. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, May 13, 2012

"నువ్వెందుకు ఇలా ప్రవర్తించావని" మన వ్యక్తిగత స్వేచ్ఛలోకి ప్రవేశించి ప్రశ్నించరో వారిని అమితంగా ఇష్టపడతాం మనం.

ఏ హృదయం అయితే తన అశాంతిని, అక్కసుని మరో హృదయంపైకి వెదజల్లాలని ప్రయత్నించదో అలాంటి హృదయాన్ని కలిగి ఉండడానికి మించిన అదృష్టం మరొకటి లేదని భావిస్తాను నేను.

ఏ తారుమారైన అంచనానో, మరో అసంతృప్తో, లేదా మనం ఊహల ద్వారా సృష్టించుకునే అపార్థాల మాయల ముసుగో.. మనల్ని స్థిమితంగా ఉండనీయక మాటల ద్వారానో, చేతల ద్వారానో మన అల్పత్వాన్ని ప్రదర్శించ ప్రయత్నిస్తుంది.

ఏ మనిషి సాన్నిహిత్యం అంచనాలకు లోబడదో.. ఏ మనిషి మనం ఎలా ప్రవర్తించినా.. "నువ్వెందుకు ఇలా ప్రవర్తించావని" మన వ్యక్తిగత స్వేచ్ఛలోకి ప్రవేశించి ప్రశ్నించరో వారిని అమితంగా ఇష్టపడతాం మనం.

"నీ నుండి నాకేం అక్కర్లేదు.. ఓ మంచి స్నేహం చాలు" అన్న కొద్దిపాటి స్వార్థం కూడా లేని స్వభావం మనలో ప్రస్ఫుటంగా కన్పిస్తే స్నేహ హస్తాన్ని చాచని వారెవరుంటారు?

అలా అన్ కండిషనల్ స్నేహంలో కూడా.. మనం ఎదుటి వ్యక్తిని అనవసర ప్రమేయంతో చీటికీ మాటికీ సరిచేయాలని ప్రయత్నిస్తే ఆ అనవసర జోక్యాన్ని తట్టుకోలేక దూరమవ్వని వారు మాత్రం అరుదే!

మన అనుకున్న మనిషిపై మనకు తెలియకుండానే మనం పెత్తనం చెలాయించేస్తుంటాం. మనిషి అనుకున్న టైమ్ కి రాకపోయినా, ఫోన్ చేయకపోయినా, కలవకపోయినా, మనం చెప్పినట్లు ప్రవర్తించకపోయినా, మన నిర్ణయాలు పాటించకపోయినా.. అన్నింటికీ నొచ్చుకుంటూనే ఉంటాం.

ఆ అసంతృప్తిని చల్చారక మనం అభిమానించే హృదయాలపైకీ పదునైన కత్తుల్ని మాటల రూపంలోనో, ఛేష్టల రూపంలోనో దూస్తూనే ఉంటాం.

ఎవ్వరూ మనవారు కారు! ఎవరి ప్రపంచం వారిది. ఓ వ్యక్తితో మనకు అనుబంధం ఏర్పడిదంటే అది ఏదో కార్యం నెరవేరడానికైనా అయి ఉండాలి, ఆ కార్యమేమిటన్నది ఈ క్షణం అర్థం కాకపోయినా ఎప్పుడోసారి దాని పర్యవసానం నిరూపితం అవుతూనే ఉంటుంది. ఒక్కోసారి మనం మన జీవితంలో పలువురు మనుషులతో ఎందుకు కలిసి బ్రతుకుతున్నామో జీవితాంతం ఆలోచించినా అర్థం కాకపోవచ్చు.

"నేను ఫలానా వ్యక్తికి ఉపయోగపడుతున్నాను... ఫలానా వ్యక్తి వల్ల నాకెలాంటి ఉపయోగం లేదు" అనే ఆలోచనలు కొందరిలో పుడుతుంటాయి. :) ఆ మాటకే వస్తే ఎవరికీ ఉపయోగపడని జీవితం ఎందుకు? సాటి మనిషికి అవసరంలో ఉపయోగపడడానికి మించిన తృప్తి ఏముంటుంది?

ఓ చిన్న సాయం చేసినంత మాత్రాన, కొంత ఆత్మీయంగా ఉన్నంత మాత్రాన ఆ మనుషులపై అంచనాలు పెంచుకుని వారు ప్రతీదీ మనకు అనుగుణంగా ప్రవర్తించాలని కోరుకోవడం సరైనది కాదు.

ఓ కేంద్రక స్థానంలో కూర్చుని.. నా చుట్టూ ఉన్న మనుషుల్నినా జ్ఞానేంద్రియాలతో స్పృశించ ప్రయత్నిస్తే ఎవరి నుండీ ఎటువంటి ఎక్కుపెట్టబడిన విల్లులూ నా వైపు సంధించబడి లేకపోతే నన్ను నేను స్వేచ్ఛాజీవిగా భావిస్తాను నేను! అప్పుడే ఆ మనుషులందరితోనూ నా అనుబంధం సంతోషంగా కొనసాగుతుంది. నాకే కాదు మనందరికీ వర్తించే సూత్రమిదే! మన హృదయాలు ప్రేమతో వశం చేసుకోబడి ఉండాలి కానీ ద్వేషంతో ఛిధ్రం చేయబడడం కోసం విల్లులు ఎక్కుబెట్టబడి ఉంటే దానికి మించిన నరకం ఏముంటుంది?