వీడు మారడు..మళ్ళీ కొత్త పన్నాగం పన్నుతున్నాడు..?
నమ్మిన మనిషిని అనుమానించి .. తనను అనలేక ఎదుటి వాడి జీవితంతో ఆడుకున్నాడు
మళ్ళీ ఎక్కడ అనుమానం వచ్చిందో ఏమో మరో సారి అదే టైప్ లో డ్రామా మొదలు పెట్టాడు
పైకి మేధావిలా ఉంటూనే ఎదుటి వాన్ని ఎలా నాశనం చేయాలని చూసే ప్రబుద్దుడు..?
వాడి స్వార్దం కోసం ఎదుటి వాడు ఎమైనా సరే.. నాటకాలు మొదలు పెడతాడు..
పాపం కదాని వాడు చెప్పింది నమ్మామో అంతే..మనకు తెలియకండా మనచేత్తోనే కంట్లో పొడుచుకునేలా చేస్తాడు.
అప్పుడలా మోసం చేసి ..జీవితం నాశం అయ్యేలా చేసాడు... మళ్ళీ మరో నాటకానికి తెరతీస్తూ
కొత్త డ్రామా మొదలు పెట్టాడు..మనిషిని ఒక్కసారే నమ్ముతారని తెలీదు పాపం వాడికి
ఇంకా ఏ రేంజిలో జీవితం నాశనం అయ్యేలా చేస్తాడో ఏమో ..వాడి కళ్ళు చల్లబడాలంటే..?
మరోసారీ జీవితం బుగ్గిపాలు అయ్యేదాకా వదిలేలా లేడు ... వీడే మనిషిరా బాబు..?
నమ్మిన మనిషిపై అనుమానంతో..ఎదుటి వాని జీవితంపై పడి ఏడుస్తాడు..?
అంత నమ్మకం లేనప్పుడు ఆ మనిషిజీవితం నుండి దూరంగా పోవచ్చుగా..?
ఇన్ని డ్రామాలు... ఇన్ని ఏడుపులు .. అవసరమా.. ఏదోరోజు ఎదురు దెబ్బ తగులుతుంది
జీవితం విలువ తెలుస్తుంది..ఎదుటి వాని జీవితం తో నీకెందుకురా బాబు..?
ఎదుటి వానిజీవితం ఎలా నాశనం అయ్యేలా చూశావో అదేరేంజ్ లో నీవు త్వరలో అనుభవిస్తావు..?
ఇప్పటికైనా ఇలాంటి డ్రామాలు మానుకో లేదంటే .. సర్వనాశనం అవుతావు..