ముత్యాల వాన జల్లులకోసం
ఎదురుచూసే ధాత్రిలా
నీరాకకై శూన్యంలోకి చూస్తూ కుర్చున్నాను
నా మది పావురంలా రెక్కలుసాచి
ఆ పచ్చటి నేలలను నీలిమబ్బులను దాటి
అనంతమైన ఈ ప్రేమతాలూకు
సూన్యంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది
నాలో తడసి ముద్దయిపోయిన
ఈ ఆలోచనా తరంగాలను ఆపలేక
చీకటిదారులలో
మగ్గిపోతున్న ఈ ఒంటరి నావని చూసి
అనంతమైన ఆ నీలిసంద్రం గర్జిస్తూ
పువ్వులా పట్టి పీల్చేస్తున్న
సీతాకోకచిలుకలాంటి
నా ఆలోచల్ని పరిహసిస్తూ
తన గర్భాని చీల్చుకుని చొచ్చుకు
వచ్చిన జలతరంగాలతో
పద్మవ్యుహాని పన్ని నన్ను
తన గర్భంలోకి తీసుకుపోతోంది
నా చుటూ వ్యాపించిన
ఈ జలనిశీధిలో అంతర్దానమౌతున్న నాకు
నీ స్మృతుల తరంగగోష
తప్ప మరొకటి వినిపించుటలేదు
అనంతమైన ఆ సముద్రగర్భంలోకి
చొచ్చుకుపోతున్నా ...
నీ జ్ఞాపకాలతో తడసి
పులకించాలని మది ఆరాటపడుతోంది ....
ఎదురుచూసే ధాత్రిలా
నీరాకకై శూన్యంలోకి చూస్తూ కుర్చున్నాను
నా మది పావురంలా రెక్కలుసాచి
ఆ పచ్చటి నేలలను నీలిమబ్బులను దాటి
అనంతమైన ఈ ప్రేమతాలూకు
సూన్యంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది
నాలో తడసి ముద్దయిపోయిన
ఈ ఆలోచనా తరంగాలను ఆపలేక
చీకటిదారులలో
మగ్గిపోతున్న ఈ ఒంటరి నావని చూసి
అనంతమైన ఆ నీలిసంద్రం గర్జిస్తూ
పువ్వులా పట్టి పీల్చేస్తున్న
సీతాకోకచిలుకలాంటి
నా ఆలోచల్ని పరిహసిస్తూ
తన గర్భాని చీల్చుకుని చొచ్చుకు
వచ్చిన జలతరంగాలతో
పద్మవ్యుహాని పన్ని నన్ను
తన గర్భంలోకి తీసుకుపోతోంది
నా చుటూ వ్యాపించిన
ఈ జలనిశీధిలో అంతర్దానమౌతున్న నాకు
నీ స్మృతుల తరంగగోష
తప్ప మరొకటి వినిపించుటలేదు
అనంతమైన ఆ సముద్రగర్భంలోకి
చొచ్చుకుపోతున్నా ...
నీ జ్ఞాపకాలతో తడసి
పులకించాలని మది ఆరాటపడుతోంది ....