. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, May 31, 2012

నా ప్రాణం పోయేలోపు చూడాలని ఉంది ....నీవొస్తావని ఆశ చచ్చిపోతోంది రోజు రోజుకి..ఎదురు చూస్తున్నా

అవును నేనే !!
నువ్వెప్పుడు వస్తావా అని "విరహం" అనే మరణ శయ్య పై
తగలబడుతున్న శవంలా ఎదురు చూస్తున్నా నీకోసం
ఎదురుచూస్తున్నది ...నేనే...ఎందుకంటే ఆశచావక
క్షణాలని కాపలాగా పెట్టి
నీ రాక కోసం అందరినీ అడిగి ,అడిగి
నోరెండిపోయిన ప్రేమ నది ని నేనే మరి
ఏం చేయను...
నీవు నన్ను విడచిపోయావు...వస్తావో..రావో తెలీదు
మూడు కాలాలు,ఆరు ఋతువులు ,చివరగా
లక్ష నిస్పృహలు గా అనిపిస్తోంది ....

ఎందుకు? ఎందుకు నీ కింత నిర్దయ నా మీద ...
జ్ఞాపకాలని ఇచ్చి మనసు తీసుకు పోయావ్
రాలేవా ......... ఒక్కసారి నా కోసం
అలిసిపోయిన ఆకాశం లాంటి నాకు
అరవిరిసిన నిండు పున్నమివై
నీతో మాట్లాడకుండా మూగపోయిన నా నోటికి
నీ నామావధానం చేసే ప్రేమ పలుకు వై !!
చివరగా..నా ప్రాణం పోయేలోపు చూడాలని ఉంది
నన్ను బ్రతికించ డానికి కావల్సింది ప్రాణ వాయువు కాదు .
నీ ప్రేమ వాయువు !!!
ఇట్లు...........
నీ కోసం ఎదురు చూసే
ప్రేమ జ్ఞాపకాలని ముద్రించుకున్న నీ మనసు జ్ఞాపికను..
నీవొస్తావని ఆశ చచ్చిపోతోంది రోజు రోజుకి..ఎదురు చూస్తున్నా
నీకు ఆఖరి చూపులు కూడా దక్కవు మరి...అయినా...?

నా శ్వాసకు అందటం లేదేమీ...కొంపదీసి నా శ్వాసగానీ... ఆగిపోయిందా!

పిల్లగాలికి పులకరించే నా శరీరం..
మొద్దుబారిపొయిందేమో!
లేక.. పిల్లగాలి నను వెలివేసిందా!

మైమరపించేటి ఆ పూతోటల పరిమళాలు
నా శ్వాసకు అందటం లేదేమీ!
కొంపదీసి నా శ్వాసగానీ... ఆగిపోయిందా!

ఇంకా లేదే!
నీప్రేమై వెర్రికేకలు పెడ్దుతున్న నా హ్రుదయనాదం ఇంకా నాకు వినిపిస్తుంది కదా!
అవిగో, నీటిపొరలు నాకు ఇంకా కనిపిస్తూనే వున్నాయికదా!
నీ చేతి స్పర్శకై నా శరీరం ఇంకా తపిస్తూనే వుంది కదా!
ఆ శ్వాస కూడా.. తెరలు తెరలుగా.. పరిగెడుతుంది కదా

కళ్లెదుట ఓ దృశ్యం కన్పించినప్పుడు.. మన కళ్లు ఆ దృశ్యంలోని కొద్ది ప్రదేశం మీదకే ఫోకస్ అవుతాయి.

కళ్లెదుట ఓ దృశ్యం కన్పించినప్పుడు.. మన కళ్లు ఆ దృశ్యంలోని కొద్ది ప్రదేశం మీదకే ఫోకస్ అవుతాయి. మిగతా ప్రదేశం కళ్ల ముందున్నా out focus అవుతుంది.

మాటలూ అంతే.. మన చుట్టూ రణగొణ ధ్వనులు విన్పిస్తున్నా మన చెవులు ఎక్కడో తమకు కావలసిన శబ్ధాల ఫ్రీక్వెన్సీలోనే tune అయి వింటుంటాయి.

ఆలోచనలూ అంతే... మనుషుల్ని, సమాజాన్నీ, పరిస్థితుల్నీ చూస్తున్నప్పుడు ప్రవాహంలా ఆలోచనలు వచ్చి పోతూ ఉన్నా.. ఓ విధమైన ఆలోచనలే ఆయా సందర్భాల్లో మనస్సుని ఎక్కువ ఆక్రమించేస్తాయి.

మన జ్ఞానేంద్రియాలన్నీ వివిధ విషయాల్ని స్వీకరించే విధానం చాలా మిస్టీరియస్ గా ఉంటుంది.

ఒక క్షణాన్నే ప్రాతిపదికగా తీసుకుంటే ఆ క్షణకాలంలో దృష్టి ద్వారా, శబ్ధం ద్వారా, ఆలోచనల ద్వారా మనలో ఏది ఆవహించాలన్నది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది.

ఒక దృశ్యం మనల్ని మనకు తెలియకుండానే ఆకర్షించవచ్చు... ఉన్న ఫళాన కనులు దాన్ని మనస్సులోకి ముద్రించుకోవడానికి ప్రయత్నించనూ వచ్చు. ఆ దృశ్యం మనల్ని ఎందుకు ఆకర్షించిందో లాజిక్ కి అందదు.. గతంలో చూసినవీ, విన్నవీ, ఆలోచనల గ్రహింపులో ఉన్నవి ఆ దృశ్యాన్ని చూడడానికి మనల్ని ప్రేరేపించవచ్చు.

అలాగే శబ్ధమూ అంతే.. ఓ మ్యూజిక్ చాలా బాగా నచ్చుతుంది... తెలీకుండానే ఓ పాటని బాగా ఆస్వాదిస్తూ ఉంటాం. అందులో tune ఏదో గతంలో మనకు బాగా పరిచయమై, బాగా విని ఉండొచ్చు, అది మెదడులో ఎక్కడో జాగ్రత్తగా భద్రపడి.. అదే రకమైన tune మళ్లీ విన్పించేసరికి.. మళ్లీ మళ్లీ వినాలన్న కోరిక ప్రేరేపితం కావచ్చు.

ఒక క్షణ కాలంలో focus అయిన విషయాలే కాదు.. మన దృష్టిలో out focus అయిన విషయాలూ నిశ్శబ్ధంగా మెదడులో అంతగా ప్రాధాన్యత లేని అంశాలుగా చేరిపోతాయి కూడా! అవి ఎంత ప్రధానమైనవి అన్నది ఆ క్షణం మన అనుభూతి, అవసరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.

ఉదా.కు.. ఈ టాపిక్ పై రాయాలని నాకు ఈవెనింగ్ షటిల్ ఆడేటప్పుడు థాట్ వచ్చింది. అలా వచ్చిన థాట్ ని నేను ప్రయారిటైజ్ చేసుకున్నాను. "ఇలా రాయడం అనే పని పూర్తయిన తర్వాత గానీ fulfill అవ్వదు" అన్నంత ముఖ్యమైనదిగా నేను దాన్ని భావించాను కాబట్టే కళ్లెదుట షటిల్ కాక్ ని షాట్ కొడుతూ దాన్ని focusలోకి తీసుకుని కూడా నాకు తెలియకుండానే ఆ క్షణానికి out focus క్రింద మనస్సులో ఏర్పడిన ఇలా రాయాలన్న ఆలోచననీ ప్రయారిటైజ్ చేయగలిగాను.

అంటే మనం అనేక పనులు చేస్తూనే ఉంటాం.. మన దృష్టి ప్రధానంగా ఒకదానిపై ఫోకస్ అవుతుంది. లోపల మాత్రం ఇతర విషయాలపై అంచనాలు, ఆలోచనలు, ప్రణాళికలు వాటంతట అవి కామ్ గా నిర్మితం అయిపోతూనే ఉంటాయి.

ఇలా మన జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తాయో స్పష్టంగా అర్థం చేసుకుంటే.. వంద పనుల్లోనూ విసుక్కునే గందరగోళం మాయమవుతుంది. రణగొణ ధ్వనుల్లోనూ ఆహ్లాదంగా ఉండగలం.

Wednesday, May 30, 2012

ఈ నిజాన్ని ఎప్పటికి నమ్ముతావో కదా..? ఆ అవకాశం లేదు..కదా..?

ప్రేమను నమ్మకండి అది చాలా డేంజర్

ప్రేమను నమ్మకండి అది చాలా డేంజర్
ప్రేమ రెస్పెక్ట్ అంటారు ఆతరువాత ఎవరో ఏమో చెబుతారు
అంతే మనుషుల మనసులు మారతాయి..షడన్ గా
నేనలా అనలేదే ఇష్టం అంటే ప్రేమా అంటారు
ఒక్కప్పుడు చిన్న విషయానికి బాదపడతాడని కంగారు పడ్డ మనిషి
నీవు బ్రతికి ఉంటే నాకేంటి చస్తే నాకేంటి అని కూడా అంటారు ..సో
ఎవరు చెప్పినా నమ్మడం..ఇదేనా ప్రేమంటే ఇష్టం అంటే..?
సో బీ కేర్ ఫుల్ లవ్ అండ్ లైక్

Sunday, May 27, 2012

మరణిస్తున్న నా మనసుకు నీ కలలే జీవితం !!

నీ తలపుల వాకిట కునుకు తీసా!
నీ వలపు తలపులు వెలుగు చూస్తాయనే ఆశతో!

కలల ఒడిలో సరికొత్తగా అనిపించావ్!
వెచ్చనైన నెచ్చెలిగా,
స్వచ్చమైన చిరునవ్వుతో,
మల్లెలాంటి మనసుతో,
గులాబితనపు సోయగాలతో......
కలలే కొత్తగా అనిపించాయ్ నీ రాకతో
కలలే కలకాలమైతే బాగుండనిపించేంతగా

అంతలోనే నిదురలేచా
ఊరంతా వెతికిచూసా
కానరాలేదు నీవు
కనుమరుగైన కలలాగే

నిరాశతో గృహము చేరా
నిలచివున్నది నీ రూపం
చిరునవ్వులొలుకుతు చిత్రపటంలో
నా రాకకై ఎదురుచూస్తూ

గత స్మృతుల ఒడిలో కాసేపు సేద తీరా,
ఆస్వాదించా నీ ప్రేమ మాధుర్యాన్ని!
ఆమోదిస్తున్నా కలల సౌందర్యాన్ని,
కలలోని నిన్ను తరచిచూస్తూ !!

గతించిన కాలం గుండె నలిపేస్తున్నా,
నీవు లేని ప్రతిక్షణం ఓ పిడిబాకవుతున్నా,
లక్ష్య సాధన కోసం వడివడిగా అడుగులేస్తూ,
చిరునవ్వుతో శాశ్వత నిదురకోసం వేచి చూస్తున్నా!

కలతనొందిన కనులకు ఈ కలలే స్వాంతన !
మరణిస్తున్న నా మనసుకు నీ కలలే జీవితం !!

Saturday, May 26, 2012

మరువలేని జ్ఞాపకంగా నా గుండెల్లో పదిలంగా ఉన్నావు

నేస్తామా !
నేను నిదురించేవేల చిరుగాలిల వస్తావు,
నా పెదవులపై చెదరని చిరునవ్వులా వేలిగావు,
ఒంటరి క్షణాన నా తోడై ఉన్నావు,
కరగని కలగా నా కన్నులలో మిగిలావు,
ప్రతిక్షణం నా ఆలోచనలలో నిలిచిచావు,
స్నేహం ఎ౦త గొప్పదో తెలిసేలా చేసావు,
కాని ఇపుడేమైనదో .............
నన్ను విడిచి దూరంగా వెళ్ళవు....

I MISS YOU.. ..

నీవు దూరమైనా
మరువలేని జ్ఞాపకంగా నా గుండెల్లో పదిలంగా ఉన్నావు...!

నాలో తడసి ముద్దయిపోయిన ఈ ఆలోచనా తరంగాలను ఆపలేక

మది ఆరాటపడుతోంది ....
ముత్యాల వాన జల్లులకోసం ఎదురుచూసే ధాత్రిలా
నీరాకకై శూన్యంలోకి చూస్తూ కుర్చునాను
నా మది పావురంలా రెక్కలుసాచి
ఆ పచ్చటి నేలలను నీలిమబ్బులను దాటి
అనంతమైన ఈ ప్రేమతాలూకు
సూన్యంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది
నాలో తడసి ముద్దయిపోయిన ఈ ఆలోచనా తరంగాలను ఆపలేక
చీకటిదారులలో మగ్గిపోతున్న ఈ ఒంటరి నావని చూసి
అనంతమైన ఆ నీలిసంద్రం గర్జిస్తూ
పువ్వులా పట్టి పీల్చేస్తున్న
సీతాకోకచిలుకలాంటి నా ఆలోచల్ని పరిహసిస్తూ
తన గర్భాని చీల్చుకుని చొచ్చుకు వచ్చిన జలతరంగాలతో
పద్మవ్యుహాని పన్ని నన్ను తన గర్భంలోకి తీసుకుపోతోంది
నా చుటూ వ్యాపించిన ఈ జలనిశీధిలో అంతర్దానమౌతున్న నాకు
నీ స్మృతుల తరంగగోష తప్ప మరొకటి వినిపించుటలేదు
అనంతమైన ఆ సముద్రగర్భంలోకి చొచ్చుకుపోతున్నా ...
నీ జ్ఞాపకాలతో తడసి పులకించాలని మది ఆరాటపడుతోంది ....

ఒరేయి బ్లాక్ మైలర్...నాకు నీవు అడ్డంగా దొరికిపోయావు..?


