Monday, December 3, 2007
మౌన భాష నాకు రాదు
కళ్ళతో కబుర్లు చెప్పకు నేస్తంమౌన భాష నాకు రాదుఅలా నవ్వుతూ...అర్ధాలు వెతకమనకు నేస్తంవేదాలు నాకు అర్ధం కావుఏకాంత వనం లోఆమె - నేనుమౌనం గల గలామాట్లాడేస్తుందిమనసులు ఏమి అర్ధం చేసుకున్నాయోకన్నులు ఏమి భాష్యం చెప్పుకున్నాయోచిత్రంగా..చిరునవ్వుల అంగీకారాలు తెలుపుకున్నాయి చల్లని చీకటి తెచ్చిన చక్కటి చుట్టాన్ని చూస్తుంటేచప్పున మెదిలిన నచ్చినవాడి రూపంగుప్పెడు మల్లెల వాసనలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటేవెచ్చని తలపులు కప్పుకున్న హృదయంచెప్పలేని పరవశంలో చిక్కుకుని చిరునవ్వులొలికిస్తుందిఅలారం మోతలతోఉలికిపాటు మెలకువలుఅలసిన మనసులతోకలలులేని కలత నిదురలుపోగొట్టుకుంటున్నది పోల్చుకోలేనిపొందుతున్నది పంచుకోలేనిభారమయిన బిజీ జీవితాలుత్రుప్తి తెలియని చింతా చిత్తాలుపగలంతా క్షణాలకు విలువకట్టుకుంటూరాత్రంతా ఆనందాలకు అర్ధాలు వెతుక్కుంటూ....ఇక ఇంతేనా ఈ తరాలుమార్పు తెచ్చేనా భావితరాలు!