్లో ఒదిగి ఉండాల్సిన భావాలు బాకులై గుండెల్లో గుచ్చుతూనే ఉన్నాయి ..నీవు నన్ను కాదు చీ పొమ్మన్నా ఎందుకో ఇంకా నా మనస్సు నిన్నే కోరుకుంటోంది ,,చూడు నా గుండెచప్పుడుని అక్షరాలుగా మార్చాను ఒక్కసారి చదువు క్రిదరాసిన మనస్సు అక్షరాలు ..
కాలం పరుగెడుతూనే
గడియారం ముల్లు
ఆపినంత మాత్రాన
కాలం ఆగమంటే ఆగుతుందా
నీవు వస్తాను
అంటే కాలాని ఆపేస్తా
ఎందుకంటే ఆక్షనంలో
నీవు నాతొ వుంటావని
చిన్న ఆశ..
ప్లీజ్ ఒక్కసారి రావూ
కాసేపు…కాసేపంటే కాసేపే
అందుకే అన్ని
పనులు పక్కన పెట్టి
నీకోసం ఎదురు చూస్తుంటా
మనం కలిసే ఆ రోజును
నా కోసమై జన్మించనీ
కొన్ని క్షణాలను
దోసిట్లో నింపుకుని
నీకోసం ఎదురు చూస్తున్నా
గుండేభారంగా మారింది
అందుకే కొద్దిసేపైనా
నన్ను నేను అభిషేకించుకోనీ….
కొద్ది క్షనాలైనా ఆనంద పడనీ
అయినా జరగని సమయం కోసం
ఆగని గడియారం కోసం
ఆశగా ఎదురు చూడటం పిచ్చేమో
నిన్నటి రోజున జనించిన
ఆ రాగం సృతి తప్పుతోంది
నా గుండె గదిలో
ధ్వనిస్తూనే ఉంటుంది
తరిగి పోయిన గతం
నన్ను వెక్కిరిస్తుంది
మనసు పొరలలో జ్ఞాపకాలు
రెపరెపలాడుతూనే వుంటాయి
మరో రోజూ అలసటతో
విశ్రమించే వరకు….
నాలో నీ జ్ఞాపకాలు
చేరి చింద్రం చేస్తుంటాయి
తెగని ఆలోచనల దారానికి
ఎగురుతున్న
జీవితపు గాలిపటం
గడియారం ముల్లుల
మధ్య చిక్కుకుపోయింది
ఈ నిశ్శబ్దంలో నా శబ్దం ఆలకిస్తూ
నిశ్శబ్దంగా న్స్తేజంగా
మల్లీ మల్లీ జ్ఞాపకాలి పుడుతూనే ఉన్నాయి

నీ జ్ఞాపకాలు..ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నాయి..

ఈ రోజు ఎందుకో కలవరం..
నీవు ఎక్కడున్నావంటూ 
మనస్సు అడుగుతోంది
గాయాలు గా మారిన జ్ఞాపకాలు...
ప్రతి క్షనం గుర్తుకొస్తున్నావు..
నీవెక్కడంటూ మనస్సు కూడా 
నీకోసం తడుముకొంటోంది
మనస్సుకు సమాదానం చెప్పలేక... 
నాకు నేను సమాదాన పర్చుకోలేక భాదపడుతున్నా
గుండేళ్ళో దాగిన గుప్పెడు నిజాలు 
నిన్నే గుర్తుచేస్తున్నాయి 
నీవు ఎక్కడున్నావంటూ అడుగుతున్నాయి..
కన్నీళ్ళకు కారనమౌతున్న 
నీ జ్ఞాపకాలు..ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నాయి..
ఎక్కడున్నావు 
ఎన్నాళ్ళినా ఏన్నేళ్ళీలా..
నీకోసం ఎదురు చూపులు 
అప్పటిదాకా ఈ ప్రాణం ఉండదేమో
నీవు గుర్తొచ్చినప్పుడల్లా గ
ట్టీగా పీలుస్తున్న స్వాస నిన్నే కోరుతోంది 
ఈ స్వాస ఎప్పటిదాకా ఉంటుందో తెలీదు
అయినా గుతుంచుకునే రిలేషన్ కాదు నాది 
అని అనుకొను నీవు హేపేగనే ఉన్న్వూ 
నిన్నే తలచుకొంటూ నేను ఇలా వున్నాను  

చావును నాపక్కన పడుకోబెట్టి వెర్రి నవ్వులు నవ్వుతాయి నీ "జ్ఞాపకాలు "