ఒరేయి బ్లాక్ మైలర్...నాకు నీవు అడ్డంగా దొరికిపోయావు..?..
ఎందుకో నీ పద్దతి మీద అనుమానం వచ్చింది..నీ మీద నిఘా పెట్టా..
ఇంకేముంది నీ అసలు బండారం ఒక్కోటీ బైట పడింది..నీ అసలు రంగు తెల్సింది..
నా సీక్రెట్ కెమేరాకు అడ్డంగా దొరికి పోయావు..
అవసరం అనుకున్నప్పుడు నిన్ను నీ అసలు రంగును ప్రపంచానికి చూపిస్తా..
నీవు చేసేది చిన్న జాబ్.. అమ్మాయిలకునేను పెద్ద పోష్టులో ఉన్నా అని చెప్పి మోసం చేస్తావా చెబుతావా..?
హైదరాబాద్ వస్తే నీవు ఉద్యోగం ఇప్పిస్తావా అమ్మాయిలకు..అన్నీ నీవే చూసుకుంటావా..?
అమ్మాయి నుంచి ఫోన్ వస్తే చాలు...గొప్పోడిలా ఫీలింగ్..ఇచ్చి మాయ చేయాలని చూస్తావా..?
నీ అసలు రంగు నాకు తెల్సి పోయింది...ఎప్పుడో ఒకప్పుడు ప్రపంచానికి.. నీ అసలు రంగు చూపిస్తా,,?
ఎవర్ని ఎలా బ్లాక్ మైల్ చేసింది నాదగ్గర రికార్డెడ్ గా ఉంది...నీ నక్క వినయాలతో సహా..?

Thursday, May 24, 2012

నచ్చిన మనిషిని పొందాలంటే నాటకాలాడాలా...?

నచ్చిన మనిషిని పొందాలంటే నాటకాలాడాలా...?
మన జీవితమే ఓ నాటకరంగ అని విన్నా..కాని..జీవించడానికి నటించే వాళ్లని చూసా..కాని ప్రేమ, స్నేహం అనే రెండు అద్బుతమైన పదాలు జీవితంలో కోన్ని సార్లే మనల్ని పలుకరిస్తాయి..ఆలాంటి అద్బుతమైన పదాల విషయంలో కూడా నటించాలా..అలా నటిస్తేనే నమ్ముతారా..ఓమనిషి మరో మనిషిని గురించి చెబుతున్నాడంటే ఆమనిషి చెబుతున్న దానిలో ఎంత నిజం ఉందో మాటాల్లోనే అర్దం అవుతుంది....ఓమనిషి అందుకే నచ్చుతారండీ ...అర్దంచేసుకుంటారండీ అన్న మాటల వెనుక ..ఎంత త్యాగం ఉందో ఎందుకు అర్దంకాదు ..నీకు నచ్చడానికి తన మనసును చంపుకొని నీసతోషం కోసం..నీవు హేపీగా ఉండటకోసం ఏమైనా చేయడానికి సిద్దపడ్డాడని ఎందుకు గుర్తించలేకపోయావో తెలీదు......సిద్దపడ్డాడని ఎందుకు గుర్తించలేకపోయావో తెలీదు..ఆ త్యాగాన్ని ఎందుకు గుర్తించవు..నీవు జీతంలో ఎన్నో వడిదుడుకులు చూశావు..నిజం ఏంటో అబద్దం ఏంటో తెల్సుకాని ఈ చిన్న నిజాన్ని ఎందుకు గుర్తించలేకపోయావు..నీ మససాక్షినడుగు నేనేంటొ తెలుస్తుంది..కాని నీవప్రయత్నం చేయలేదుకాబట్టే ..మనం ఇలాఉన్నాం..జీవితంలో నామనస్సును అర్దంచేసుకుంది నీ ఒక్కదానివే అనుకున్నా కాని అందరిలాగే ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావో తెలీదు.నన్ను ఓ ప్రత్యేక మైన ఫ్ర్రెండ్ అన్నావు అది నిజంకాదా నేను అస్సలు మారలేదు ఎన్నో జరిగాయి జరుగుతున్నాయి నీకోసం ఏంకోల్పోయానో కోల్పోతున్నానో తెల్సు కాని అసలు నిజాన్ని గుర్తిస్తావని ఎదురు చూసా..

అయినా ఓ మనిషి ఎదుటి మనిషి గురించి ఎందుకు చెడుగా చెబుతాడో గుర్తించవా నీవు..తను గొప్ప అని చెప్పేక్రమంలో ఎదుటివాని తప్పులు చూపే ప్రయత్నం చేస్తారు తను గొప్ప అని చెప్పుకోవాలంటే ఎదుటివాని మంచితనాన్ని పొగిడితే తాను ఎక్కడ తక్కవ అవుతానో అని చుస్తారు..నాకు అలా చెప్పడం అలవాటులేదు లేదంటే నీవిలా నాకు దూరం అయ్యేదానివి కాదు..నేనింతే ఎదుటి వాని నమ్మంకమీద..పర్నశాలకట్టుకొని హేపీగా ఉండాలని చూడను..నీవు అందరూ నాగురించి చెప్పేవి ఎందుకు నమ్ముతున్నావో తెలీదు నేనేంటో తెల్సికూడా ...ఎదుటివాడు నాగురించి చెబుతున్నాడు అంటే వాడేం ఆసిసున్నాడో ఆమాటల వెనుక నిజాన్ని ఎందుకు తెల్సుకునే ప్రయత్న చెయ్యవు... ఆ మాటల వెనుక అసలు నిజాన్ని ఎందుకు తెల్సుకునే ప్రయత్న చెయ్యవు..ఎవ్వరైనా ఎదుటి మనిషిగురించి నెగిటివ్ గా చెబుతున్నప్పుడు వాళ్ళ ఫేస్ చూడు తప్పు చేసిన భావన కనిపిస్తుంది..నీవు ఎవ్వరిగురించి అయినా నెటివ్ గా చెబుతున్నప్పుడు ...ఎందుకలా అతని గురించి నెగిటివ్ గా చెబుతావు నీకేంటి లాబం అని అడుగు అంతే మాటలు తడబడతాయి నేను ఎప్పుడూ అలా చెప్పే ప్రయత్న చేయలేదు చెప్పను కొందరు కావాలని చేస్తున పనులను నన్ను బలి చేస్తున్నారు నీవు నమ్ముతున్నావు ..ఒకప్పుడు ఎవ్వరు నాగురించె ఏంచెప్పినా నమ్మవు అని నమంకం కాని ఇప్పుడు లేదు ఎవరెవరు ఏం చెప్పారో నాకు తెల్సు కాని నమ్మావు కదా ఇంకా నమ్ముతూనే ఉన్నావు కాని నీవిలా అందరూ చెప్పినవి..నన్ను నమ్మనప్పుడు నీ నమ్మకాన్ని కూడా నేను తప్పు పట్టను అది నీ ఇష్టం .నన్నెందుకు అర్దం చేసుకోలేదా అని భాద పడతాను అని కూడా నీకు తెల్సు..నీనమ్మకం నీ ఇష్టం ఎవ్వడి స్వార్ద కోసం వాళ్ళు నాటకాలు ఆడతారు కాని నేను కొన్ని విషయాలు చూసి నాకు నాకే అర్దంకావడంలేదు ..ఎందుకిలా నటిస్తారో అని

ఆ కళ్ళే నన్ను మోసం చేస్తాయని కలలో కూడా నమ్మలేదు


నీ కళ్ళలో అనేక భావాలు పలికించగలవు..అందుకే ఆకళ్ళంటే ఇష్టం
నీ చూపుల్లో అమాయకత్వం... ఆరాదన..నమ్మకం కనిపించేది
ఆ అందమైనకళ్ళు అబద్దాలు చెప్పవని చెప్పే దైర్యం లేదని నానమ్మకం
కల్సిన కనిపించిన ప్రతిసారి ఆకళ్ళలో అనేక భావాలు వెతికే వాడిని
ఆ కళ్ళ వెనుక కళ్ళా కపటం లేని నిజాయితీ కనిపించేది నాకు ఎప్పుడూ
ఆప్యాయత అనురాగం ఎంతో ప్రేమతో చూసేవాకళ్ళు...కాని
ఆ కళ్ళే నన్ను మోసం చేస్తాయని కలలో కూడా నమ్మలేదు
ఆకళ్ళే నన్ను అనరాని మాటలు అంటావని అస్సలు ఊహించలేదు
అప్పుడు ఆమనిషి అలా ఇప్పుడు ఇలా ..అంటే రోజులు మారితే కళ్ళలో నిజాయితీ మారుద్దా...?
నేనేంటో తెల్సి కూడా నీవు ఎలా నన్ను అనగలిగావో తెలీదు..
ఆకళ్ళు మోసం చేసాయి అంటే ఇప్పుడు నమ్మ బుద్ది కావడం లేదు..
మరొకరి వంచనచేరి ఆ అందమైన కళ్ళూ నన్ను వెక్కిరిస్తాయని ఊహించలేదు..
మరికరి వంచనచేరి అనకూడని వినకూడని మాటలు అంటాయని నమ్మలేకున్నా
ఆకళ్ళో అప్పుడు చూసిన నిజాయితీ పారిపోయింది.. ఆనిజాయితి లెదిప్పుడు అంటా స్వార్దం
అప్పుడు నీవంటే ఓ దైర్యం కాని ఇప్పుడు నీవు మోసం చేసిన ఘటనే గుర్తుకొస్తుంది
ఎవడో వేష్టుగాడు పనికిరానివాడు..పద్దతి తెలియని వాడు చెబితే నమ్మావు
వాడికి బందాలు బాందవ్యాల విలువ తెలీదు..
తనస్వార్దంకోసం ఎలాగైనా ఎవ్వరి జీవితం నాశనం చేయగలడు..
తనస్వార్దం కోసం ఆడపిల్లలా ఏడుస్తాడు..ఎన్ని జీవితాలు నాశనం అయినా అనుకున్నది సాదిస్తాడు..
మనసుకు నచ్చిన మనిషిని అంతలా ఎలా భాదపెడటాడో నాకు ఇప్పటికీ అర్దంకాదు
నన్నోడిస్తుంటే ఆనందా చూస్తూ ఆకళ్ళు నా నిజాయితీని ఎలా శంకించాయో నన్నెలా మోసం చేశాయో కదా..?

స్నేహమా.... ? చెలగాటమా...... ?..మోసం చేసావు ..?

తల వంచాను ఓడిపోయాను.. నీవిషయంలో..?
ఒకప్పుడు నేనంటే నమ్మకం ఇష్టం ఇప్పుడు చిరాకు కాలం ఇంతగా మారుస్తుందా..?
నిజం నిప్పు అంటారు కాని మనవిషయం లో బూడిద అయిందేమిటి..?
ఇప్పుడు తలవంచాను గెలవలేను అని తెల్సు కొని.. ఓడిపోయానుకదా..?
గెలవాలని ఉన్నా నీకు నన్ను ఓడించడమే ఇష్టం..కదా..?
ఇద్దరిలో ఒకరిని పక్కన పెట్టిన నాడే... నా విలువ తెల్సుకోలేకపోయా...

ఎందుకు చెంతకు వస్తావో...?
ఎందుకు చేయి వదిలేస్తావో.... ?
స్నేహమా.... ? చెలగాటమా...... ?
ఎప్పుడెలా నీ ముడి వేస్తావో..... ?.
ఎప్పుడెలా విడదీస్తావో... ?.
ప్రణయమా ... ? పరిహాసమా... ?
కన్పించావు..... కవ్వించావు .
మురిపించావు... మైమరిపించావు .
వెళ్లిపోయావు సరే...... ?
నీతో తీసుకెళ్లిన నా మనసు మాటేమిటి...... ?

కనిపిస్తావేమో అని చూస్తున్నా...ఇక నేను నీకు ఎప్పటికీ కనిపీంచను..
ఇలాంటి విషయం తెల్సిస్తే ఇంకొకరైతే భాదపడతారు కాను నీవు .?
నేను గుర్తు ఉన్నానా.. నాజ్ఞాపకం ఒక్కటైనా నీకు గుర్తుకుందా..?
అయినా నా పిచ్చిగాని నన్ను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం నీకేంటి..

Tuesday, May 22, 2012

నీవు దారుణంగా మోసం చేసావు .....?

చిలక పలుకుల:2

చిరునవ్వు విలువెంతో

అందుకొన్న అతిధినడుగు

సూటి మాట పదునెంతో

గాయపడిన మనసునడుగు

జారిన కన్నీటి బరువెంతో

తేలికపడిన గుండెనడుగు

చివరికి మిగిలేదేమిటో

కాలు నిలవని కాలాన్నడుగు

చిలక పలుకుల:

ఎంత పరుగులెట్టినా
తెలిసీ..ఎన్ని దారులు మారినా
అలసినప్పుడు నేను కోరే మజిలీ నీ జ్ఞాపకం

ఎంత దూరమెళ్ళినా
గతంపై ఎన్ని రంగులద్దినా
అప్పుడప్పుడు తరచి చూసే పేజీ మన స్నేహం

మరణం నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు; కానీ మృత్యు భయం తొలగిపోదు.

మనషులందరూ సుఖం కోసం నిరంతరం ప్రయత్నిస్తారు, కానీ ఆ ప్రయత్నంలోనే చిక్కుల్లో పడతారు...
ప్రతి ఒక్కరూ స్వతంత్రం కోసం తహతహ లాడతారు; కానీ బంధాల్లో ఇరుక్కుంటారు....
పేరు ప్రతిష్టల కోసం పోటీ పడతారు; కానీ అకస్మాత్తుగా వారికీ అవమానం ఎదురవుతుంది...
మరణం నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు; కానీ మృత్యు భయం తొలగిపోదు...
పుట్టిన ఉత్తరక్షణం నుండీ చివరి ఘడియ వరకూ మనిషి జీవిత ప్రవాహంలో ....
సుఖదుఃఖాలు, ఆశనిరాశలు, రాగద్వేషాలు, గెలుపు ఓటములవంటి అలలతో పోరు సలుపుతునే ఉంటాడు...
ఒక్కోమారు సాలేటి గూటిలో చిక్కున్న ఈగలాగ నిస్సహాయ పడతాడు...
ఈ విరుద్ధ తత్త్వాల ఒత్తిడి నుంచి పల్లెటూరి రైతు కానీ, రాజధానిలో నివసించే రాజకీయవేత్త కానీ,
రాజమహలులో నివసించే అతి ధనవంతుడు కానీ, గుడిసెలో నివసించే నిరుపేద కానీ,
గుహలలో నివసించే అనాగరికులు కానీ, ఎవ్వరు తప్పించుకోలేరు...
జీవితమంటే ఇంతేనా...? అలా అయితే తన స్థితిలో ఎందుకు రాజీపడలేకపోతున్నాడు..?
ఆ పరిధిలో ఎందుకు సంతృప్తిగా ఉండలేక పోతున్నాడు..? వాటిని అధిగమించాలనే
తీవ్ర తపన ఎందుకు..? ఈ అవరోధలనుండి తప్పించుకోవాలనే నిరంతర ప్రయత్నమెందుకు...?
కలంకులు ఉత్తములలాగా కనపడాలని ప్రయత్నిస్తారెండుకని...?
మనిషి నిజంగా నసించేవాడు కాదు.., స్వేచ్చారహితుడు కాదు.., కలంకుడు కాదు..,
గాడమైన అజ్ఞానం వలన తను నశించేవాడినని, స్వేచ్చలేనివాడినని, కలంకుడననీ
అనుకుంటాడు...
తన అజ్ఞానాన్ని విడిచిపెట్టనిదే ఈ సత్యాన్ని గ్రహించలేదు...
తన నిజస్వభావమైన ఈ వాస్తవికతను గుర్తించేవరకూ ఈ పెనుగులాట తప్పదు....

