నన్ను మాట్లాడనివ్వు...లోలోన అదిమిపెట్టుకున్న ఎన్నో ఆశలుఆనందాలు,కన్నీటి సవ్వళ్ళను ఇప్పటికైనా నీ చెవిని తాకనివ్వు !చాలు...ఈ మూగ రోదనింక చాలుగుండె పాటను గొంతులో ఆపేసినఆనవాళ్ళు చెరిగిపోయేలాఒక్కసారి కేక పెట్టనివ్వు...ఇకనైనా నన్ను మాట్లాడనివ్వు!వర్షించడానికి సిద్దం గాఎన్నేళ్ళ భావాలో?ప్రవాహం లాఎన్నెన్ని కన్నీళ్ళో?