Monday, December 3, 2007
ఒంటరితనం తో జంటకడుతూ ఎన్నాళ్ళిలా
ఒంటరితనం తో జంటకడుతూ ఎన్నాళ్ళిలాఊహలకు ఊసులు చెప్పుకుంటూ ఎన్నాళ్ళిలాపోగుపడిన ఎన్నోభావాలను నీతో పంచుకోవాలనికరిగిపోయిన క్షణాలను నీ సమక్షంలో తిరిగిపొందాలనిచెరిగిపోయిన చిరునవ్వుని నీ చెలిమితో మరలా చిత్రించాలని..ఎన్ని ఆశలో తెలుసా...నీజ్ఞాపకం తాలూకూ ఫలితం...ఈక్షణం నా చెక్కిలిపై జారుతూవుందిమది నిండిన ఎన్నో మధురానుభూతులనుఅప్పుడప్పుడూ ఒలక బోసుకునిఎంతో ఇష్టం గా తిరిగి గుండె అరల్లోసర్దుకుంటూ వుంటానుపాత పుస్తకాల పుటల్లోని నెమలీకలని..దాచుకున్న ఉత్తరాల మడతల్లోనిమనసుల రూపాలని..అపురూపంగా పరామర్శిస్తూవుంటానుపట్టలేని భావోద్వేగాలుయదను కుదిపేస్తూవుంటేవాటిని కన్నీరుగాను,కవితలుగాను మలచుకుంటూ..తిరిగిరాని బాల్యాన్నికన్నుల ముందు ఆవిష్కరించుకుంటూ వుంటాను