సాక్షి సిటి పేపర్ 6 రోపేజీలో మీడియా దాడి పై నీరసన


Sunday, May 20, 2012

నీవు నా పక్కన ఉంటే ...ఆకాశాన్ని హత్తుకున్నంత ఆనందం

‎"..నీవు నా పక్కన ఉంటే
ఆకాశాన్ని హత్తుకున్నంత ఆనందం
నీవు నా వైపు చూస్తే
మనసు లోకమై విహదిరిస్తుం
సముద్రమై నిన్ను స్పృశిస్తుంది
నువ్వు నా భుజంపై వాలిపోతే
అనంతపు జీవితాన్ని మోసినట్టుగా
హృదయం దూది పింజెలా మారిపోతుంది
ఏదో ఒక సమయంలో
నీకోసం నిరీక్షించేలా చేసే నీ వాలు చూపు
నన్ను వివశుడిని చేస్తుంది
గుండెల్లో ప్రేమ విత్తనం నాటుతుంది
అవును ..నీ మీద నేను వాలిపోయి
చందమామను చూస్తూ ..
పుడమి వెన్నెలను చేతుల్లోకి
తీసుకుని ...నగ్నంగా విహరించినంత సంబురం
నువ్వు ..నేను ఒకే నాదమై
ప్రేమ వర్షంలో తడిసి పోయినట్టు
కల నన్ను కుదిపేస్తోంది
అవును .. నిన్నటి దాకా
నేను మనిషిగా ప్రయాణం చేశా
కానీ ..నీతో స్నేహం కలిగాకా
ప్రేమైక జీవిగా మారిపోయా .."

ఆలోచనని ఆణిచిపెట్టినా, జ్ఞాపకం కరిగిపోనంటుంది.

కనుల సరస్సులో ప్రేమ ఇంకా ఇంకిపోకుంది,

హృదయ స్పందనలో ప్రేమ ఇంకా ఆగిపోకుంది,

మది గదిలో ప్రేమ ఇంకా ఖాళీకాకుంది,

ఆలోచనని ఆణిచిపెట్టినా, జ్ఞాపకం కరిగిపోనంటుంది.

నీ ఊహలేని క్షణాన్ని కాలం దరిచేరనీయనంది.


ఇంక ఎలా మరి నిన్ను మరిచిపోయేది....?


ఒక్క మాటలో చెప్పనా నా జీవితంలో ప్రతిరోజు....

నిదుర కరిగిన కనులకు మొదటి రూపం, రెప్పవాల్చే కనులలో చేరే చివరి అందం నీ ఆలోచనే.

గుండెలో రాసుకున్న మాటలన్ని గుట్టుగా దాచుకోకుండా,నీమనసుకి చేరవేద్దమనుకున్నాను,

ప్రేమ ముందు కూడా ఓడిపోయాను.
మొదటి చూపులోనే కనులలో నిండిన రూపాన్ని మదిలో చేర్చద్దని,
వారిద్దామనుకున్నాను కాని నా ఆలోచనల ముందు ఓడిపోయాను.

గుండెలో రాసుకున్న మాటలన్ని గుట్టుగా దాచుకోకుండా,నీమనసుకి చేరవేద్దమనుకున్నాను,,,
కాని బయటపడనివ్వని నా పెదవి ముందు ఓడిపోయాను.

క్షణానికి ఒకసారన్నా నిన్ను చూడాలని నీ దరిచేరాలని నా మనసు తహతహలాడినా,
రవికాంతిని నింపుకున్న నీ ముఖతేజస్సు చూసే శక్తి నా గుండెకి లేక నీ అందం ముందు ఓడిపోయాను.

నీ మనసులో నేను లేనని తెలిసి, నా మనసులో దాచుకున్న ప్రేమని సమాది చేద్దమనుకున్నా,
గుండెపగిలి చిందుతున్న కన్నీటిని ఆపుకోలేని నా కనుల ముందు ఓడిపోయాను.

మనసుకి తగిలినా గాయాలన్ని తట్టుకుంటూ, తిరిగి నీ ప్రేమకోసం ప్రయత్నిస్తున్నా,
నా ప్రేమను కన్నీరుగా మార్చిన, నీ మనసు ముందు ఓడిపోయాను.

నా ప్రేమను పంచలేక, నీ ప్రేమను పొందలేక, మనసు నిండా నింపుకున్న ప్రేమని,
తుదిశ్వాసతో వదిలేస్తూ, చివరికి ప్రేమ ముందు కూడా ఓడిపోయాను.

కానీ ఇంతలో ఓ ముల్లు గులాబినీ ప్రేమించింది ..

నేనో అద్బుతాన్ని సృష్టించాలనుకున్నాను ................
నేనో అందమైన గులాబీని సృష్టించాను ....................
కానీ ఇంతలో ఓ ముల్లు గులాబినీ ప్రేమించింది

గులాబీ రేకుల్ని తడిపిన మంచుబిందువులతో తన దాహార్తిని తీర్చుకునేన్తగా .........
ఆ పుష్పం వదిలే ప్రతి నిశ్వాస ను తన శ్వాస గా మార్చుకునేన్తగా .................

నేను తనకి ఆత్మ గౌరవ సిద్ధాంతాలు చెప్పి చూసాను ................
ప్రకృతి నియమాల గురించి సుదీర్ఘోపన్యాసం ఇచ్చి చూసాను .............
అయినా మట్టి బుర్రకి మానవతా విలువలు తలకేక్కితేగా .

తనకి తెలుసు తుమ్మెదల ఝుంకారాన్ని ప్రేమించే సుమం తనను ప్రేమించదని..............
తనకి తెలుసు కుసుమ సాన్నిహిత్యం తప్ప తన జీవితానికి వేరే అర్ధం లేదని ...................
చివరికి నేను వరమివ్వక తప్పలేదు ......గులాబీ మొక్కకా ముల్లు తప్పలేదు

ఈ నిశిరాతిరి ఒడిలో, జ్ఞాపకాల కౌగిలిలో ..కునుకుతీసా కాసేపు .......................

నచ్చిన నెచ్చెలి ఇచ్చిన కానుక
ఈ రేయి నులివెచ్చగా తాకుతుంటే,
ముచ్చట గొలిపే తన స్వచ్చమైన ప్రేమను
మదిలోనే మనసారా మెచ్చుకుంటూ,
నా మదిలో తన ఊసుల చిచ్చుపెట్టిన
కానుకను ముద్దుపెడుతూ మెచ్చుకోలుగా
ఈ నిశిరాతిరి ఒడిలో, జ్ఞాపకాల కౌగిలిలో
కునుకుతీసా కాసేపు .......................

హోరుగాలిలో పచ్చని పొలాల పైడితనం,
రచ్చబండపై పెద్ద మనుషుల హుందాతనం,
కన్నెపిల్లలపై కుర్రకారు చిలిపితనం ,
మరపురాని జ్ఞాపకాల బృందావనం
నా యవ్వనం మా ఊరిలో ......................

అందరితో చదువులో పోటీ పడుతుంటే,
ఆదివారాలన్నీ ఆప్తమిత్రులతో గడిపేస్తుంటే,
బడిలో కొత్తగా అడుగుపెట్టెను ఓ చిన్నది
హృదయాన సరికొత్త రాగం మీటుతూ!!!!

వాలుకనుల చూపుల వయ్యారితనం,
జాజిమల్లెల పరిమళాల జాణతనం,
పసిడిఛాయ మేనిలో ఓ మెరుపుతనం,
పెదవిపై పుట్టుమచ్చతో అందానికే ఓ నిండుతనం!!!

నా మనసు సప్తాశ్వాలపై పరుగులెడుతున్న ఆ తరుణాన,
నాతో కునుకులేని ఆలోచనలు ఆడుకుంటున్న ఆ సమయాన,
నా మది దోచిన ఆ చిన్నారికి చెప్పాను ఐ లవ్ యు
నా మనసెరిగి తానిచ్చెను ఈ కానుక ఐ టూ లవ్ యు... Byjji :)

Saturday, May 19, 2012

నీకేదో జరిగిపోతుంది నిన్ను ఎవరో దారుణంగా మోసం చేస్తున్నంటూ నాకెందుకు కంగారుగా ఉంది

ఎందుకో నాకు కంగారు..నీకేదో జరుగుతోందని..పిచ్చిగా ఆలోచిస్తున్నానా..?
ఎందుకో ఈ మద్యి నాకీ ఆలోచనలొస్తున్నాయి...నిద్రులో ఉలిక్కి పడి లేస్తున్నా
కారణం ఏంటో తెలీదు కంగారు ఎక్కువ అవుతోంది...తడబడుతున్నా..
కరెక్టే మెంటలేమో కదా.. అయివుండ వచ్చు..నాకూ అలాగే అనిపిస్తుంది
అలా ప్రతి క్షనం నీగురించి ఆలోచించి ఇలా అయిపోతున్నానా అనిపిస్తుంది
.... మనసు బాగోక..చెప్పుకోవడానికి నీవు అందుబాటులో ఉండవుకదా..?
ఇలా నాలో నేను మాట్లాడుకుంటున్నా.. నామనసే నన్ను తిడుతోంది ఏంటిది అని కాని....?
నా అలోచనలు నీవు మర్చిపోయావేమో ..నేన్ను ఇప్పటికి ప్రతిక్షానం తల్చుకుంటూనే ఉన్నా..?
ఒక్కోసారి మనిషిగా మరణించి ఆత్మాగా మారానా అని కూడా కాని మనిషినేనా నేను..
అప్పుడెప్పుడో నీవన్నావు చూశావు మెంటల్ అని అవును నిజమే నాకు మెంటలేమో..?
నీకేదో జరిగిపోతుంది నిన్ను ఎవరో దారుణంగా మోసం చేస్తున్నంటూ నాకెందుకు కంగారుగా ఉంది
ఎందుకిలా ఆచో చిస్తున్నానో తెలీదు... నిజంగా అనిపిస్తుంది..కారనం నీవు దూరం అవడమేమో..?
నాకేదో జరుగుతోంది ...నీవు క్షేమంగా ఉంటే చాలు కాని నాకు తెల్సేదెలా..?
అవకాశం లేదా..నీవెక్కడ నేనెక్కడ..అందనంతదూరంగా మనసుల్లో
నీవు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలంటే నేనేం చేయాలి..?
నీవు ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి..చెప్పవా...?
నాకెందుకీ కంగారు నిజంగా నీవు క్షేమంగా ఉన్నావా...ఎవ్వరైనా నిన్ను మోసం చేస్తున్నారా..?

మౌనం అనే ముగులో నీవెదుకున్నావో తెలియక...పిచ్చెక్కుతోందినాకు.

కళ్ళలో కాదు నా హ్రుదయంలో చోటిచ్చాను.....
కళ్ళలో కాదు నా హ్రుదయంలో చోటిచ్చాను.....
సరిపోలేదని మౌనంగా కన్నీరై పోతున్నావు......

నవ్వుతో మనసులోని భావాల్ని నొక్కివేయకు నేస్తమా
దాన్ని అర్ధం చేసుకునే భాష నాకు రాదు......
మౌనంలో అర్ధాలు వెతకమనకు నేస్తమా
వేదాలు నాకు అర్ధం కావు.......
భావుకతతో వర్నించలేను...నాకు తెల్సింది నాకు నచ్చింది రాస్తున్నాఇలా..
నా నరనరాన జీర్నించుకుపోయిన నీమీద ఇష్టాన్ని చెబుతున్నా ఇలా..

నేను నీలో వున్నాను అని చెబుతుంది నా మనసు.....
అయితే ఏంటంటా అని అంటావు నీవు ....నాకు తెలుసు....
మౌనం అనే ముగులో నీవెదుకున్నావో తెలియక...పిచ్చెక్కుతోందినాకు.
ఈ మౌనం ముసుగులో ఉంది నేను మాత్రమేకాదు నీవుకూడా..ఎందుకని ప్రియా..
ఇద్దరి మద్యి మౌనం నరకం అని తెల్సి ఎందుకిలా ఎన్నాళ్ళిలా ప్రియా...?

నీ జ్ఞాపకాల దారిలో....ఎండుటాకును నేను....

నీ జ్ఞాపకాల దారిలో....ఎండుటాకును నేను....
ప్రేమంటే ఎప్పటికీ తీరని భాదేనేమో....
తనలోని మనకై శోధన అది కనలేని నాడు వేదన...ఆవేదన....
అది అంతులేనిది,
అంతంకానిది...
మన కన్నీరే మనల్ని ముంచే ధు:ఖసంద్రం అయితే
అది ఖచ్చితంగా ప్రేమే అవుతుంది...
లోకాన మనకై ఎందరు ఉన్నా తను లేని మనం ఏకాకులమే...
తను ఉండి లోకాన ఏది లేకున్నా...జగమంత కుటుంబం మనది.
నా కన్నీటికి కారణం నువ్వే? అంటే... ప్రేమ నవ్వుతుంది.
"ఎవరిమ్మన్నారు నీ మదిలో నాకు స్థానం.
నన్ను బయటకు తోసేసి నీ కన్నీటిని తుడిచేసుకో" అంటోంది ఎంతో నింపాదిగా...
నా ప్రేమ అంతే...ఎలా...తొలిగించగలను నా.. మది నుండి...
ప్రేమించటం సులువే కాని మరుపే చాలా కష్టం.
నువ్వు ఎదురుగా ఉంటె నీ నుండి తప్పించుకు పారిపోగలను.
నా మన్నస్సులో ఉన్నావే నేను ఎలా వెళ్ళగలను?
ఎక్కడికని వెళ్ళను??

