మనసులో కలుగుతున్న భావాలెన్నో ఏ రూపం లేకుండా అలానే గతిస్తున్నాయినా అక్షరాలు కొంత కాలం గా అజ్ఞాతం చేస్తున్నాయి మరిభావానికి రూపాన్నిచ్చే భాషఆమె మాయలో పడి లిపిని మరచిపోయిందిప్రేమ మత్తు అటువంటిది మరిభావాలకి రూపాన్నిచ్చి గుండెబరువు దించుకునే క్షణం ఎప్పుడొస్తుందో మరి?నన్ను తాకిన అ తీయని భావన నీ వరకూ చేరలేదా?ఇద్దరమూ ఒకే దారిలో పక్కపక్కనే పయనిస్తున్నాము కదా...నా స్నేహపు కొమ్మకి ప్రేమ చిగురులు తొడిగాయినువ్వింకా మోడుగానే వున్నావేమిటి?ఇద్దరిని వయసు వసంతం ఒకేసారి వరించింది కదా...