పోరాటాల అడుగుల మీద నడిచి వెళ్తున్న
నన్ను నేను కాపాడుకోళెఖా
నేనేంటో తెల్సిన మనుషుల
అవమానపు పెదాల శబ్దాలు
వైనలేక మౌనంలో ఒదిగిపోయా
గతంలో ఎన్నడూ నిశ్శబ్దం నాదరి చేరలేదు
ఇప్పుడు నిశ్శబ్దం నా ఊపిరి
నిశ్శబ్దం నా నడక
గెలుపు గాయంగా మారిన క్షనంలో
ఓటమిని మౌనంలో దాచుకున్నా
సముద్రం ఎన్నడైనా నిశ్శబ్దమవుతుందా?
నేను సముద్రాన్ని.. సముద్ర కెరటాన్ని
సముద్రంలో తూర్పు దిక్కు పయనిస్తున్న
ఉధృతంగా ఊగి, వూపి, చెలరేగి,
కొంత సమయం మౌనం వహిస్తుంది
నా ప్రమేయంలేకుండా నాలో
కలలన్నీ అలలై కొట్టుకుపోతున్నాయి
ఏంటీ ఇప్పుడూ మొఊనంలో
నిశ్శబ్దమయిన సముద్రాన్ని చూచి
సముద్రం నిరాశలో వుందని
నాలో ఇప్పుడదే మిగిలి వుందని తేలింది
నిజం ఏప్పటికీ నిజమే ..అదీ నిశ్శబ్దంగా
నన్ను నేను కాపాడుకోళెఖా
నేనేంటో తెల్సిన మనుషుల
అవమానపు పెదాల శబ్దాలు
వైనలేక మౌనంలో ఒదిగిపోయా
గతంలో ఎన్నడూ నిశ్శబ్దం నాదరి చేరలేదు
ఇప్పుడు నిశ్శబ్దం నా ఊపిరి
నిశ్శబ్దం నా నడక
గెలుపు గాయంగా మారిన క్షనంలో
ఓటమిని మౌనంలో దాచుకున్నా
సముద్రం ఎన్నడైనా నిశ్శబ్దమవుతుందా?
నేను సముద్రాన్ని.. సముద్ర కెరటాన్ని
సముద్రంలో తూర్పు దిక్కు పయనిస్తున్న
ఉధృతంగా ఊగి, వూపి, చెలరేగి,
కొంత సమయం మౌనం వహిస్తుంది
నా ప్రమేయంలేకుండా నాలో
కలలన్నీ అలలై కొట్టుకుపోతున్నాయి
ఏంటీ ఇప్పుడూ మొఊనంలో
నిశ్శబ్దమయిన సముద్రాన్ని చూచి
సముద్రం నిరాశలో వుందని
నాలో ఇప్పుడదే మిగిలి వుందని తేలింది
నిజం ఏప్పటికీ నిజమే ..అదీ నిశ్శబ్దంగా