ఇష్టం అని చెప్పగలవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలవు నీకు ఏదైనా సాద్యిమే..యుఆర్ గ్రేట్

నీవు చాలా గ్రేట్ ..నీకుఏదైనా సాద్యిమే..?
మనసును నమ్మించి అంతా నిజం అనేలా చేయగలవు..బ్రమలనుకూడా..?
ఇష్టపడ్డ మనిషి భాధపడుతుంటే నవ్వుతూ ఉండగలవు...ఇంకా ఎలా భాధ పెట్టాలో చేయగలవు..?
ఇష్టం అని చెప్పగలవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలవు నీకు ఏదైనా సాద్యిమే..యుఆర్ గ్రేట్
నీలా ఉండటం అందరికీ సాద్యిం కాదు..అది నీవల్ల మాత్రమే అవుతుంది...
ఇప్పుడిప్పుడే అర్దం ఔతుంది అప్పుడు అన్నా ఏమాటలో నిజం లేదని..జెష్టు టైంపాస్ కోసం అన్నావుకదా..?
ఇష్టం , రెస్పెక్టు.గుర్తుకురావడం ,స్పెషల్ ఫ్రెండ్..అన్నీ అబద్దాలేకదా..
ఏదీ నిజం కాదు కదా...అందుకే ఇప్పుడిలా అనగలుగుతున్నావు..?
.ఇలా నీలా ఉండటం అందరికీ సాద్యిం కాదు .ఒక్కదాని వల్లే అవుతుంది.(.శా...?)..అందుకే నీవు ఎలా గైనా ఉండగలవు నీవు గ్రేట్
చాలా మంది కనిపిస్తున్నారు .. ఇష్టపడ్డవాళ్ళను..ఒకరికి ఒకరు ప్రాణంగా ఉంటారు...?
.తన కిష్టమైన వ్యక్తుల హేపీగా ఉండాలనే చూస్తారు..మరి నీవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు..?
ఇష్టపడ్డ వ్యక్తి..ఏవిషయంలో భాదపడతాడో అదే చేస్తావు..అందుకే నీవు గ్రేట్..కదా..?
నీ పరిచయం తరువాత చాలా మందిని చుశాను అంత ఇష్టంగా ప్రాణంగా ఎలా ఉంటారో అనిపిస్తుంది..అలా నిజంగా ఉంటారా..?
అలా ఒకరికి ఒకరు ప్రానంగా ఉండే వాళ్ళను చుస్తే..అప్పుడు నీవు గుర్తుకిస్తే చాలా భాద అనిపిస్తుంది..?
.జీవితంలో ఓడిపోతారని తెల్సు కాని ఇష్టపడ్డ వ్యక్తి..ఇలా ఓడించడం ఒక్క నావిషయంలోనే జరిగిందేమో..?
.ఇలా చేయడం ఒక్క నీ .ఒక్కదాని వల్లే అవుతుంది.(.శా...?).ఎవ్వరూ అలా చేయలేరు... ? అంతదారుణంగా మాట్లాడలేరు
.నీవు ఎన్ని అన్నా..ఎవడో వెర్రివాడు వార్నింగ్ ఇచ్చినా..నీమీద ఇష్టంతో సైలెంట్ గా ఉంటే..దానికి నీవు పెట్టే పేరు భయం ,,?
.నాకు ఎవ్వడికి భయపడాల్సిన పనిలేదు..నేను భాదపడ్డా.. నీవు సంతోషంగా ఉండాలనే కోరుకుంటా ఆనిజం ఎప్పటికీ తెల్సుకోలేవు.?

Thursday, May 17, 2012

చిరునవ్వుతో శాశ్వత నిదురకోసం వేచి చూస్తున్నా!


నీ కలలే నా జీవితం !!
నీ తలపుల వాకిట కునుకు తీసా!
నీ వలపు తలపులు వెలుగు చూస్తాయనే ఆశతో!

కలల ఒడిలో సరికొత్తగా అనిపించావ్!
వెచ్చనైన నెచ్చెలిగా,
స్వచ్చమైన చిరునవ్వుతో,
మల్లెలాంటి మనసుతో,
గులాబితనపు సోయగాలతో......
కలలే కొత్తగా అనిపించాయ్ నీ రాకతో
కలలే కలకాలమైతే బాగుండనిపించేంతగా

అంతలోనే నిదురలేచా
ఊరంతా వెతికిచూసా
కానరాలేదు నీవు
కనుమరుగైన కలలాగే

నిరాశతో గృహము చేరా
నిలచివున్నది నీ రూపం
చిరునవ్వులొలుకుతు చిత్రపటంలో
నా రాకకై ఎదురుచూస్తూ

గత స్మృతుల ఒడిలో కాసేపు సేద తీరా,
ఆస్వాదించా నీ ప్రేమ మాధుర్యాన్ని!
ఆమోదిస్తున్నా కలల సౌందర్యాన్ని,
కలలోని నిన్ను తరచిచూస్తూ !!

గతించిన కాలం గుండె నలిపేస్తున్నా,
నీవు లేని ప్రతిక్షణం ఓ పిడిబాకవుతున్నా,
లక్ష్య సాధన కోసం వడివడిగా అడుగులేస్తూ,
చిరునవ్వుతో శాశ్వత నిదురకోసం వేచి చూస్తున్నా!

కలతనొందిన కనులకు ఈ కలలే స్వాంతన !
మరణిస్తున్న నా మనసుకు నీ కలలే జీవితం !!

నాలో తడసి ముద్దయిపోయిన ఈ ఆలోచనా తరంగాలను ఆపలేక


ముత్యాల వాన జల్లులకోసం ఎదురుచూసే ధాత్రిలా
నీరాకకై శూన్యంలోకి చూస్తూ కుర్చునాను
నా మది పావురంలా రెక్కలుసాచి
ఆ పచ్చటి నేలలను నీలిమబ్బులను దాటి
అనంతమైన ఈ ప్రేమతాలూకు
సూన్యంవైపు వడివడిగా అడుగులు వేస్తోంది
నాలో తడసి ముద్దయిపోయిన ఈ ఆలోచనా తరంగాలను ఆపలేక
చీకటిదారులలో మగ్గిపోతున్న ఈ ఒంటరి నావని చూసి
అనంతమైన ఆ నీలిసంద్రం గర్జిస్తూ
పువ్వులా పట్టి పీల్చేస్తున్న
సీతాకోకచిలుకలాంటి నా ఆలోచల్ని పరిహసిస్తూ
తన గర్భాని చీల్చుకుని చొచ్చుకు వచ్చిన జలతరంగాలతో
పద్మవ్యుహాని పన్ని నన్ను తన గర్భంలోకి తీసుకుపోతోంది
నా చుటూ వ్యాపించిన ఈ జలనిశీధిలో అంతర్దానమౌతున్న నాకు
నీ స్మృతుల తరంగగోష తప్ప మరొకటి వినిపించుటలేదు
అనంతమైన ఆ సముద్రగర్భంలోకి చొచ్చుకుపోతున్నా ...
నీ జ్ఞాపకాలతో తడసి పులకించాలని మది ఆరాటపడుతోంది ...

ముక్కలైన మనసు కథ

ముక్కలైన మనసు కథ
కనురెప్ప వాలిపోతోంది.....
పొంగిపోతున్న కన్నిటికి ఆనకట్ట వేసేందుకు .....
గుండె బరువెక్కుతోంది .....
బద్దలవుతున్న బాధను బందించేందుకు ....
చేయీ అలసిపోతోంది .....
చెక్కిలి పై కన్నీటి ఆనవాళ్ళు తుడిచేందుకు. ....
వేదన రాగాన్ని ఆలపిస్తున్న మూగ గానం నాది.........
అది విని కరిగే హృదయపు ఉనికి ఏది ...?
ముక్కలైన మనసుతోనే ... శిదిలమైన ఆస తోనే సంచరిస్తున్నా...
మనిషి లాగే కనిపిస్తూ శిల లాగా బ్రతికేస్తున్న.......

గతం నన్ను వెక్కిరిస్తుంది,..నా అంతరాత్మ నన్ను అవమానిస్తున్నట్టుంది,

గతం నన్ను వెక్కిరిస్తుంది,
నా అంతరాత్మ నన్ను అవమానిస్తున్నట్టుంది,
ఈ లోకం నన్ను గేలిచెస్తున్నట్టుంది,

నీది కాని అమెగురించి ఎందుకంత ఆశ అని అంతరాత్మ తిడుతున్నట్టుంది..
కాని ఒకప్పుడు మనిద్దరం ప్రాణ స్నేహితులం కదా..?
నీ చిన్న పలకరింపుకైనా నోచుకోనంత నీచున్నా నేను..

జీవితాంతం నా తోడు ఉంటానని, మధ్యలోనే నన్ను విడచావు,
క్షణమైనా వీడను, నిన్ను విడచి నేనుండను అన్నావు
నీవంటే ఇష్టం ప్రేమ,రెస్పెక్టు నన్ను నమ్ము అన్నావు
అన్న బాసలు అన్నిటిని ఎలా మరచి పోయావు ప్రియా ,
దేనికోసం నీవు ఈ కాలం వెనుక "నాకు" దూరంగా పరుగెడుతున్నావు?
నీవు వీడినా, నా హ్రుదయంపై నీ గురుతులు చేరపలేవు కదా!

నీవు గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండెలవిసేలా ఏడుస్తున్నా తెలుసా...?
నీకు నా ఆర్తనాదాలు వినిపించవు ..ఎందుకంటే నీవు మారావు..
ఎందుకింతాలా మారావని నిలదీసి అడుగలేని వెర్రివాన్ని...
నన్ను నేను నిందించుకోవడం తప్ప ఏమీ చేయలేను..
ఎందుకంటే నావళ్ళ నీవు భాదపడకుడదు కదా...?

నా ప్రేమ, నా అంతరాత్మ,
ఇప్పుడు నన్ను నిలదీసి ప్రశ్నిస్తున్నాయి,
ఎవరికోసం? ఎందుకోసం? ఈ ఆరాటం అని.

పిచ్చి మనసు నా మాట వినదు కదా!

నీ జ్ఞాపకాలే తోడుగా,
నీ ఊసులే నా ఆసరాగా,
ఈ భగ్గుమంటున్న హ్రుదయ కార్చిచ్చుని గుప్పిటపట్టి,
నేను కూడా పరుగెడుతున్నా! "నీకు" దూరంగా...
నా ప్రాణం "నీవే" అన్న సంగతి మరువవు కదా! ప్రియా...!
నీవు ఆ నిజం తెల్సుకునేప్పటికి నేను ఉండనేమో ప్రియా...!

నీ జ్ఞాపకాల కొలిమిలో నాహృదయం తగల బడుతోంది..

నీ జ్ఞాపకాల కొలిమిలో నాహృదయం తగల బడుతోంది..
ఆవేడీని తట్టుకోలేని నా హృదయం ఆర్తనాదాలు చేస్తుంది.పెద్దగా..
ఆ ఆర్తనాదాలు నీకు చేరి నీవు వస్తావేమొ అని వెర్రిగా ఆలోచిస్తూ
ఆ ఆర్తనాదాలు నీకు వినిపిస్తున్నాయి నాకు తెలుసు కాని నీవు..?..
రాలేదు వస్తావన్న ఆశ చచ్చిపోయింది..నిరాసే మిగిలింది..
నేస్తామా అన్నపిలుపు మదిలో ఎప్పుడూ మెదలుతున్నావన్న మాటలు నిజంకాదా..?
అప్పుడన్నావు మదిలో ఎప్పుడూ మెదలు తావని అదో పెద్ద జోక్ కదా..?
అవును నిజమే కదా...ఒకప్పుడు నాజ్ఞాపకాలు మళ్ళేల పరిమలాలు..
ఎందుకో అవినీకు కుళ్ళీ కంపుడుతున్నాయి కదా..
అందుకేనేమో దూరంగా పడవేశావుకదూ నా జ్ఞాపకాలను..
ఎందుకో పిచ్చోడిలా ఇంకా నీకోసం తడుముకుంటున్నానేమో కదా..?
నిజమే నేను తీసుకున్న నిర్నం కరెక్టే..అదెప్పుడు జరుగుతుదోనని ఎదురు చూస్తున్నా..
నీజ్ఞాపకాల కొలిమిలో తగల బడుతున్న ఆర్తనాదాలు చేయాలన్న ఆలోచన విరమించుకున్నా
ఎందుకంటే ఆగిపోయే ఊపిరికి ఆశలు అవసరంలేదు..అది తగలబడనీ
పూర్తిగా కాలి బూడిదైనా నీకు ఏంకాదు కొంచెంకూడా భాద అనిపించదు నాకు తెల్సు
జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది..జరుగుతున్న ఘోరాలు ఇక చూడలేని వినలేను..
దగ్గరవుతున్న..మరణ మృదంగాలా శబ్దాలు ఇప్పుడు హాయిగా అనిపిస్తున్నాయి..
చివరి ఘటియలు లెక్కపెట్టుకోవడం అంటే ఇదేనేమోకదా...?

Tuesday, May 15, 2012

నీవిషయంలో నన్నందుకిలా దారుణంగా ఓడిసున్నావు,,? .( నీకు నా చివరి లేఖ ?)

