అద్వైత క్షణాలన్నీ
నీ జ్ఞాపకాలలో కలిసిపోతుంటే
నన్ను నేను కోల్పోయి
నీ ఊహలలో వెదుకుతుంటాను.
నువ్వొస్తావు,
మన ఇరువురి మధ్య
ఎన్నో మౌనాలు దోబూచులాడతాయి.
నీ దగ్గరున్న నవ్వుల నురగను
నా పెదాలపై అందంగా అంటిస్తావు.
అదేంటో మరి అర్ధం కాదు!
నీ సాంగత్యంలో ఎంత సమయమైనా
మంచుబిందువులా ఇట్టే కరిగిపోతుంది
అదేంటి ఇదినిజంకాదా నాఊహనా
ఊహే ఇంత మధురంగా వుంటే
వాస్తవం ఇంకెంత బాగుంటుందో కదూ..?
నీ జ్ఞాపకాలలో కలిసిపోతుంటే
నన్ను నేను కోల్పోయి
నీ ఊహలలో వెదుకుతుంటాను.
నువ్వొస్తావు,
మన ఇరువురి మధ్య
ఎన్నో మౌనాలు దోబూచులాడతాయి.
నీ దగ్గరున్న నవ్వుల నురగను
నా పెదాలపై అందంగా అంటిస్తావు.
అదేంటో మరి అర్ధం కాదు!
నీ సాంగత్యంలో ఎంత సమయమైనా
మంచుబిందువులా ఇట్టే కరిగిపోతుంది
అదేంటి ఇదినిజంకాదా నాఊహనా
ఊహే ఇంత మధురంగా వుంటే
వాస్తవం ఇంకెంత బాగుంటుందో కదూ..?