మనషులందరూ సుఖం కోసం నిరంతరం ప్రయత్నిస్తారు, కానీ ఆ ప్రయత్నంలోనే చిక్కుల్లో పడతారు...
ప్రతి ఒక్కరూ స్వతంత్రం కోసం తహతహ లాడతారు; కానీ బంధాల్లో ఇరుక్కుంటారు....
పేరు ప్రతిష్టల కోసం పోటీ పడతారు; కానీ అకస్మాత్తుగా వారికీ అవమానం ఎదురవుతుంది...
మరణం నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు; కానీ మృత్యు భయం తొలగిపోదు...
పుట్టిన ఉత్తరక్షణం నుండీ చివరి ఘడియ వరకూ మనిషి జీవిత ప్రవాహంలో ....
సుఖదుఃఖాలు, ఆశనిరాశలు, రాగద్వేషాలు, గెలుపు ఓటములవంటి అలలతో పోరు సలుపుతునే ఉంటాడు...
ఒక్కోమారు సాలేటి గూటిలో చిక్కున్న ఈగలాగ నిస్సహాయ పడతాడు...
ఈ విరుద్ధ తత్త్వాల ఒత్తిడి నుంచి పల్లెటూరి రైతు కానీ, రాజధానిలో నివసించే రాజకీయవేత్త కానీ,
రాజమహలులో నివసించే అతి ధనవంతుడు కానీ, గుడిసెలో నివసించే నిరుపేద కానీ,
గుహలలో నివసించే అనాగరికులు కానీ, ఎవ్వరు తప్పించుకోలేరు...
జీవితమంటే ఇంతేనా...? అలా అయితే తన స్థితిలో ఎందుకు రాజీపడలేకపోతున్నాడు..?
ఆ పరిధిలో ఎందుకు సంతృప్తిగా ఉండలేక పోతున్నాడు..? వాటిని అధిగమించాలనే
తీవ్ర తపన ఎందుకు..? ఈ అవరోధలనుండి తప్పించుకోవాలనే నిరంతర ప్రయత్నమెందుకు...?
కలంకులు ఉత్తములలాగా కనపడాలని ప్రయత్నిస్తారెండుకని...?
మనిషి నిజంగా నసించేవాడు కాదు.., స్వేచ్చారహితుడు కాదు.., కలంకుడు కాదు..,
గాడమైన అజ్ఞానం వలన తను నశించేవాడినని, స్వేచ్చలేనివాడినని, కలంకుడననీ
అనుకుంటాడు...
తన అజ్ఞానాన్ని విడిచిపెట్టనిదే ఈ సత్యాన్ని గ్రహించలేదు...
తన నిజస్వభావమైన ఈ వాస్తవికతను గుర్తించేవరకూ ఈ పెనుగులాట తప్పదు....