పదహారేళ్ళ ప్రాయరాకుండానే
పరువాల విలువ తెలియని క్షనాల్లో
మనిషి తయారు చేసిన డబ్బుకోసం
కాలే కడుపుకోసం కన్నవాల్లకోసం
కన్నీళ్ళను దాచుకొని
కన్యత్వానికి ..కామానికి తేడాతెలియని
వయస్సులో అందరిలా ఆడుకొకుండా
రాకుమారుడి కల్లలో తేలిపోకుండా
చికటీలో మగ్గే చిరుమొగ్గల కోసం
చేయి చాచి ఆదుకునే నాదుడే లేడే
సమాజం లో నీతులు వల్లించే
రాజకీయనేతల కామానికి
బలయ్యే మొదటి చిన్నారి
ఈ పసిమొగ్గే
సమాజమా ఈ దారునాలు చూడలేను
అందుకే హంతకుడిగా మారాలనుకుంటున్నా
ఇలా పసిమొగ్గలను చిదిమే
ప్రతివాడిని అడ్డంగా నరికేస్తా
నా ప్రాణాన్ని ఫనంగా పెట్టి
వంద జీవితాల వెలుగుకు కారనం కావాలని
అసలైన న్యాయంకోసం ఈ పని చేస్తున్నా
ఇప్పుడు న్యాతదేవత కల్లు తెరుస్తుంది
అమాయక ఆడపిల్లలను ఏమార్చే వారికోసం
నన్ను దోషిని చేస్తుంది
నన్ను హంతకుడిగా శిక్షిస్తుంది
అసలైన దోషులు ..బైట నేను మాత్రం
జైల్లో మగ్గాల్సిందే ...
ఎందుకంటే నేను మంచిపని చేస్తున్నా
అది న్యాయానికి నచ్చక కాదు
న్యాయదేవత కల్లకు గంతలు కట్టారుకదా