మనస్సు నిండా చికాకులతో
మరొక ఉదయంలో కల్లు తెరిచి న నాకు
రొటీన్ గా తప్పూలు ,
ఒప్పుల తీర్పులూ
నిరాశలు , నిస్ర్పుహలు
అవమానాలు , ఆందోళనలు
అన్నిటిని గుండెల్లో నింపుకొని
అవే గుండె గదులకు గాయం చేస్తున్నా
ఏం చేయలేక వైరాగ్యంతో
వున్న నన్ను చూసి
అక్షరాలు కూడా వెక్కిరిస్తున్నాయి
మరొక ఉదయంలో కల్లు తెరిచి న నాకు
రొటీన్ గా తప్పూలు ,
ఒప్పుల తీర్పులూ
నిరాశలు , నిస్ర్పుహలు
అవమానాలు , ఆందోళనలు
అన్నిటిని గుండెల్లో నింపుకొని
అవే గుండె గదులకు గాయం చేస్తున్నా
ఏం చేయలేక వైరాగ్యంతో
వున్న నన్ను చూసి
అక్షరాలు కూడా వెక్కిరిస్తున్నాయి
నా రక్త నాలాల్లొ రక్తం
పరుగులు పెడుతూనే వుంది
దారితెలియని బాటసారిలా
పైనేమిటో, లోనేమిటో తెలియని రహస్యంలా
నాలో నల్లటి ముసుగొకటి
మన మనసులను కప్పేసింది
ఎదో కావాలి ఏం కావాలో తెలీదు
చావుకి బ్రతుక్కి మధ్యి
ఇరుక్కున జ్ఞాపకాలు
నవ్వాలో , ఏడ్వాలో
తెలియని వెర్రితనం
ఏడ్వటానికి ఓపికలేక
నవ్వే అవకాశమూ లేక
నడుస్తునే వున్నా
ఈ వింత మనుషుల మద్య
వీల్లందరూ మనుషుల మని
పిలిపించుకునే మృగాలు
నీతీ జాతి లేని
స్వార్ద జీవులు
తమ స్వార్దం కోసం
అమ ఆనందంకోసం
ఎదుటి వాల్ల జీవితాలనే
బలులు ఇచ్చే కసాయి తలారులు
పైకి అందంగా నవ్వుతూ
నిజాలని స్వార్దం కోసం
నిలువునా తగులబెట్టే నీచులు
ఈ మనుసులు
దాదాపు అందరూ అంతే
ఒక్కరు నిజాయితీ గా
మనసున్న వాల్లే నాకు
కంపించడంలేదు
వీల్లను పుట్టించిన
ఆ తల్లిదండ్రులకైనా తెలుసోలేదో
ఆనిజం వీల్లు మనుషులు కాదని
నిజం ఎప్పుడు పచ్చి నెత్తురులా
వెగటుగా వెచ్చగానే వుంటుంది మరి