గత కాల గమనంలోని
నీ తీపి గురుతులు
మరువలేను మరిచిపోను
ఆ తీయని భాదగా మిగిలి పోయింది
దూరతీరాలు దాటి
కలుసుకోవాలని ఆశ
తెలుసు ఇది దురాశేనని
ఏం చెయ్యను నీ ఆ జ్ఞాపకాలు
నీడలా నా వెంటే
నడిచి వస్తున్నాయ్
నిలువనీయకున్నాయ్
చెలీ నీవైనా దరిచేరవా...
తుఫానుకెరటాల్లా మనసును అల్ల కళ్ళోలం చేస్తున్నాయి..
మనసును మనసులో లేకుండాచేస్తున్నాయి నీ జ్ఞాపకాలు..
వద్దనుకున్నా వాస్తవాలు గుండెల్లొ మంటలు రేపుతున్నాయి..
నన్ను నేను మర్చిపొయాను..ఈ వేదన భరించలేను..
బయట వాతావరణ చల్లాగా ఉన్నా గుండెళ్ళో మంటలు..
ప్రతి క్షనం ప్రతి నిమిషం నేనేంటో గుర్తు చేస్తున్నాయి..
నాకు మనుష్యుల మద్యి ఉండాలని లేదు..
చుట్టూ ఎందరో ఉన్నా ఎందుకో ఒంటరిని అనిపిస్తోంది..
అందరికి దూరంగా పిలిచినా వినిపించనంత దూరంగా వెలుతున్నా..
మనసులో పడ్డ గాయం అపని చేస్తోంది..
ప్రతిక్షనం ఎవరు నీవంటూ ప్రశ్నిస్తున్న ఘటనలు..
నాకు నేను తెల్సుకునే ప్రయత్నంలో ఓడిపోయాను..
నలుదిక్కుల ఎటుచూచిన గెలిచేఅవకాశం లేదు
గెలవాలన్న ఆశ చచ్చిపోయింది..అందుకే వెలుతున్నా..
నేను నేను గా ఎన్నో సార్లు ఓడిపోయాను ఓడిపోతూనే ఉన్నాను..
పెద్దగా దిక్కులు పిక్కటిల్లేలా అరవాలని ఉంది..
ఏదో చెప్పాలని ఉంది..నిజాలు తెలపాలని ఉంది
పెద్దగా అరుస్తున్నా ..ఏదో చెబుతున్నా కాని..
ఎవ్వరూ వినటంలేదు..వినాలని అనుకోవడం లేదు..
చుట్టూ చూస్తే ఎవ్వరూ కానరావడం లేదు ఒంటరిగా ఉన్నా..
నేను పెద్దగా అరుస్తూ నిజాలు చెప్పాలని చూస్తున్నా..
గుండేల్లో భావాలు బయటకు వస్తున్నాయి కాని
అవి పెదాలు దాటటంలేదెందుకో ..కారణం తెలీదు..
నేనే చెబుతున్నది నాకే వినిపించడం లేదు ఎందుకో తెలీదు..
ఒక్కటి మాత్రం తెలుస్తోంది ..నీ విషయంలో ఓడిపోయాను అని..
జీవితంలో గెలవలేనంత గా ఓడిపోయాను అని నిజమేకదా..?..
అందుకే ఎవ్వరికీ అందనంత దూరంగా ..వెళ్ళిపోతున్నా.
అది ఎంత దూరమో తెల్సాతిరిగి వద్దామనుకున్నా రాలేనంత..
ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తుకుంటున్నా..వెలుతున్నా అతి త్వరలో..
దీనంగా మనసు భారంగా ..వేదనగా వెల్తున్నా ప్రియా.అతి త్వరలో..