నన్ను నన్నులా ఉండనివ్వక నలుగురిలో నన్ను పిచ్చి వాన్ని చేసి .. చేసి ఎవరికీ కనిపించకుండా నాకు మాత్రమే కనిపిస్తావు ..నవ్విస్తావు ..ఎడ్పిస్తావు.. ఎందుకు నా ఊహల్లో చేరి వేదిస్తావెందుకు... నా అనుమతి లేకుండా నా నా ఊహల ఉనికి తెలుసుకుని నా పరిస్తుతుల్లోకి ,నా మది లోతుల్లోకి దూరిపోడానికి నీకు అనుమతిని ఎవరిచ్చారు ..నా అనుమతిలేకుండానే నాలో చేరావు .. ఎవరికోసమో నన్ను దూషించి దూరం అయ్యావు...ఇప్పటికీ అందరిముందు అవమానిస్తూ ఆనందిస్తున్న నిన్ను చూస్తే నవ్వాలో ఏడ్వాలో తెలియడంలేదు.. నాకు తెల్సింది మౌనంగా రోదించడం తప్ప..అది పైకి నటిస్తావని నటిస్తున్నావని తెలియదు ...నీవో గొప్ప నటివి... తిమ్మిని బమ్మిని చేయగలవు .. అందరిలో నన్నో దోషిని చేయగల సత్తా నీకు మాత్రమే వుంది అదో అలా నవ్వకు ...అవేవి అడుగుదామనుకున్ననో అడగకుండానే మర్చి పోతానేమో ... ఆ నవ్వుకు ఏ మంత్రం నేర్పవు ?? ఎవరినైనా మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది ? మరీ అలా మూతి ముడుచుకోకు విచుక్కున్న కుసుమంలా నీ పెదాలు నవ్వులు రువ్విస్తుంటే అందంగా వుంటావు .....కాదు ఆ అందంలో నిజం లేదు ...అందమైన దెయ్యానికి ....మాటలు నేర్చిన చిలకవు...అందరిని నమ్మించావు నేనో దోషిని అని అందరీ చెప్పావా ఇంకా ఎవ్వరైనా మిగిలారా..నీవు గొప్ప అని చెప్పుకోవడం ..నిన్ను నీవు మంచి అని చెప్పుకోవడం కోసం ఏమైనా చేయగలవని నీ పరిచయంలో ఊహించలేకపోయాను
ఒంటరితనం వచ్చి నన్ను ప్రశ్నించింది .. ఎప్పుడు నాతో గడుపుతావు అని ? ఏది సమాదానం ఇద్దాము అనేంతలో నువ్వు నా ప్రక్కనే వచ్చి నిలబడ్డావు ...అప్పుడు దాని మొహం చూడాలి ..పాపం .. దాన్ని చూసి నువ్వు నవ్వుతుంటే ఏమి చేయాలో తెలియక అది వేనుతిరుగుతున్నప్పుడు నువ్వు దానికేదో నష్టం కలిగిస్తున్నట్టు అది వేల్లిపోయిందే ..అయ్యో ఏమని చెప్పాలి .. ఒంటరితనమే కాదు ..నువ్వు వచ్చిన తరువాత అందరు వేసే అపహాస్యపు బాణాలు కూడా నిన్ను దాటి వచ్చేంత ధైర్యం చేయలేక వాళ్ళ వద్దకే తిరిగి వెళ్తుంటే లోలోన ఎంత భాదపడతానో నీకేం తెలుసు
నా నవ్వును నువ్వు ఎక్కడ్నుంచి వెతికి తీసుకొచ్చుకోను ఏదారో తెలియక ఎప్పటి కప్పుడు తికమక పడుతూనూ ఉన్నా..ప్రపంచం ఇంత చీకటిగా ఉందేంటో అర్దం అవ్వడంలేదు.. ... ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళను అని ఇస్తున్నావనుకున్నా నన్ను నమ్మక ద్రోహం చేస్తున్నావని ఊహించలేకపోయా..