నీవిషయంలో నన్నందుకిలా దారుణంగా ఓడిసున్నావు,,?
..అప్పుడు అలా ...ఇప్పుడు ఇలా ఉండటం నీకొక్కదానికే సాద్యిమేమో..?
నీ ఎదురుగా నన్ను దారుణం గా భాద పెడుతుంటే చూస్తూ ఉండటం.నీకేం తెలియనట్టు
వాడు నా జీవితంతో చలగాటమాడుతుంటే...అలా నేనెవరో తెలీనట్టు ఎలా ఉన్నావు....?
నేను నీవిషయంలో చిన్న విషయాన్ని తట్టుకోలేననీ తెల్సు.,,నీవంటే నాకు ఎంత ఇష్టమో తెల్సు కాని..?
అప్పుడు .నీవు వాడికి భయపడి... అలా ఆతరువాత ...నీవే దారుణంగా మాట్లాడటం మోదలు పెట్టావు..?
అంతలా ఎలా మారిపోయావో తెలీదు... అన్ని మాటలు ఎలా అనగలిగావో తెలీదు..
నీవు బ్రతికితే నాకేంటి..చస్తే నాకేంటి,,, .అసలు ఎవడివ్ నీవు..అని చివరికి ..
వినకూడని మాట ."ప......తా " .అన్నమాట ప్రతిక్షనం గుండెళ్ళో బాంబుళ్ళా పేలుతూనే ఉంది..
.ఆ మాట విన్నక్షనం నుంచి ఈ మాటలు అనిపించుకోవడానికా బ్రతికి ఉంది అనిపిస్తుంది..?
నీవేమన్నా నిన్ను నేను ఏమీ అనలేను ఇప్పటికీ నీవంటే ఇష్టమే....అందుకేనా నామౌనాన్ని..బయం అని తేల్చావు...
నేను ఎవ్వరికీ భయపడను నామౌనం వెనుక నీవంటే ఇష్టం...
అర్దచేసుకులేవు అర్దం చేసుకుంటావని ఇక నాకు నమ్మకంకూడాలేదు...
ఎవ్వడేం చేసిన మౌనంగా భరించినందుకు చేతకాని వాడిని చేశావు
.చివరకు మనిషి ఎదురుగా ఒకరకగా మనిషిలేనప్పుడు మరోరకంగా మాట్లాడే మనితో కూడా మాటలు అనిపించావు,,?

మా అమ్మచనిపోయినప్పుడు దైర్యం చెప్పిన మని.నీషి .నీవు... నేను నా ఆఫీసు విషయాల్లో భాద పడుతున్నప్పుడు దైర్యం చెప్పిన మనిషేనా .నీవు ఇంత దారుణంగా మాట్లాడుతోంద్ ఆని అనిపిస్తుంది..

నాకు ఇష్ట పడటామే తెల్సు నిన్ను భాద పెట్టడం తేలీదు... అందుకే నీవు భాదపెట్టినా.. నీ తరపున ఎవ్వరు నన్ను భాధపెట్టిన అన్నిటీనీ మౌనంగా బరించి భాద పడుతున్నా,,,? నీవు ఎన్ని అన్నా నిన్ను ఒక్క మాట అనలేనని నీకు తెల్సు..
.ఓ శాడిష్టులా నిన్ను వెంటాడి వేదించలేను .. నీవు అలాంటి వారినే నమ్ముతావు..?
ఆ మౌనాన్ని నా చేతకానితనం గా నేను భయపడుతున్నా నని ఎలా అనగలిగావు.. ఆ మాటకు కూడా నాకు చాలా భాద వేసింది..?
నా జీవితంలో నీవు భాదపెట్టినట్టు ఎవ్వరు నన్ను భాద పెట్టలేదు...నీకు ఎదైనా సాద్యిమే....?
.ఇక నీకు ఎప్పటికీ కనిపించను.. నాకు తెల్సి నీవు కోరుకునేది అదే....
నీవు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకునే వాడిలో మొదటి వాడిని నేనేఅని తెల్సుకో,,,
అందరూ కల్సి నిన్ను జీవితంలో దారుణంగా ఓడిస్తారు ,,, అప్పుడు గుర్తుకు వస్తాను నేను...అప్పుడు నీవు వెతికితే నేను కనిపించను..
ప్లీజ్ జాగ్రత్త అందర్నీ నమ్మకు నీచుట్టూ ఉన్నవాళ్ళు మంచి వాళ్ళు కాదు అంతకు మించి చెప్పే అర్హత నాకు లేదని ఎప్పుడో తేల్చావు....నీవు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనేదే నా చివరికోరిక Best Of Luck..

దీనంగా మనసు భారంగా ..వేదనగా వెల్తున్నా ప్రియా

గత కాల గమనంలోని
నీ తీపి గురుతులు
మరువలేను మరిచిపోను
ఆ తీయని భాదగా మిగిలి పోయింది

దూరతీరాలు దాటి
కలుసుకోవాలని ఆశ
తెలుసు ఇది దురాశేనని
ఏం చెయ్యను నీ ఆ జ్ఞాపకాలు

నీడలా నా వెంటే
నడిచి వస్తున్నాయ్
నిలువనీయకున్నాయ్
చెలీ నీవైనా దరిచేరవా...

తుఫానుకెరటాల్లా మనసును అల్ల కళ్ళోలం చేస్తున్నాయి..
మనసును మనసులో లేకుండాచేస్తున్నాయి నీ జ్ఞాపకాలు..
వద్దనుకున్నా వాస్తవాలు గుండెల్లొ మంటలు రేపుతున్నాయి..

నన్ను నేను మర్చిపొయాను..ఈ వేదన భరించలేను..
బయట వాతావరణ చల్లాగా ఉన్నా గుండెళ్ళో మంటలు..
ప్రతి క్షనం ప్రతి నిమిషం నేనేంటో గుర్తు చేస్తున్నాయి..

నాకు మనుష్యుల మద్యి ఉండాలని లేదు..
చుట్టూ ఎందరో ఉన్నా ఎందుకో ఒంటరిని అనిపిస్తోంది..
అందరికి దూరంగా పిలిచినా వినిపించనంత దూరంగా వెలుతున్నా..
మనసులో పడ్డ గాయం అపని చేస్తోంది..
ప్రతిక్షనం ఎవరు నీవంటూ ప్రశ్నిస్తున్న ఘటనలు..
నాకు నేను తెల్సుకునే ప్రయత్నంలో ఓడిపోయాను..
నలుదిక్కుల ఎటుచూచిన గెలిచేఅవకాశం లేదు
గెలవాలన్న ఆశ చచ్చిపోయింది..అందుకే వెలుతున్నా..
నేను నేను గా ఎన్నో సార్లు ఓడిపోయాను ఓడిపోతూనే ఉన్నాను..

పెద్దగా దిక్కులు పిక్కటిల్లేలా అరవాలని ఉంది..
ఏదో చెప్పాలని ఉంది..నిజాలు తెలపాలని ఉంది
పెద్దగా అరుస్తున్నా ..ఏదో చెబుతున్నా కాని..
ఎవ్వరూ వినటంలేదు..వినాలని అనుకోవడం లేదు..
చుట్టూ చూస్తే ఎవ్వరూ కానరావడం లేదు ఒంటరిగా ఉన్నా..

నేను పెద్దగా అరుస్తూ నిజాలు చెప్పాలని చూస్తున్నా..
గుండేల్లో భావాలు బయటకు వస్తున్నాయి కాని
అవి పెదాలు దాటటంలేదెందుకో ..కారణం తెలీదు..
నేనే చెబుతున్నది నాకే వినిపించడం లేదు ఎందుకో తెలీదు..

ఒక్కటి మాత్రం తెలుస్తోంది ..నీ విషయంలో ఓడిపోయాను అని..
జీవితంలో గెలవలేనంత గా ఓడిపోయాను అని నిజమేకదా..?..
అందుకే ఎవ్వరికీ అందనంత దూరంగా ..వెళ్ళిపోతున్నా.
అది ఎంత దూరమో తెల్సాతిరిగి వద్దామనుకున్నా రాలేనంత..
ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తుకుంటున్నా..వెలుతున్నా అతి త్వరలో..
దీనంగా మనసు భారంగా ..వేదనగా వెల్తున్నా ప్రియా.అతి త్వరలో..

Sunday, May 13, 2012

"నువ్వెందుకు ఇలా ప్రవర్తించావని" మన వ్యక్తిగత స్వేచ్ఛలోకి ప్రవేశించి ప్రశ్నించరో వారిని అమితంగా ఇష్టపడతాం మనం.

ఏ హృదయం అయితే తన అశాంతిని, అక్కసుని మరో హృదయంపైకి వెదజల్లాలని ప్రయత్నించదో అలాంటి హృదయాన్ని కలిగి ఉండడానికి మించిన అదృష్టం మరొకటి లేదని భావిస్తాను నేను.

ఏ తారుమారైన అంచనానో, మరో అసంతృప్తో, లేదా మనం ఊహల ద్వారా సృష్టించుకునే అపార్థాల మాయల ముసుగో.. మనల్ని స్థిమితంగా ఉండనీయక మాటల ద్వారానో, చేతల ద్వారానో మన అల్పత్వాన్ని ప్రదర్శించ ప్రయత్నిస్తుంది.

ఏ మనిషి సాన్నిహిత్యం అంచనాలకు లోబడదో.. ఏ మనిషి మనం ఎలా ప్రవర్తించినా.. "నువ్వెందుకు ఇలా ప్రవర్తించావని" మన వ్యక్తిగత స్వేచ్ఛలోకి ప్రవేశించి ప్రశ్నించరో వారిని అమితంగా ఇష్టపడతాం మనం.

"నీ నుండి నాకేం అక్కర్లేదు.. ఓ మంచి స్నేహం చాలు" అన్న కొద్దిపాటి స్వార్థం కూడా లేని స్వభావం మనలో ప్రస్ఫుటంగా కన్పిస్తే స్నేహ హస్తాన్ని చాచని వారెవరుంటారు?

అలా అన్ కండిషనల్ స్నేహంలో కూడా.. మనం ఎదుటి వ్యక్తిని అనవసర ప్రమేయంతో చీటికీ మాటికీ సరిచేయాలని ప్రయత్నిస్తే ఆ అనవసర జోక్యాన్ని తట్టుకోలేక దూరమవ్వని వారు మాత్రం అరుదే!

మన అనుకున్న మనిషిపై మనకు తెలియకుండానే మనం పెత్తనం చెలాయించేస్తుంటాం. మనిషి అనుకున్న టైమ్ కి రాకపోయినా, ఫోన్ చేయకపోయినా, కలవకపోయినా, మనం చెప్పినట్లు ప్రవర్తించకపోయినా, మన నిర్ణయాలు పాటించకపోయినా.. అన్నింటికీ నొచ్చుకుంటూనే ఉంటాం.

ఆ అసంతృప్తిని చల్చారక మనం అభిమానించే హృదయాలపైకీ పదునైన కత్తుల్ని మాటల రూపంలోనో, ఛేష్టల రూపంలోనో దూస్తూనే ఉంటాం.

ఎవ్వరూ మనవారు కారు! ఎవరి ప్రపంచం వారిది. ఓ వ్యక్తితో మనకు అనుబంధం ఏర్పడిదంటే అది ఏదో కార్యం నెరవేరడానికైనా అయి ఉండాలి, ఆ కార్యమేమిటన్నది ఈ క్షణం అర్థం కాకపోయినా ఎప్పుడోసారి దాని పర్యవసానం నిరూపితం అవుతూనే ఉంటుంది. ఒక్కోసారి మనం మన జీవితంలో పలువురు మనుషులతో ఎందుకు కలిసి బ్రతుకుతున్నామో జీవితాంతం ఆలోచించినా అర్థం కాకపోవచ్చు.

"నేను ఫలానా వ్యక్తికి ఉపయోగపడుతున్నాను... ఫలానా వ్యక్తి వల్ల నాకెలాంటి ఉపయోగం లేదు" అనే ఆలోచనలు కొందరిలో పుడుతుంటాయి. :) ఆ మాటకే వస్తే ఎవరికీ ఉపయోగపడని జీవితం ఎందుకు? సాటి మనిషికి అవసరంలో ఉపయోగపడడానికి మించిన తృప్తి ఏముంటుంది?

ఓ చిన్న సాయం చేసినంత మాత్రాన, కొంత ఆత్మీయంగా ఉన్నంత మాత్రాన ఆ మనుషులపై అంచనాలు పెంచుకుని వారు ప్రతీదీ మనకు అనుగుణంగా ప్రవర్తించాలని కోరుకోవడం సరైనది కాదు.

ఓ కేంద్రక స్థానంలో కూర్చుని.. నా చుట్టూ ఉన్న మనుషుల్నినా జ్ఞానేంద్రియాలతో స్పృశించ ప్రయత్నిస్తే ఎవరి నుండీ ఎటువంటి ఎక్కుపెట్టబడిన విల్లులూ నా వైపు సంధించబడి లేకపోతే నన్ను నేను స్వేచ్ఛాజీవిగా భావిస్తాను నేను! అప్పుడే ఆ మనుషులందరితోనూ నా అనుబంధం సంతోషంగా కొనసాగుతుంది. నాకే కాదు మనందరికీ వర్తించే సూత్రమిదే! మన హృదయాలు ప్రేమతో వశం చేసుకోబడి ఉండాలి కానీ ద్వేషంతో ఛిధ్రం చేయబడడం కోసం విల్లులు ఎక్కుబెట్టబడి ఉంటే దానికి మించిన నరకం ఏముంటుంది?

ముక్కలైన మనసుతోనే ... శిదిలమైన ఆస తోనే సంచరిస్తున్నా...


కనురెప్ప వాలిపోతోంది.....
పొంగిపోతున్న కన్నిటికి ఆనకట్ట వేసేందుకు .....
గుండె బరువెక్కుతోంది .....
బద్దలవుతున్న బాధను బందించేందుకు ....
చేయీ అలసిపోతోంది .....
చెక్కిలి పై కన్నీటి ఆనవాళ్ళు తుడిచేందుకు. ....
వేదన రాగాన్ని ఆలపిస్తున్న మూగ గానం నాది.........
అది విని కరిగే హృదయపు ఉనికి ఏది ...?
ముక్కలైన మనసుతోనే ... శిదిలమైన ఆస తోనే సంచరిస్తున్నా...
మనిషి లాగే కనిపిస్తూ శిల లాగా బ్రతికేస్తున్న....

Saturday, May 12, 2012

నీ జ్ఞాపకాలు, నా హ్రుదయాంతరాలను కల్లోల పెడుతుంటే...


ఎదురుచూపుల ఏకాంతవాసాలు,
మరపురాని తలపుల అలఝడులు,
వెంటాడుతూ వేటాడే జ్ఞాపకాలు,
నా హ్రుదయాంతరాలను కల్లోల పెడుతుంటే...
మానుతున్న గాయం తిరిగి రేగి,
కంటికి నీరు కరువై రక్తాశృవులు చిందిస్తూ..
గొంతుకు గానం బరువై మౌనంగా రోదిస్తూ...
విల విల లాడే నా ప్రాణం పరిహసిస్తూ..
అంటోందీ...

