Wednesday, December 5, 2007
ఒక్కసారి కనులు మూసుకుని
చాలా మంది అంటారుఒక్కసారి కనులు మూసుకుని జ్ఞాపకాల తలుపులు తెరుచుకో అని!కానీ నేను...నిను తలచినప్పుడల్లానువు పంపిన ఉత్తరాలు తెరుస్తానుకనులు మూస్తే నీ రూపం మాత్రమే కనిపిస్తుందిఅదే ఉత్తరాలు తెరిస్తే నీ మనసుని చూపిస్తాయి మరి!అక్షరాల్లో దాగిన అనుభూతులనికళ్ళతో ఏరుకుంటూ..పాత అనుభవాలనుకొత్తగా పరిచయం చేసుకుంటూ..మడిచిన ఉత్తరాల్లో దాగినఎన్నో తీయని స్మృతులనివెచ్చగా అనుభవిస్తూవుంటానుఎదురుచూపులో ఎన్ని ఋతువులు కరిగిపోయాయో నా కన్నీళ్ళల్లో ఎన్ని కలలు జారిపోయాయోమనసు మెదడు తో యుద్దం చేస్తుందిఫలితమే ఈ నిదురలేని రాత్రిఅయితేనేమిలే...పారిపోయిన కాలాన్ని పట్టలేనని తెలుసుకున్నానుఅందుకే ఇప్పుడునా పుస్తకాన్ని సరికొత్తగా ప్రారంభిస్తున్నానుఓ నిరాశా...ఈ రాత్రి మాత్రమే నీదిసమస్తం నీకు అర్పించిమోడునై నిలుచున్నానుఅనుభూతుల మంచుపూలుకొమ్మకొమ్మన పూచిఅవికూడానీ ఒడి చేరాలని వేచిచూస్తున్నాయినువ్వు తెచ్చే చైత్రం లోచిగురించాలని ఆశగా ఎదురుచూస్తున్నాను నేస్తం