అన్నీధ్వంసం చెయ్యాలనిపిస్తుంది. ఒకరి ఆనందం కోసం నా హృదయాన్ని దొలిచేస్తున్న విద్వేషాన్ని, ఒక శూన్యమైన, అబధ్ధపు చిరునవ్వునొకదాన్ని ముఖానికి పులుముకుని నడవవలసి వస్తుంది. ఇంతకన్న దారుణమైన, హేయమైన స్థితి ఇంకేముంటుంది?.. ఇక్కడ మనసంతా విషాదమే. గుడెనిండా తనను .. తన చిరునవ్వునే నింపుకొని అసలైన ఓ నిజంకోసం కల్లుమూసుకొని నిన్నే తలస్తూ ప్రయత్నిస్తే వింత ప్రపంచం ఆవిష్కృతమౌతుంది. ఈ ప్రపంచాన్ని ఇక్కడే మరిచిపోదాం. గతకాలపు వెతలు, ఎదురుచూస్తున్న ఆనందపు ఘడియల ఉత్సుకతను ఏమాత్రం తగ్గించలేవు. నిజంలో కాలిపోతున్న గతం సాక్షిగా అన్ని అబద్దలేకదా కటిక దరిద్రుడైనా, నీచాతినీచుడైన బానిస అయినా, మరణదండన విధించబడి నేరస్థుడైనా, వాడి బాధని కన్నీళ్లతో కడుక్కునే వీలుంటుంది. కానీ, నాకు అటువంటి అవకాశం లేదు. బాధాకరమైన బలహీనతలతో- నేలకు ఒదిగి ఉండడం కష్టం. అంతకు మించి నన్నుచుట్టు ముట్టి ఉన్న ఈ అందాలూ, తళతళలూ నన్నింకా విచారగ్రస్తుణ్ణిచేస్తున్నాయి. నా దౌర్భాగ్యం . నా హృదయం ఒంటరిగా విచారాన్ని వెలిగ్రక్కనూలేదు..నామీద నామీద నాకే అసహ్యం వేసే ప్రతినిమిషాన్ని నేను విషాద గులికలుగా చేసుకొని మ్రింగుతూ నవ్వలేక నవ్వురాక నవ్వినట్టు నటిస్తుంటే ... లేని ఆనందాన్ని మొకం మీద పులుముకొని ష్టేజీమేద నటుది మల్లే ప్రతిక్షనం లేని హావభావలను మొహం మీద పులుముకొని ఆనందం నటించడం ఏంత కష్టమో