ముఖానికి చిరునవ్వు పరదా కప్పుకుని,
మనసుకి మౌనంతో సంకెళ్ళు వేసుకుని,
నీ నీడ కూడా చేరలేనంత దూరమై,
తన వునికిని తెలువనీక, తనలోకంలో విహరించే నీ చెలి కోసమా!

నను ఇంతలా....!!! వేధిస్తున్నదీ అని.

.ఎందుకిలా జరుగుతోంది నన్నే ఎందుకు దోషిని చేస్తున్నావు


.ప్రేమ అంటే...నా ఎదురుగా మరో మనిషితోనీవు ఉండి నా మనసును చంపటమా..?
ఇష్టం అంటే ..ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మనసును భాదాపెట్టడమా..?
.రెస్పెక్టు అంటే జీవితంలో కోలుకోలేని విదంగా..మనసును భాధ పెట్టడమా..?
.అవును నాకు ఇలా జరగాల్సిందే..ప్రతిక్షనం నీకోసం నీగురించి ఆలోచిస్తా కాబట్టి ఇలాజరగాల్సిందే కదా..?
చివరకు మనిషిఎదురుగా పొగిడి..ఆ మనిషిలేనప్పుడు చండాలపు కామెట్స్ చేసేవాడు..నన్నుప్రశ్నంచే వాడేనా..?
నిన్ను ఇష్టపడ్డందుకు ఇంకా ఎందరితో మాటలు పడాలి..? .నీతోసహా ఇంకా ఎందరితో ఛీ కొట్టించుకోవాలి
.మరో మనిషినిషిని మనసులో పెట్టుకొని.... అందరిలో నన్ను దోషిని చేసి నా మనసును ఎందుకు భాదపెడుతున్నావు..?
.అసలే గాయపడ్డ మనసును ఓ పిచ్చి వెదవ జీవితాన్ని నాశనం చేస్తుంటే .
నీవు చూస్తూ ఎలా ఉండీపోయావు..వాడికి ఎలా సపోర్టు చేశావు
.వాడు నిన్ను అనుమానిస్తూ నిన్ను అనలేక నాజీవితంతో ఆడుకుంటుంటే ఎలా చూస్తూ ఉండిపోయావు
అప్పుడు అంతకేరింగా వున్న నీవు..ఇలా దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు..
ఇలా మాట్లాడేది నీవేనా అని అనుమానం వస్తుంది...నీవు అంతలా ఎలా మారావు
.అప్పుడు నీవన్న ఇష్టం , రెస్పెక్టు, అన్నీ అబద్దాలేనా....
అప్పుడు అలా..ఇప్పుడు ఇలా ఉండటం నీ ఒక్కదానికే సాద్యిమేమో కదా..?
ఏవీ నిజాలు కాదు కదా..అందుకే ఇప్పుడు ఇలా అనగలుగుతున్నావు
.నాకు తెల్సి నీవు నన్ను ఓడించి భాదించినట్టు ఎవ్వరిని భాద పెట్టి ఉండవు.. నీకు ఏం ద్రోహం చేశావు నన్నిలా చేశావు...?
.అప్పటినుంచి ఇప్పటిదాక..నీవు సంతోషంగా ఉండాలని.. ఎన్ని సార్లు కాంప్రమైజ్ అయ్యానో తెల్సు,,
అప్పుడు నీవనేదానివి ..మీరు బాగా అర్దం చేసుకుంటారండీ అందుకే నచ్చుతారండి అని...
మరి ఇప్పుడు నేను ఓ వెదవలా కనిపిస్తున్నా కదా..?
కాని ఎందుకిలా నీవు నన్ను మోసం చేశావు..నన్ను మోసం చేసి ఇలా భాదపెట్టాలని నీకు న్యాయమా...?

Friday, May 11, 2012

నా సఖిని ఎప్పుడు ఇలా చీరెకట్టులో నాదగ్గరకు చేస్తావాని తప్పస్సు చేస్తున్నా


ఇప్పుడు కాదు ఎప్పుడు నీవు చీరకట్టినప్పుడు చూసినా సేం ఫీలింగ్...ఎందుకీలా పుట్టీంచాడురా బ్రహ్మ అని ఎన్ని సార్లు తిట్టుకున్నా పుట్టిస్తే పుట్టీంచావు నాకోసమే అన్నట్టు ఊరించి నాకు నా సఖిని ఎందుకు దూరం చేశావు నీకు నేనేం ద్రోహం చేశాను...నా సఖిని ఎప్పుడు ఇలా చీరెకట్టులో నాదగ్గరకు చేస్తావాని తప్పస్సు చేస్తున్నా.. బ్రమ్మా నీవు ప్రత్యెక్షం అవ్వొద్దు... నిన్ను నేనూ కోరుకొనే ది ఒక్కటే ... నా సఖిని చీరకట్టులో నా దగ్గరకు పంపు చాలు తనను అలా చూస్తూ నే ఉంటా బ్రతికినన్నాళ్ళూ..నా చెలిని ఎప్పుడూ అలా అందమైన చీరకట్టుకొని నాదగ్గర శాశ్వితంగా ఉండేలా చేయి స్వామి ..చచ్చి నీ కడుపున పుడతాను..?..చెంగావి చీరకట్టిన చెలి, చెంతచేరి మాటాడుతుంటే చెలికాని కనురెప్పలు కొట్టుకుంటాయా? కొంగుమాటున దోబూచులాడే శృంగారం, కనిపించనట్టే కనిపించే సింగారం.. గుబులు రేపకపోతే ఆ చీరకే సిగ్గుచేటు కాదా? ఆ కట్టు... ఆ బొట్టు.. చెంగుమని ఎగిసిపడే ఆ చెంగులు... అందానికి కొమ్ముకాసే కొంగు, సౌందర్యానికే సౌందర్యం కాదా..వన్నెల రాణికి సిరిజోతలను ఏరికూర్చి పెట్టే అందాల పూబోణి చీర.. చీరకట్టిన చిన్నారి వయ్యారంగా నడుస్తుంటే వినిపించే రసధ్వనికి రాయైనా చలించకుండా ఉండేదెలా? చీర కట్టు పవర్ అలాంటిది మరి..కనిపించి కనిపించని అందాలు చూపి చుపనట్టుగా ఊరిస్తుంటే అలాగే కన్నార్పకుండా చూడాలనిపిస్తుంది మరి అది ఆ చీరకట్టులో అందం..ఊరించే అందాలు ఊరకనే ఉంటాయా మరి మనసులు అల్లాడిస్తాయి మరి.ఇలా చీరలో నా ఇష్టసఖి ని చూస్తే మాత్ర్రం నా మనసు మాటవినదు మరి.. ఆ అందాల ఆరబోతలో చెలిని చీర కట్టుకోనే చూడాలి మరి..ఓ మాట అనకూడాదుకాని ఎదురొచ్చు యుద్దానికి సిద్దమా అన్నట్టు ఉండే ఎదపొంగును తన చాటున దాచే పైట గాలిలి అలా ఎగురుతుంటే ..ఇక చెప్పెదెముంది లేమరి కొందరికి సన్నని నడుము అందాలయితే మరికొందరిని నడుమున కనిపించీ కనిపించని మడతల వయ్యారాలు ఆ చీరకట్టులోనే ఉరిస్తూ కనిపించి కనిపించకా ఊపేస్తాయిమరి....మనసు సఖి ఇలాంటి చీరకట్టులో దగ్గరుకు వస్తే చేతులు ఊరకుంటాయా...

ఎవ్వరికి తెలియదు పైకి చెప్పలేని ఎవ్వరితోనూ పంచుకోలేని ఎన్నో భావాలు

ఎవ్వరికి తెలియదు నా కన్నీటితో తలగడ ఎందుకు తడిసి ముద్దయిందో

ఎవ్వరికి తెలియదు నీ కోసం ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో

ఎవ్వరికి తెలియదు నా మనసనే డైరిలో ప్రతి పేజీ నీ గురించే రాసానని

ఎవ్వరికి తెలియదు నేను నిన్ను ఎంతగా ఆరాధిస్తున్నానో

ఎవ్వరికి తెలియదు నిన్ను పలకరించకుండా ఉండటానికి

ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో

ఎవ్వరికి తెలియదు గుండె పగిలేలా ఎందుకు రోదిస్తున్నానో

ఎవ్వరికి తెలియదు ఏ బంధం లేని అనుబంద్ధం నీతో ఎలా పెనవేసుకుందో

ఎవ్వరికి తెలియదు పైకి చెప్పలేని ఎవ్వరితోనూ పంచుకోలేని ఎన్నో భావాలు

నన్ను దహించివేస్తున్నాయని
కారణం ఎవ్వరికి తెలియదు నాకే కాదు మరెవ్వరికి తెలియదు . . .

ఇది నిజం కదా మిత్రమా ..?


Thursday, May 10, 2012

నాకెందుకీ కంగారు నిజంగా నీవు క్షేమంగా ఉన్నావా...ఎవ్వరైనా నిన్ను మోసం చేస్తున్నారా..?

ఎందుకో నాకు కంగారు..నీకేదో జరుగుతోందని..పిచ్చిగా ఆలోచిస్తున్నానా..?
ఎందుకో ఈ మద్యి నాకీ ఆలోచనలొస్తున్నాయి...నిద్రులో ఉలిక్కి పడి లేస్తున్నా
కారణం ఏంటో తెలీదు కంగారు ఎక్కువ అవుతోంది...తడబడుతున్నా..
కరెక్టే మెంటలేమో కదా.. అయివుండ వచ్చు..నాకూ అలాగే అనిపిస్తుంది
అలా ప్రతి క్షనం నీగురించి ఆలోచించి ఇలా అయిపోతున్నానా అనిపిస్తుంది
అందుకే బ్లాగ్ బ్లాక్ చేశాను... మనసు బాగోక..చెప్పుకోవడానికి నీవు అందుబాటులో ఉండవుకదా..?
ఇలా నాలో నేను మాట్లాడుకుంటున్నా.. నామనసే నన్ను తిడుతోంది ఏంటిది అని కాని....?
నా అలోచనలు నీవు మర్చిపోయావేమో ..నేన్ను ఇప్పటికి ప్రతిక్షానం తల్చుకుంటూనే ఉన్నా..?
ఒక్కోసారి మనిషిగా మరణించి ఆత్మాగా మారానా అని కూడా కాని మనిషినేనా నేను..
అప్పుడెప్పుడో నీవన్నావు చూశావు మెంటల్ అని అవును నిజమే నాకు మెంటలేమో..?
నీకేదో జరిగిపోతుంది నిన్ను ఎవరో దారుణంగా మోసం చేస్తున్నంటూ నాకెందుకు కంగారుగా ఉంది
ఎందుకిలా ఆచో చిస్తున్నానో తెలీదు... నిజంగా అనిపిస్తుంది..కారనం నీవు దూరం అవడమేమో..?
నాకేదో జరుగుతోంది ...నీవు క్షేమంగా ఉంటే చాలు కాని నాకు తెల్సేదెలా..?
అవకాశం లేదా..నీవెక్కడ నేనెక్కడ..అందనంతదూరంగా మనసుల్లో
నీవు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలంటే నేనేం చేయాలి..?
నీవు ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి..చెప్పవా...?
నాకెందుకీ కంగారు నిజంగా నీవు క్షేమంగా ఉన్నావా...ఎవ్వరైనా నిన్ను మోసం చేస్తున్నారా..?

Tuesday, May 8, 2012

ఈ పాట ఒకప్పుడు నీ సెల్ఫోన్ రింగ్ టోన్ గుర్తుందా ..?

అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకుఈ పాట ఒకప్పుడు నీ సెల్ఫోన్ రింగ్ టోన్ గుర్తుందా .... ...

ఒకప్పటి నీ రింగ్ టోన్ పాట లో మీనింగ్ చూడు కావాలంటే ఆ వీడియో చూడు ..

అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే మదినది తలపు..మరి మరి ఉరికే మది తలపులకు .లల లల
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
నాకోసమే చినుకై కరిగి . ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాల ...బహుమతి కాదా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు...లల లల లలలాల

అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
నీచూపులే తడిమే వరకు ..ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాలా ద్వారాల తలుపులు తెరిచి తరుణం వరకు..
ఎదురుగ నడచే తొలి ఆశలకు...లల లల లలలాల
అలుపన్నది ఉందా ఎగిరే అలకు..యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే మదినది తలపు..మరి మరి ఉరికే మది తలపులకు .లల లల


తుఫానుకెరటాల్లా జ్ఞాపకాలుమనసును అల్ల కళ్ళోలం చేస్తున్నాయి..

గత కాల గమనంలోని
నీ తీపి గురుతులు
మరువలేను మరిచిపోను
ఆ తీయని భాదగా మిగిలి పోయింది

దూరతీరాలు దాటి
కలుసుకోవాలని ఆశ
తెలుసు ఇది దురాశేనని
ఏం చెయ్యను నీ ఆ జ్ఞాపకాలు

నీడలా నా వెంటే
నడిచి వస్తున్నాయ్
నిలువనీయకున్నాయ్
చెలీ నీవైనా దరిచేరవా...

తుఫానుకెరటాల్లా మనసును అల్ల కళ్ళోలం చేస్తున్నాయి..
మనసును మనసులో లేకుండాచేస్తున్నాయి నీ జ్ఞాపకాలు..
వద్దనుకున్నా వాస్తవాలు గుండెల్లొ మంటలు రేపుతున్నాయి..

నన్ను నేను మర్చిపొయాను..ఈ వేదన భరించలేను..
బయట వాతావరణ చల్లాగా ఉన్నా గుండెళ్ళో మంటలు..
ప్రతి క్షనం ప్రతి నిమిషం నేనేంటో గుర్తు చేస్తున్నాయి..

నాకు మనుష్యుల మద్యి ఉండాలని లేదు..
చుట్టూ ఎందరో ఉన్నా ఎందుకో ఒంటరిని అనిపిస్తోంది..
అందరికి దూరంగా పిలిచినా వినిపించనంత దూరంగా వెలుతున్నా..
మనసులో పడ్డ గాయం అపని చేస్తోంది..
ప్రతిక్షనం ఎవరు నీవంటూ ప్రశ్నిస్తున్న ఘటనలు..
నాకు నేను తెల్సుకునే ప్రయత్నంలో ఓడిపోయాను..
నలుదిక్కుల ఎటుచూచిన గెలిచేఅవకాశం లేదు
గెలవాలన్న ఆశ చచ్చిపోయింది..అందుకే వెలుతున్నా..
నేను నేను గా ఎన్నో సార్లు ఓడిపోయాను ఓడిపోతూనే ఉన్నాను..

