. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, June 8, 2016

నాలో తడసి ముద్దయిపోయిన ఆలోచన

అనంతమైన ఈ ప్రేమతాలూకు 
సూన్యంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది
నాలో తడసి ముద్దయిపోయిన 
ఈ ఆలోచనా తరంగాలను ఆపలేక 
చీకటిదారులలో మగ్గిపోతున్న 
ఈ ఒంటరి నావని చూసి 
అనంతమైన ఆ నీలిసంద్రం గర్జిస్తూ 
పువ్వులా పట్టి పీల్చేస్తున్న 
సీతాకోకచిలుకలాంటి 
నా ఆలోచల్ని పరిహసిస్తూ 
తన గర్భాని చీల్చుకుని 
చొచ్చుకు వచ్చిన జలతరంగాలతో 
పద్మవ్యుహాని పన్ని నన్ను 
తన గర్భంలోకి తీసుకుపోతోంది 
నా చుటూ వ్యాపించిన 
ఈ జలనిశీధిలో 
అంతర్దానమౌతున్న నాకు 
నీ స్మృతుల తరంగగోష 
తప్ప మరొకటి వినిపించుటలేదు 
అనంతమైన ఆ సముద్రగర్భంలోకి 
చొచ్చుకుపోతున్నా ...
నీ జ్ఞాపకాలతో తడసి పులకించాలని 
మది ఆరాటపడుతోంది ....