. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, July 5, 2015

ఇప్పుడు నా సమాదినుండి నేను మాట్లాడుతున్న

నా చుట్టూ సాలెగూళ్ళు
అల్లుతున్న మృగాలను 
మించిన మనుషులు
ఉచ్చనీచాలు లేవు...
తాను నవ్వాలంటే 
ఎదుటి మషిలో కన్నీళ్ళు 
తెప్పించే నీచులు 
కుట్టి  కుట్టి రక్త దాహం తీర్చుకునే 
కీటకాల జాతి అనుకుంటా
ఎదుటిమనిషిని ఏడ్పించి నవ్వే జనాలు  

  
ఎవడొప్పుకుంటాడు
బతికుండగానే
బలిచ్చేందుకు
నమ్మకమనే  కత్తులతో 
కుత్తుకలు కోసే జనాలు తప్ప

గుండెలో గుచ్చుకున్న మూలుగు
నమ్మిన నమ్మకం  పగిలిన ధ్వని 
అగ్ని పర్వతమై దహిస్తుంది 
నమ్మిన నిజాలు కల్లెదురుగా 
కాలి బూడిదచేసి వికటాట్ట 
హాసం చేసున్న  మనుషులు
వేకువలో బ్రతికుండగానే
నిలువునా చంపి పీక్కుతినే 
రాబందులు నా చుట్టు వున్న మనూషులే  

ఎదో చేయ్యాలనుకున్న 
అందరూ బాగుండాలనుకున్నా 
అందుకే నన్ను ఊభిలో నెట్టి 
నా సమాదిపై ఆనంద నిలయాన్ని 
నిర్మించుకొని ఆనందిస్తున్న మనుషులు 
నా లైఫ్ లోకి ప్రవేసించిన అందరూ ఇలానే చేస్తున్నారు
అందరూ మనసులేని మనుషులే 
స్వార్దపు జీవులు 
వాల్లు బాగుంటే చాలు 
అనుకునే కుంచితత్వపు మనుషులు 

దేవుడున్నాడా నమ్మినందుకు దేవుడు 
వాళ్ళవైపే వుండి నవ్వుతున్నడేందుకో  

నా కన్నీటి శాపం వాల్ల బిడ్డలకు తగలకూడదు  
వాళ్ళూ సల్లగా వుండాలి ..
వాల్ల బిడ్డలు సంతోషం గా వుండాలి 
ఇది నిర్జీవంగా మారిన నా హృదయ ఘోష 
ఎందుకంటే నేను మనిషిని 
మానాన్న పెంపకం
నీకేమైనా పర్లేదు 
నిన్నెవరు మోసం చేసినా 
వాల్లందరు బాగుండాలని కోరుకో అన్నాడు 
తల్లిదండ్రుల పెంపకమే మనునుషులను ఇలా చేస్తుంది
ఆయన్ నాతొ లేకున్నా ఆయన ఆశయం అలానే వుంది 
అందుకే నిర్జీవంగా కూడా ఇదే కోరుకుంటూన్నా 
ఎందుకంటే నన్ను ఎప్పుడో సమాధి చేశారు 
ఇప్పుడు నా సమాదినుండి నేను మాట్లాడుతున్న