నేనో అద్బుతాన్ని సృష్టించాలనుకున్నాను ................
నేనో అందమైన గులాబీని సృష్టించాను ....................
కానీ ఇంతలో ఓ ముల్లు గులాబినీ ప్రేమించింది
గులాబీ రేకుల్ని తడిపిన మంచుబిందువులతో తన దాహార్తిని తీర్చుకునేన్తగా .........
ఆ పుష్పం వదిలే ప్రతి నిశ్వాస ను తన శ్వాస గా మార్చుకునేన్తగా .................
నేను తనకి ఆత్మ గౌరవ సిద్ధాంతాలు చెప్పి చూసాను ................
ప్రకృతి నియమాల గురించి సుదీర్ఘోపన్యాసం ఇచ్చి చూసాను .............
అయినా మట్టి బుర్రకి మానవతా విలువలు తలకేక్కితేగా .
తనకి తెలుసు తుమ్మెదల ఝుంకారాన్ని ప్రేమించే సుమం తనను ప్రేమించదని..............
తనకి తెలుసు కుసుమ సాన్నిహిత్యం తప్ప తన జీవితానికి వేరే అర్ధం లేదని ...................
చివరికి నేను వరమివ్వక తప్పలేదు ......గులాబీ మొక్కకా ముల్లు తప్పలేదు