"..నీవు నా పక్కన ఉంటే
ఆకాశాన్ని హత్తుకున్నంత ఆనందం
నీవు నా వైపు చూస్తే
మనసు లోకమై విహదిరిస్తుం
సముద్రమై నిన్ను స్పృశిస్తుంది
నువ్వు నా భుజంపై వాలిపోతే
అనంతపు జీవితాన్ని మోసినట్టుగా
హృదయం దూది పింజెలా మారిపోతుంది
ఏదో ఒక సమయంలో
నీకోసం నిరీక్షించేలా చేసే నీ వాలు చూపు
నన్ను వివశుడిని చేస్తుంది
గుండెల్లో ప్రేమ విత్తనం నాటుతుంది
అవును ..నీ మీద నేను వాలిపోయి
చందమామను చూస్తూ ..
పుడమి వెన్నెలను చేతుల్లోకి
తీసుకుని ...నగ్నంగా విహరించినంత సంబురం
నువ్వు ..నేను ఒకే నాదమై
ప్రేమ వర్షంలో తడిసి పోయినట్టు
కల నన్ను కుదిపేస్తోంది
అవును .. నిన్నటి దాకా
నేను మనిషిగా ప్రయాణం చేశా
కానీ ..నీతో స్నేహం కలిగాకా
ప్రేమైక జీవిగా మారిపోయా .."