అనుక్షణం వెంటాడుతూ
నాతో పోరాడతాయి
నే పోరాడలేనని ఎదిరిస్తే
నాకు దూరమై శిక్షిస్తాయి...
నాలోని నరాలన్నిటిని తెంచేసి
నాలో నేను లేకుండా వంటర్ని చేసి
చావును నాపక్కన
పడుకోబెట్టి వెర్రి నవ్వులు
నవ్వుతాయి నీ "జ్ఞాపకాలు "

ఈ విశాల ప్రపంచంలో,
నా అస్థిత్వాన్ని శోధించమంటాయి
నీఉనికిని ఇంకా నాలోనే
దాచుకొని నిన్ను వెతుకుతాయి
నేనేంటో తెలియని నన్ను
నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తాయి
చంచలత్వంతో మోసం చేస్తాయి
నా నమ్మకాన్ని వెక్కిరిస్తాయి
ఆశను అడ్డంగా ఆవిరి చేస్తాయి
వాటిని పంచుకున్న పదిమందిలో
నన్ను అల్పుడుని చేస్తాయి
అందరిలో నన్ను వంటర్ని చేసి వెక్కిర్తిస్తాయి

ఒకో క్షణం,
ఒక్కో నిమిషం
ఒక్కో ఘడియ
నన్ను ప్రశ్నిస్తాయి
నీవెవరంటూ నన్ను
నా అసహాయతని నిలదీస్తాయి

Wednesday, June 4, 2014

నడీచే దారిలో రక్తం ఓడుతున్నా నడుస్తూనేఉన్నా

కారుచీకటిని 
నిలువున చీలుస్తూ
పరుచుకుంటున్న 
వెలుగుల తీరంలో
జీవన నైజం తన 
దిశ మార్చుకుండి
నాకు నేను 
ముళ్ళ బాట పరచుకొని
నడీచే దారిలో రక్తం ఓడుతున్నా
నడుస్తూనేఉన్నా 
గమ్యీం తెలియకపోయినా
రాత్రంతా మదనవేదన 
పడిన తనువు
అనంతాకాశాన్నుంచి 
జాలువారుతున్న
జలపాతపు 
సవ్వడిలో ముక్కలుగా
విరిగిపోతూనే ఉంది ..
మనసు చిరుగుల్లోఉంచి
కనిపిస్తున్న నిజాలను 
ఎవరు చూశాను
చూడాల్సిన అవసరం 
ఏముంది
మనసు తనుకోరిన 
హృదయంలో
పరకాయ ప్రవేశం చేస్తూ…
అనుభూతుల
పిచ్చుక గూడు 
అల్లుకుంటూ ఉంటుంది…
కాని ఆ మనస్సును 
ప్రశాతంగా 
ఉండనీయరుగా
దూరంగా నెట్టివేస్తున్నా 
ఆ మనస్సు ఇంకా
పాత జ్ఞాపకాలతో బైటికి రాలేక
లోపల వద్దని 
నెట్టివేస్తూ అవమానిస్తున్నా
సమాదానం లేని 
ప్రశ్నలా మిగిలీపోలేక
ఒంటరిగా ఆకాశంవైపు చూస్తూ
ఎవ్వరూ వినకుండా 
దిక్కులు పిక్కటిల్లేలా
అరుస్తుంటే ఆరోదన అరణ్య రోదనే కదా..?

Tuesday, June 3, 2014

ఓడిపోయాను .. గెలిపించే నీవు నాకు దగ్గరలేక

ఓడిపోయాను .. 
గెలవలేక కాదు గెలిపించే
నీవు నాకు దగ్గరలేక 
పోతూ పోతూ తట్టుకోలేనంత 
అవమానాన్ని నాకిచ్చి
ఓటమి పాలు చేసి 
ఎవ్వరినో గెలిపించవు 
ఓడించింది నీవు 
కాబట్టి తలవంచాను 
తలచుకున్న ప్రతి క్షనం 
గుర్తొచ్చి వేదిస్తున్న గతం 

మనమంతా ఒక్కటే 
అనుకొన్న నా మంచితనపు ఓటమి ..
అవసరాల్లో వున్నవారిని 
అధుకొన్న ఆదరణ ఓటమి..
స్నేహితుల మీద పెంచుకొన్న 
నమ్మకం ఓటమి..
న వాళ్ళతో పంచుకొన్న 
అబిమానం ఓటమి..
మాటలతో అతలడుతున్న 
మాటల మంత్రికుల మధ్య ..
మనసున్న మనిషిగా మనుగడ సాదించలేక ..
మర్మమున్న మన్సిగా 
మన్ననలు పొందుతున్నాను 
మారుతున్న కాలంతో పాటు  
నేను మరిపోయా.. ఓడిపోయాను