నీ లేఖలో ని ప్రతీ వాక్యంఎన్ని కబుర్లు చెబుతుందోనిశ్శబ్ధం గాఎన్ని జ్ఞాపకాలను తడుతుందోఇరికించి మరీ రాసే అక్షరాలుఎంత ఆప్యాయతను చూపిస్తాయోచదివిన ప్రతీ సారీ మదిలోఎన్ని రంగులను నింపుతున్నాయోఅల్మారాలో,బట్టల మడతల్లోపరుపు క్రింద,ఫొటోల వెనుకఎక్కడ చూసినా నీ అక్షరాలేవాటి తాలూకూ పరిమళాలేఎప్పుడూ నీ ఉత్తరాలతో పాటూనా దగ్గరగా నువ్వు-స్నేహం తోనీ చిరు నవ్వు