. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, May 6, 2012

ఈ మనస్సేనా neenu కోరుకున్నది

మనసుని తడిమి చూడాలని.. ఆ మనసులో స్థిరపడిపోవాలనీ విశ్వప్రయత్నాలూ చేస్తాం. ఆ మనసులో స్థానం దక్కించుకున్న క్షణం ఏదో తెలీని వెలితి వెంటాడడం మొదలవుతుంది. 'ఈ మాత్రం దానికా ఇంతగా తాపత్రయపడింది' అన్న భావనా నిరాసక్తతకు గురిచేస్తుంది. మనం వేచి ఉండడాన్నీ, ఉవ్విళ్లూరడాన్నీ ఆస్వాదించినంతగా అదే ఎదురుచూపు వాస్తవంగా మారిన క్షణాన్ని అణువణువూ ఆనందంతో నింపుకోలేం.

ఆత్మీయమైన మనిషిని కలవాలని, ఎన్నో ఊసులు పంచుకోవాలనీ అనుకున్నప్పటి ఊహలు.. అలా కలిశాక మాటలుగా మారక మూగబోతాయి. మనం అభిమానించిన వ్యక్తీ, మారలేదు.. వారి పట్ల మన ఆత్మీయతా మారలేదు. కానీ అగాధమంత శూన్యత ఆవరించేసి పొడిపొడి మాటలతో, ఎదుటి మనిషి కంట్లో మనల్ని వెదుక్కునే గందరగోళపు చూపులతో క్షణాల్ని యుగాలుగా గడిపేస్తాం.

మనకు తెలుసు.. మనం అలా కాదని ఉండదలుచుకున్నది! కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయత. మనిషి కళ్ల ముందు మాయమయ్యాక మళ్లీ మనల్ని మనం నిందించుకుంటూనే ఉంటాం.. 'ఈ క్షణం కోసం ఎదురుచూసి ఇలాగా ప్రవర్తించేది' అని! ఇక్కడ మన జీవితంలోని ప్రతీ అనుబంధానికీ ఈ పరిస్థితి వర్తిస్తుంది. ఎదుటి వ్యక్తి మనకు ఎలా ఆత్మీయులు అన్నది పక్కనబెడితే.. బాగా నచ్చిన ఏ వ్యక్తి విషయంలో అయినా మనం ఇలాగే ప్రవర్తిస్తాం.

ఓ మనిషి చుట్టూ తిరుగాడే ఆలోచనల్ని ప్రేమించినంతగా భౌతికంగా ఆ మనిషిని ప్రేమించమేమో! ఏ అనుబంధమైనా కానీయండి.. 'అవతలి వ్యక్తి మన వ్యక్తి' అనే ఆలోచన తెలీని వ్యామోహాన్ని పెంచుతుంది. ఎంతగా ఆ మనిషి గురించి ఆలోచిస్తామో అంతగా ఆ వ్యామోహం పెరిగిపోతుంది. ఆ మనిషి పట్ల వ్యామోహం ఆలోచనల్లో తిరుగాడుతున్న స్థితికీ.. అదే మనిషి భౌతికంగా దగ్గరగా ఉండే స్థితికీ మధ్య సారూప్యమే ఉండదు.

మన ఆలోచనలు అన్నీ ఎదుటి మనిషి మనస్సుని తడిమి చూసే ప్రయత్నం చేస్తాయి.. అదే మనిషి భౌతిక రూపం ఆ మనిషి మనస్సుతో సరిపోలినట్లు అన్పించక సందేహపపడతాం. 'మన మనసులో ఉన్న మనిషి ఈ దేహంలో ఉన్న మనిషీ ఒక్కరేనా' అన్న సంధిగ్ధతకి లోనవుతాం.

మన చుట్టూ తిరుగాడే మనుషుల భౌతిక రూపాలకూ, వారి మానసిక స్థితులకూ అస్సలు పోలికే దొరక్క గందరగోళానికి లోనయ్యే ప్రాణాలెన్నో! మనస్సు మనస్సుతోనే సావాసం చేస్తుంది. కానీ భౌతికంగా మాత్రం కలిసి దగ్గరగా గడిపేది దేహాలే. ఆ దేహాల్లో మనం సావాసం చేస్తున్న మనస్సు ఆనవాళ్లు పట్టుకోలేక మనిషికి మానసికంగానూ దూరమయ్యే అభాగ్యులు ఎందరో!

మనస్సులకూ, దేహాలకూ ముడిపెట్టకుండా దేనికది ప్రత్యేకంగా చూసే పరిపక్వత అలవడితే మనుషుల్ని ఆలోచనల్లో ఎంతగా అభిమానిస్తామో భౌతికంగా సాన్నిహిత్యంలో తచ్చాడేటప్పుడూ అంతకంటే ఎక్కువ అభిమానిస్తాం. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలూ, స్నేహాలూ, ప్రేమలూ.. వెదుకులాటల దగ్గర ఆగిపోకపోతే మధురమైన జ్ఞాపకాలకు లోటేం ఉండదు.