చీకటి పడగానే నన్ను పకరిస్తుంది
అప్పటిదాక చుట్టూ జనాలను చూసి
అందరూ ఉన్నారని మిడిసి పడతావేమో
అని ఏమరపాటు లోంచి
చొరవగా బయటకి చొచ్చుకొస్తుంది
నాలో దాగి ఉన్న ఒంటరితనం
చీకట్లో నిద్ర రెప్పల కింద మెలకువని
నీ జ్ఞాపకాలు రగిలించి తనెళ్ళిపోయాక
చంద్రుడ్ని మింగే తొలి
పొద్దు కోసం యుగాల్ని లెక్క పెడుతూ
కదలని గడియారం ముళ్ళు
నేను నాలోని జ్ఞాపకాలతో
అంతర్యుద్ధం చేస్తూ
ఒంటరిగా మిగిలిపోతాను
ఎందుకంటే నాలోని ఒంటరితనం
ఎటెల్లొపోతుంది ..నాకు నేను ఎప్పుడు
ఒంటరినేగా ..ఓడినా నిజాన్నేగా
కదూ నిజమే కదూ ..ప్లీజ్ చెప్పవూ
గుండెలో భారమైపోయిన
ఆప్యాయత.. అనుగారం
ఎక్కడో చోట చూడటం
అవి దగ్గరగా లేనందుకు
బిగ్గరగా నాలో నేను రోదించడం
దగ్గర కాలేక పోయిన దూరపుతనాలో
చెంపలపై కన్నీటి చారల ఆనవాల్లు
వెన్నెల వెలుగుల్లో
ఎండిపోయిన రక్తపు చారికల్లే
ఎబ్బెట్టుగా గతానికి
ప్రతినిదిలా కనిపిస్తూనే వుందిగా