నీ జ్ఞాపకాల దారిలో....ఎండుటాకును నేను....
ప్రేమంటే ఎప్పటికీ తీరని భాదేనేమో....
తనలోని మనకై శోధన అది కనలేని నాడు వేదన...ఆవేదన....
అది అంతులేనిది,
అంతంకానిది...
మన కన్నీరే మనల్ని ముంచే ధు:ఖసంద్రం అయితే
అది ఖచ్చితంగా ప్రేమే అవుతుంది...
లోకాన మనకై ఎందరు ఉన్నా తను లేని మనం ఏకాకులమే...
తను ఉండి లోకాన ఏది లేకున్నా...జగమంత కుటుంబం మనది.
నా కన్నీటికి కారణం నువ్వే? అంటే... ప్రేమ నవ్వుతుంది.
"ఎవరిమ్మన్నారు నీ మదిలో నాకు స్థానం.
నన్ను బయటకు తోసేసి నీ కన్నీటిని తుడిచేసుకో" అంటోంది ఎంతో నింపాదిగా...
నా ప్రేమ అంతే...ఎలా...తొలిగించగలను నా.. మది నుండి...
ప్రేమించటం సులువే కాని మరుపే చాలా కష్టం.
నువ్వు ఎదురుగా ఉంటె నీ నుండి తప్పించుకు పారిపోగలను.
నా మన్నస్సులో ఉన్నావే నేను ఎలా వెళ్ళగలను?
ఎక్కడికని వెళ్ళను??