మనసు పూల గంపను
అటూ ఇటూ కదిల్చి
రాలిపడిన జ్ఞాపకాల తట్టలో
నీ గులాబి
చేతుల స్పర్శతో
నన్ను నేను
మైమరచిన నాకు
చెప్పలేనంత
భారాన్ని గుండెలో మోపి
ఎదలో గుచ్చిన నీ తలపుల్లో
నా గతాన్ని గాయాలమయం చేశావుగా
ఎప్పటికీ ఎదురు గానీ
నీ ఆ చిన్న పలకరింతకు కూడా
నా సమాధానం తో పనిలేకుండా
మనసు బందంలో సంధించే భిగువులొ
గట్టిగా బిగుసుకుపోయిన
నా ప్రేమను
నిన్నటి గాలానికి
రేపటి కాలాన్ని
వేలాడ దీశాను
ముక్కలు ముక్కలుగా
విరిగి పడిపోతున్న
కాలపు ముక్కల్లో
వెతికినా కనపడవని తెలిసీ
అమాయకంగా ఇంకా వెతుకుతూనే వున్నా
అటూ ఇటూ కదిల్చి
రాలిపడిన జ్ఞాపకాల తట్టలో
నీ గులాబి
చేతుల స్పర్శతో
నన్ను నేను
మైమరచిన నాకు
చెప్పలేనంత
భారాన్ని గుండెలో మోపి
ఎదలో గుచ్చిన నీ తలపుల్లో
నా గతాన్ని గాయాలమయం చేశావుగా
ఎప్పటికీ ఎదురు గానీ
నీ ఆ చిన్న పలకరింతకు కూడా
నా సమాధానం తో పనిలేకుండా
మనసు బందంలో సంధించే భిగువులొ
గట్టిగా బిగుసుకుపోయిన
నా ప్రేమను
నిన్నటి గాలానికి
రేపటి కాలాన్ని
వేలాడ దీశాను
ముక్కలు ముక్కలుగా
విరిగి పడిపోతున్న
కాలపు ముక్కల్లో
వెతికినా కనపడవని తెలిసీ
అమాయకంగా ఇంకా వెతుకుతూనే వున్నా