ఓ చెలియా...!
కలనైనా చూద్దామని కనులు మూస్తే,
నీటి సుడుల మాటు నీరూపం కరిగిపోయింది,
జ్ఞాపకాల సుడిగుండం నను ముంచివేస్తుంది,
నా హ్రుదయం లయ తప్పుతున్నట్టుగా వుంది,
నా చెక్కిలి చెమ్మగిల్లుతోంది,
ఇంతలోనే..... ఎదో స్పర్శ,
నా చెక్కిలిని తడుముతూ..
నను ఓదార్చుతున్నట్టుగా వుంది,
అది నీవే కదా!