. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, September 11, 2015

అందరూ మంచోళ్ళే ...అందరికీ నేను తప్ప

నాలోకి నేను కాకుండా
నా నించి నేను దూరంగా..
నిశ్చలభయాల నిర్వికారాన్ని
ముక్కలుగా వేరుచేసి విసిరేస్తూ
తేలికై పోవాలి..
ఊహల్లో విహరిస్తున్నా
నన్ను నేను కాల్చుకుంటున్నా

జ్ఞాపకాల శకలాలనీ ఏరుకొంటూ
సుదూర స్వప్నాల కోసం 
ఎదురు చూస్తూ 
పగటిపూట నీతలపులతో 
రాత్రుల్లు నీజ్ఞాపకాలతో 
నన్నూ నేను 
మాయచేసుకుంటూ బ్రతికేస్తున్నా  
ఇంతా జరుగుతున్నా
మనసు మాత్రం 
ఏమీ చెప్పా పెట్టాకుండా
వెన్నెల రెక్కలు తొడుక్కుని
నీ యౌవనవనాల వైపు 
వెళ్ళిపోతూంటుంది…
అయినా ఎక్కడో వెలితి..
మనసంతా సూన్యం 
శూన్యంగా మిగిలిపోదు
పరిమళాల సంగీతం వినిపిస్తూన్నా
నాలో ఇంకా విషాదం 
సెగలు వస్తూనే వున్నాయి
ఎవరికీ చెప్పలేని 
చెప్పుకోలేని వేదాంతం 
నాలో నేను 
కుమిలిపోతున్న క్షనాలివి 
నేను నమ్మిన మనుషులు తప్ప 
అందరూ మంచోల్లే 
అందరికీ నేను తప్ప
మంచోళ్ళే అందుకే ఊహా ప్రపంచానికి 
నాలోని నన్ను హింశిచుకొంటూ 
రక్తాక్షరాలు రాసుకొంటూనే ఉన్నా