పెద్దగా దిక్కులు పిక్కటిల్లేలా అరవాలని ఉంది..
ఏదో చెప్పాలని ఉంది..నిజాలు తెలపాలని ఉంది
పెద్దగా అరుస్తున్నా ..ఏదో చెబుతున్నా కాని..
ఎవ్వరూ వినటంలేదు..వినాలని అనుకోవడం లేదు..
చుట్టూ చూస్తే ఎవ్వరూ కానరావడం లేదు ఒంటరిగా ఉన్నా..

నేను పెద్దగా అరుస్తూ నిజాలు చెప్పాలని చూస్తున్నా..
గుండేల్లో భావాలు బయటకు వస్తున్నాయి కాని
అవి పెదాలు దాటటంలేదెందుకో ..కారణం తెలీదు..
నేనే చెబుతున్నది నాకే వినిపించడం లేదు ఎందుకో తెలీదు..

ఒక్కటి మాత్రం తెలుస్తోంది ..నీ విషయంలో ఓడిపోయాను అని..
జీవితంలో గెలవలేనంత గా ఓడిపోయాను అని నిజమేకదా..?..
అందుకే ఎవ్వరికీ అందనంత దూరంగా ..వెళ్ళిపోతున్నా.
అది ఎంత దూరమో తెల్సాతిరిగి వద్దామనుకున్నా రాలేనంత..
ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తుకుంటున్నా..వెలుతున్నా అతి త్వరలో..
దీనంగా మనసు భారంగా ..వేదనగా వెల్తున్నా ప్రియా.అతి త్వరలో..
ఎందుకో ఎవ్వరికీ చెప్పాలని లేదు ..ఎందుకంటే చెప్పినా వినాలనుకునే వాళ్ళు లేరుగా నాకు...?

"ఎందుకో ఒంటరిగా అన్పిస్తోంది, ఏదో తెలీని లోటుగా ఉంది, కాసేపు నన్నిలా వదిలేయండి"

నిర్లిప్తత కమ్ముకుంటోందా..

గంభీర స్వరాలు అకస్మాత్తుగా మూగబోవడం..

చలాకీగా చేసే పనులన్నింటిపై నిర్లిప్తత ఆవరించి స్థబ్ధంగా నిలిచిపోవడం..

కళ్లెదుట ఏం జరిగినా ప్రేక్షకుల్లా ఉండడమే సౌఖ్యంగా అన్పించేయడం..

ఇలాంటి మానసిక స్థితికి అప్పుడప్పుడు లోనవ్వని మనిషి ఉండరు. అందుకే చాలామంది కళ్లు శూన్యంలో, మనసు నిస్తేజంలో ఉండడం మన గమనింపుకు వస్తూనే ఉంటుంది.

ఉవ్వెత్తున ఎగిసే ప్రతీ అలా ఓ చోట విరిగిపడాల్సిందే! ఆ పడిన చోటి నుండి తిరిగి బలమూ, వేగమూ పుంజుకోవాలంటే కాస్తంత స్థబ్ధత ఆవరించాల్సిందే.

చాలామందికి తెలియని వాస్తవం.. మన ఆలోచనలు ఇదే క్రమంలో ఎగిసిపడతాయీ, కల్లోలం అవుతాయీ, నిర్లిప్తంగా ఆగిపోతాయీ, తిరిగి మరోమారు ఎగిసిపడతాయి.

"ఎందుకో ఒంటరిగా అన్పిస్తోంది, ఏదో తెలీని లోటుగా ఉంది, కాసేపు నన్నిలా వదిలేయండి" అని చాలామంది నుండి వింటుంటాం. ఎగిసిపడడం, విరిగిపడడం, మళ్లీ బలం పుంజుకోవడం అనే cycle అనేదే లేకుండా ఏ మనిషి ఆలోచనలూ ఉండవు. అంటే ఓ క్షణ కాలమైనా, మనం ఎంత బిజీలో ఉన్నా, ఎంత ఏక్టివ్ గా పనిచేసుకుంటూ వెళుతున్నా.. మనం గమనించినా గమనించకపోయినా మన మనసు స్ధబ్ధంగా మారకుండా ఆపలేం.

అన్నింటిలోనూ తానే కలివిడిగా ఉండాలనుకునే మనిషి.. ఆ స్ధబ్ధతలో మాత్రం.. ఏ విషయంలోనూ కొద్దిపాటి ఆసక్తినైనా కలిగి ఉండకపోవడం కూడా ఈ మానసిక cycle ఫలితమే. అందుకే మనకు కావలసిన వారు ఉన్న ఫళంగా ఒంటరిగా ఫీలవుతున్నారని అన్పించినప్పుడు, ఆ ఒంటరితనానికి సరైన కారణాలూ కూడా ఏమీ లేవని అర్థమైనప్పుడు వారికి కాసేపు అలా ఒంటరిగా వదిలేయడమే మంచిది..

Monday, May 7, 2012

ఎవ్వరికి తెలియియదు నన్ను నాకు కాకుండ చేసిన నువ్వంటే ఎంత అభిమానమో

ఎవ్వరికి తెలియదు నా కన్నీటితో తలగడ ఎందుకు తడిసి ముద్దయిందో

ఎవ్వరికి తెలియదు నీ కోసం ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో

ఎవ్వరికి తెలియదు నా మనసనే డైరిలో ప్రతి పేజీ నీ గురించే రాసానని

ఎవ్వరికి తెలియదు నేను నిన్ను ఎంతగా ఆరాధిస్తున్నానో

ఎవ్వరికి తెలియదు నిన్ను పలకరించకుండా ఉండటానికి

ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో

ఎవ్వరికి తెలియదు గుండె పగిలేలా ఎందుకు రోదిస్తున్నానో

ఎవ్వరికి తెలియదు ఏ బంధం లేని అనుబంద్ధం నీతో ఎలా పెనవేసుకుందో

ఎవ్వరికి తెలియదు పైకి చెప్పలేని ఎవ్వరితోనూ పంచుకోలేని ఎన్నో భావాలు

నన్ను దహించివేస్తున్నాయని
కారణం ఎవ్వరికి తెలియదు నాకే కాదు మరెవ్వరికి తెలియదు . . .

నీకేదో జరిగిపోతుంది నిన్ను ఎవరో దారుణంగా మోసం చేస్తున్నంటూ నాకెందుకు కంగారుగా ఉంది

ఎందుకో నాకు కంగారు..నీకేదో జరుగుతోందని..పిచ్చిగా ఆలోచిస్తున్నానా..?
ఎందుకో ఈ మద్యి నాకీ ఆలోచనలొస్తున్నాయి...నిద్రులో ఉలిక్కి పడి లేస్తున్నా
కారణం ఏంటో తెలీదు కంగారు ఎక్కువ అవుతోంది...తడబడుతున్నా..
కరెక్టే మెంటలేమో కదా.. అయివుండ వచ్చు..నాకూ అలాగే అనిపిస్తుంది
అలా ప్రతి క్షనం నీగురించి ఆలోచించి ఇలా అయిపోతున్నానా అనిపిస్తుంది
అందుకే బ్లాగ్ బ్లాక్ చేశాను... మనసు బాగోక..చెప్పుకోవడానికి నీవు అందుబాటులో ఉండవుకదా..?
ఇలా నాలో నేను మాట్లాడుకుంటున్నా.. నామనసే నన్ను తిడుతోంది ఏంటిది అని కాని....?
నా అలోచనలు నీవు మర్చిపోయావేమో ..నేన్ను ఇప్పటికి ప్రతిక్షానం తల్చుకుంటూనే ఉన్నా..?
ఒక్కోసారి మనిషిగా మరణించి ఆత్మాగా మారానా అని కూడా కాని మనిషినేనా నేను..
అప్పుడెప్పుడో నీవన్నావు చూశావు మెంటల్ అని అవును నిజమే నాకు మెంటలేమో..?
నీకేదో జరిగిపోతుంది నిన్ను ఎవరో దారుణంగా మోసం చేస్తున్నంటూ నాకెందుకు కంగారుగా ఉంది
ఎందుకిలా ఆచో చిస్తున్నానో తెలీదు... నిజంగా అనిపిస్తుంది..కారనం నీవు దూరం అవడమేమో..?
నాకేదో జరుగుతోంది ...నీవు క్షేమంగా ఉంటే చాలు కాని నాకు తెల్సేదెలా..?
అవకాశం లేదా..నీవెక్కడ నేనెక్కడ..అందనంతదూరంగా మనసుల్లో
నీవు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలంటే నేనేం చేయాలి..?
నీవు ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి..చెప్పవా...?
నాకెందుకీ కంగారు నిజంగా నీవు క్షేమంగా ఉన్నావా...ఎవ్వరైనా నిన్ను మోసం చేస్తున్నారా..?

వీడు మారడు..మళ్ళీ కొత్త పన్నాగం పన్నుతున్నాడు..?

వీడు మారడు..మళ్ళీ కొత్త పన్నాగం పన్నుతున్నాడు..?
నమ్మిన మనిషిని అనుమానించి .. తనను అనలేక ఎదుటి వాడి జీవితంతో ఆడుకున్నాడు
మళ్ళీ ఎక్కడ అనుమానం వచ్చిందో ఏమో మరో సారి అదే టైప్ లో డ్రామా మొదలు పెట్టాడు
పైకి మేధావిలా ఉంటూనే ఎదుటి వాన్ని ఎలా నాశనం చేయాలని చూసే ప్రబుద్దుడు..?
వాడి స్వార్దం కోసం ఎదుటి వాడు ఎమైనా సరే.. నాటకాలు మొదలు పెడతాడు..
పాపం కదాని వాడు చెప్పింది నమ్మామో అంతే..మనకు తెలియకండా మనచేత్తోనే కంట్లో పొడుచుకునేలా చేస్తాడు.
అప్పుడలా మోసం చేసి ..జీవితం నాశం అయ్యేలా చేసాడు... మళ్ళీ మరో నాటకానికి తెరతీస్తూ
కొత్త డ్రామా మొదలు పెట్టాడు..మనిషిని ఒక్కసారే నమ్ముతారని తెలీదు పాపం వాడికి
ఇంకా ఏ రేంజిలో జీవితం నాశనం అయ్యేలా చేస్తాడో ఏమో ..వాడి కళ్ళు చల్లబడాలంటే..?
మరోసారీ జీవితం బుగ్గిపాలు అయ్యేదాకా వదిలేలా లేడు ... వీడే మనిషిరా బాబు..?
నమ్మిన మనిషిపై అనుమానంతో..ఎదుటి వాని జీవితంపై పడి ఏడుస్తాడు..?
అంత నమ్మకం లేనప్పుడు ఆ మనిషిజీవితం నుండి దూరంగా పోవచ్చుగా..?
ఇన్ని డ్రామాలు... ఇన్ని ఏడుపులు .. అవసరమా.. ఏదోరోజు ఎదురు దెబ్బ తగులుతుంది
జీవితం విలువ తెలుస్తుంది..ఎదుటి వాని జీవితం తో నీకెందుకురా బాబు..?
ఎదుటి వానిజీవితం ఎలా నాశనం అయ్యేలా చూశావో అదేరేంజ్ లో నీవు త్వరలో అనుభవిస్తావు..?
ఇప్పటికైనా ఇలాంటి డ్రామాలు మానుకో లేదంటే .. సర్వనాశనం అవుతావు..

Sunday, May 6, 2012

కాలం ఐతే కరిగిపొతుంది కానీ, నేను మాత్రం అక్కడే పడి పాకుతున్నా!

పచ్చని పచ్చికబయళ్ళు
చల్లని పైరగాలులు
సెలయేటి సవ్వడులు
మంచు బిందువుల తళుకులు
విహంగాల అలాపనలు
కోకిలమ్మ కమ్మని కుహు కుహూ రాగాలు
చిలకమ్మల చిట్టి పొట్టి మాటలు
ప్రేమ పక్షుల కిలకిలలు
హంసలు ఒలకించే హొయలు
మయూరపు నృత్య సోయగాలు
చెవులపిల్లుల చిలిపి చేష్టలు
చిరు జింకల చెంగు చెంగు నాట్యాలు
చిరుఎండను కప్పేస్తూ పయనించే మేఘాలు
మెలమెల్లగా అలముకున్న చీకట్లు..

కలవరపడి చూస్తే నిజమే, కారుచీకట్లు
వెనుతిరిగి చూస్తే, కానరాని దారులు
నిశీధి వేళలో నిశ్శబ్ధ తరంగాలు నడుమ
జాబిలమ్మ కురిపించే పండువెన్నెల కోసమే ఈ నా ఎదురుచూపులు.

ఇంతకీ నేనలా ఎదురుచూస్తున్నది ఏరోజో తెలుసా!
నిండు అమావాశ్యలాంటి నిజజీవితంలో...

కనులు తెరిచి చూస్తే ఇవేమీ కానరావేమీ??

అదిగో... ఒకవైపు
పచ్చికబయళ్ళు బీటలు పడి ఆశగా ఆకాశం వైపు ఆశగా చూస్తుంటే
మృత జీవుల కళేబరాల మధ్య రాబందులు పైశాచిక నాట్యం చేస్తుంటే
సుడిగాలులు ఇసుక తిన్నెలను తెరలు తెరలుగా మోసుకొస్తుంటే
అల్లంత దూరంలో ఎండమావులు నను దాహార్తి తీర్చుకోమని ఆహ్వానిస్తున్నాయి

మరోవైపు
రణగొణ ధ్వనుల సంగీత సామ్రాజ్యంలో, స్వార్ధపూరిత సమాజం నను పిలుస్తోంది
రక్తం పంచిన బంధాలు తమ భాధ్యత తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాయి
మనసుని చంపుకొని జీవచ్చవంలా యాంత్రిక జీవనం గడుపమని
అందరిలా బంధాలకి బంధీ అయి బతుకుబాట నడువమని

అందరూ వున్న అనాధలా బంధాలకు బంధీనై బతుకుబాటపట్టాలా!
అష్ఠైశ్వర్యాలు కలిగిన నిత్యదరిద్రుడిలా జీవించలా!
పండువెన్నెల కోసం ఎదురుచూస్తూ, నా కలల లోకంలో బతకాలా!
లేక... చిరుదివ్వెనై చిరకాలం మిగిలిపోవాలా!

