కళ్ళలో దాగిన చిన్న కన్నీటి బొట్టు జారిగుండె లోని ఎంత భారాన్ని దించింది...ఈ రోజే కన్నీటి బరువు తెలుసుకున్నానుఇందరి ప్రియ నేస్తాల సమక్షం కూడాఇవ్వని ఓదార్పు ఒక్కరి స్పర్శ అందించింది...ఈ రోజే ఒక ఆత్మీయుడిని తెలుసుకున్నానుఇన్ని తెలిపిన ఈ కష్టం ఇపుడు నాకిష్టమైందిఈ రోజు నాకెంతో విలువైనదిగోల పెడుతున్న మాటల గువ్వలను ఎగరనీయకుండా భావాల రూపం లోగుండె లోనే బందించేస్తూఇంకా ఎంత కాలమిలా..?మనసుకి స్నేహం మత్తు నిచ్చి నిద్రపుచ్చుతూమాటలకు మౌనం భాషనేర్పినవ్వుకుంటూఇంకా ఎంతకాలమిలా..?ఆగని కాలంకేసి భారంగా చూస్తూభారమైపోతున్న గుండెకేసి జాలిగా చూస్తూచూస్తూ..చూస్తూ..చెలిని దూరం చేసుకుంటూఇంకా ఎంత కాలమిలా..?