గుండె లోతుల్లో సమాధి చేసిన జ్ణాపకం,
మనసు గోడల బీటలు చూస్తూ
విధి రాతలవని పక్కకు తోసి
తడి కళ్ళతో చిత్తడి భవితలోని
కొత్త చిగురాకు కోసం ఆశగా
ఎదురు చూస్తుంది మనస్సు
మనసు గోడల బీటలు చూస్తూ
విధి రాతలవని పక్కకు తోసి
తడి కళ్ళతో చిత్తడి భవితలోని
కొత్త చిగురాకు కోసం ఆశగా
ఎదురు చూస్తుంది మనస్సు
ఓటమెదురైనా వెనుదిరగని
తడికిక నా కళ్ళలో తావీయనని..
నడక నేర్చిన శవమై
జీవం వైపుగా ఆగక సాగే పయనమమిది
కనువిప్పు తెలియని కరిగిపోతున్న
కాలం సాక్షిగా కన్నీటిలో
తేలాడే నిజాలు తెలిపే గత0నాది
మానిన గాయాల్ని రేపడం,
నీకు అలవాటేమో కదూ
అలలారిన మనసు కొలనులో
జ్ఞాపకాలిసరడం నీకు అలవాటైన
నీ ప్రవృత్తేమో కదూ
ఆరిన జ్ఞాపకాలను తిరిగి
రగిలించడం నీకానందమెమో కదూ