దారి తెన్ను కానరాక, నే అలుపెరుగక పరిగెడుతుంటే...
కాలం ఐతే కరిగిపొతుంది కానీ, నేను మాత్రం అక్కడే పడి పాకుతున్నా!
ఆశ నిరాశల నా ఈ అంతర్మధనం నుంచి వెలువడే ఈ ప్రశ్నల హాలాహలాన్ని
గొంతుమాటున బిగిసిపెట్టి, నా హ్రుదయాగ్నిని చల్లార్చుతు ..
ఏకాంతమను ముసుగులో ఒంటరిగా ఇంకా నే జీవించే వున్నా..
ఈ జనారణ్యంలో నిర్వీర్యుడినై...

నా హ్రుదయం లయ తప్పుతున్నట్టుగా వుంది,

ఓ చెలియా...!
కలనైనా చూద్దామని కనులు మూస్తే,
నీటి సుడుల మాటు నీరూపం కరిగిపోయింది,
జ్ఞాపకాల సుడిగుండం నను ముంచివేస్తుంది,
నా హ్రుదయం లయ తప్పుతున్నట్టుగా వుంది,
నా చెక్కిలి చెమ్మగిల్లుతోంది,

ఇంతలోనే..... ఎదో స్పర్శ,
నా చెక్కిలిని తడుముతూ..
నను ఓదార్చుతున్నట్టుగా వుంది,
అది నీవే కదా!

వేటాడే జ్ఞాపకాలు...నా హ్రుదయాంతరాలను కల్లోల పెడుతుంటే...

ఎదురుచూపుల ఏకాంతవాసాలు,
మరపురాని తలపుల అలఝడులు,
వెంటాడుతూ వేటాడే జ్ఞాపకాలు,
నా హ్రుదయాంతరాలను కల్లోల పెడుతుంటే...
మానుతున్న గాయం తిరిగి రేగి,
కంటికి నీరు కరువై రక్తాశృవులు చిందిస్తూ..
గొంతుకు గానం బరువై మౌనంగా రోదిస్తూ...
విల విల లాడే నా ప్రాణం పరిహసిస్తూ..
అంటోందీ...

ముఖానికి చిరునవ్వు పరదా కప్పుకుని,
మనసుకి మౌనంతో సంకెళ్ళు వేసుకుని,
నీ నీడ కూడా చేరలేనంత దూరమై,
తన వునికిని తెలువనీక, తనలోకంలో విహరించే నీ చెలి కోసమా!

నను ఇంతలా....!!! వేధిస్తున్నదీ అని.

ఈ మనస్సేనా neenu కోరుకున్నది

మనసుని తడిమి చూడాలని.. ఆ మనసులో స్థిరపడిపోవాలనీ విశ్వప్రయత్నాలూ చేస్తాం. ఆ మనసులో స్థానం దక్కించుకున్న క్షణం ఏదో తెలీని వెలితి వెంటాడడం మొదలవుతుంది. 'ఈ మాత్రం దానికా ఇంతగా తాపత్రయపడింది' అన్న భావనా నిరాసక్తతకు గురిచేస్తుంది. మనం వేచి ఉండడాన్నీ, ఉవ్విళ్లూరడాన్నీ ఆస్వాదించినంతగా అదే ఎదురుచూపు వాస్తవంగా మారిన క్షణాన్ని అణువణువూ ఆనందంతో నింపుకోలేం.

ఆత్మీయమైన మనిషిని కలవాలని, ఎన్నో ఊసులు పంచుకోవాలనీ అనుకున్నప్పటి ఊహలు.. అలా కలిశాక మాటలుగా మారక మూగబోతాయి. మనం అభిమానించిన వ్యక్తీ, మారలేదు.. వారి పట్ల మన ఆత్మీయతా మారలేదు. కానీ అగాధమంత శూన్యత ఆవరించేసి పొడిపొడి మాటలతో, ఎదుటి మనిషి కంట్లో మనల్ని వెదుక్కునే గందరగోళపు చూపులతో క్షణాల్ని యుగాలుగా గడిపేస్తాం.

మనకు తెలుసు.. మనం అలా కాదని ఉండదలుచుకున్నది! కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయత. మనిషి కళ్ల ముందు మాయమయ్యాక మళ్లీ మనల్ని మనం నిందించుకుంటూనే ఉంటాం.. 'ఈ క్షణం కోసం ఎదురుచూసి ఇలాగా ప్రవర్తించేది' అని! ఇక్కడ మన జీవితంలోని ప్రతీ అనుబంధానికీ ఈ పరిస్థితి వర్తిస్తుంది. ఎదుటి వ్యక్తి మనకు ఎలా ఆత్మీయులు అన్నది పక్కనబెడితే.. బాగా నచ్చిన ఏ వ్యక్తి విషయంలో అయినా మనం ఇలాగే ప్రవర్తిస్తాం.

ఓ మనిషి చుట్టూ తిరుగాడే ఆలోచనల్ని ప్రేమించినంతగా భౌతికంగా ఆ మనిషిని ప్రేమించమేమో! ఏ అనుబంధమైనా కానీయండి.. 'అవతలి వ్యక్తి మన వ్యక్తి' అనే ఆలోచన తెలీని వ్యామోహాన్ని పెంచుతుంది. ఎంతగా ఆ మనిషి గురించి ఆలోచిస్తామో అంతగా ఆ వ్యామోహం పెరిగిపోతుంది. ఆ మనిషి పట్ల వ్యామోహం ఆలోచనల్లో తిరుగాడుతున్న స్థితికీ.. అదే మనిషి భౌతికంగా దగ్గరగా ఉండే స్థితికీ మధ్య సారూప్యమే ఉండదు.

మన ఆలోచనలు అన్నీ ఎదుటి మనిషి మనస్సుని తడిమి చూసే ప్రయత్నం చేస్తాయి.. అదే మనిషి భౌతిక రూపం ఆ మనిషి మనస్సుతో సరిపోలినట్లు అన్పించక సందేహపపడతాం. 'మన మనసులో ఉన్న మనిషి ఈ దేహంలో ఉన్న మనిషీ ఒక్కరేనా' అన్న సంధిగ్ధతకి లోనవుతాం.

మన చుట్టూ తిరుగాడే మనుషుల భౌతిక రూపాలకూ, వారి మానసిక స్థితులకూ అస్సలు పోలికే దొరక్క గందరగోళానికి లోనయ్యే ప్రాణాలెన్నో! మనస్సు మనస్సుతోనే సావాసం చేస్తుంది. కానీ భౌతికంగా మాత్రం కలిసి దగ్గరగా గడిపేది దేహాలే. ఆ దేహాల్లో మనం సావాసం చేస్తున్న మనస్సు ఆనవాళ్లు పట్టుకోలేక మనిషికి మానసికంగానూ దూరమయ్యే అభాగ్యులు ఎందరో!

మనస్సులకూ, దేహాలకూ ముడిపెట్టకుండా దేనికది ప్రత్యేకంగా చూసే పరిపక్వత అలవడితే మనుషుల్ని ఆలోచనల్లో ఎంతగా అభిమానిస్తామో భౌతికంగా సాన్నిహిత్యంలో తచ్చాడేటప్పుడూ అంతకంటే ఎక్కువ అభిమానిస్తాం. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలూ, స్నేహాలూ, ప్రేమలూ.. వెదుకులాటల దగ్గర ఆగిపోకపోతే మధురమైన జ్ఞాపకాలకు లోటేం ఉండదు.

Saturday, May 5, 2012

ఆత్మను చంపి ...అంత్యక్రియలు చేస్తున్నాను

గుట్టలు గుట్టలుగా
శవాల కుప్పలు

తల లేని మొండెం
ఆత్రంగా తడుముకుంటోంది

ఆగిపోయిన శ్వాస
నిశ్శబ్ధంగా ఆవిరవుతోంది

మూతబడిన కనులు
రెప్పల్లోంచి చూస్తున్నాయి

తెరుచుకున్న నోరు
కొత్త వేదం పలుకుతోంది

తెగిపడిన చేయి
గుండె కోసం వెదుకుతోంది

రాబందుల రెక్కలతో
కాళ్లు ఎగురుతున్నాయి

చుట్టూవాలిన ఈగలు
మౌనగీతం పాడుతున్నాయి

దూరంగా నేను
మౌనంగా చూస్తున్నాను

ఆత్మను చంపి
అంత్యక్రియలు చేస్తున్నాను

దూరంగా చూస్తున్న రెంటు కళ్ళు..
నాకు ఎంతో నాకిష్టమైన ఆ రెండు కళ్ళు
ఎప్పుడు దూకుదామాని అంటున్న కంటి నిండా నీరు..

నేను తన నుంచి దూరం అయినందుకు...
వస్తున్న కన్నీళ్ళా..?

పీడా విరగడైంది ..?
అంటూ వస్తున్న ఆనంద భాష్పాలా..?

- నరేష్ ,నేను

ఎప్పటికి నువ్వు దక్కవని తెలిసినా నా వెర్రి మనసుకెందుకింత ఆవేశం..?

నాలో పొంగే భావాలే నన్ను వెంటాడి మరీ వేధిస్తున్నాయి.
నాతో సహకరించని నిజాలు ..
ఎప్పటికి నిజం కాని కలల నిప్పుల్లో నేను కాలిపోతుంటే..
నీతో గడిపిన ఆనంద క్షణాల అగ్నికి నే ఆహుతి అవుతుంటే..
నువ్వు మాత్రం నిశ్చింతగా అక్కడ ఎలా నిద్రపోతున్నావు..?
నీ తలపుల వలపు సెగను నాలో ఎందుకు రేపుతున్నావు.. ?
అయినా నా పిచ్చి కాకపోతే .....
నీపై ఇసుమంత కూడా లేని అధికారానికి నాకెందుకింత తాపత్రయం.. ?
ఎప్పటికి నువ్వు దక్కవని తెలిసినా నా వెర్రి మనసుకెందుకింత ఆవేశం..?

ఎందుకో తెలుసా...?
నే ప్రాణంగా ప్రేమించే నీ (నా) కన్నుల కోసం,
నన్ను నేనే మరిచిపోయే నీ చిరునవ్వుకోసం,


కేవలం నిన్ను తప్ప, నీ నుంచి ఇంకేమి ఆశించని నా ఈ ప్రయత్నం..
ఎప్పటికైనా నిన్ను కరిగిస్తుందని ఆశిస్తూ..

Tuesday, May 1, 2012

ఆగని కాలంకేసి భారంగా చూస్తూభారమైపోతున్న గుండెకేసి జాలిగా చూస్తూ

కళ్ళలో దాగిన చిన్న కన్నీటి బొట్టు జారిగుండె లోని ఎంత భారాన్ని దించింది...
బారం ఎక్కువై మళ్ళీ వస్తున్న కన్నీళ్ళు ఆగనంటున్నాయి..
ధారగా వస్తున్న కన్నీళ్ళకు దారెటో తెలియడం లేదు..
ఆ కన్నీళ్ళకు కారనం ఎవ్వ్రరో తెల్సినా..మౌనరాగం తప్పదు
ఈ రోజే కన్నీటి బరువు తెలుసుకున్నాను
ఇందరి ప్రియ నేస్తాల సమక్షం కూడాఇవ్వని ఓదార్పు
ఇవ్వడం నీవక్కదానివల్లే సాద్యిం అయింది
ఆ రోజే ఒక ఆత్మీయతను తెలుసుకున్నాను
ఇన్ని తెలిపిన ఈ కష్టం ఇపుడు నాకిష్టమైంది
ఈ రోజు నాకెంతో విలువైనదిగోల పెడుతున్న
మాటల గువ్వలను ఎగరనీయకుండా
భావాల రూపం లోగుండె లోనే బందించేస్తూఇంకా ఎంత కాలమిలా..?
మనసుకి స్నేహం మత్తు నిచ్చి నిద్రపుచ్చుతూ
మాటలకు మౌనం భాషనేర్పినవ్వుకుంటూఇంకా ఎంతకాలమిలా..?
ఆగని కాలంకేసి భారంగా చూస్తూభారమైపోతున్న గుండెకేసి జాలిగా చూస్తూ
చూస్తూ..చూస్తూ..చెలిని దూరం చేసుకుంటూ ఇంకా ఎంత కాలమిలా..?

మనసా మౌనం వీడవా..ఎన్నాళ్ళీ మౌనం..మరుజన్మదాకా ఎంటీ మిత్రమా

గల..గల మాట్లాడే కోయిల ఎందుకు మూగబోయిందో
ఆకోయిల గొంతు ఎవరు నొక్కారబ్బా...కాలమా ..కలికాలమా..?
ఎంజరిగింది మిత్రమా నేరమా .. అపచారమా..గ్రహచారమా..?
మనసులోని భావాలు ..బయటకు రావడం లేదా..కారణం..?
నిజం నిర్బయం అబయం..అన్నీ ఏమయ్యాయో..ఎమైంది..?
ఏమన్నా ఏమనుకున్నా సర్దుకుపోవాలన్న నీవే...దూరంగా ఎందుకో..?
కోయిల గొంతు కోటిరాగాలు ఇక వినలేనేమో అనిపిస్తుది..ఎందుకంటే..
ఏరుతువులో రాగాలొస్తాయి..ఎదురుచూపులో కాలం కరిగిపోతోంది
మనసా మౌనం వీడవా..ఎన్నాళ్ళీ మౌనం..మరుజన్మదాకా ఎంటీ మిత్రమా
కాలాన్ని కరిగిస్తూ..మౌనం ఎన్నాళ్ళో తెలీదు..కష్టంగా ఉంది చెప్పేందుకు
చేసేదేం లేదు మౌనం వీడే రోజుకోసం చకొర పక్షిలా ఎదురు చూడటం లేదంటే
ఇలాగే నీ మౌనంవీడే రోజు కోసం ఎదురు చూడటం తప్ప..
కాలం ప్రతిసారి కసి తీర్చుకుంటుంది అంటే ఇదేనేమో కదా మిత్రమా