అన్ని శబ్దాలు నిశ్శబ్దంలోకి
ఆవాహన అయిపోయాయి
పొరలు పొరలుగా జారిపోతున్న నిసర్గరాత్రి!
మృత్యుధ్వజంపై అచ్చేసిన
బొమ్మ నాదే
దేవుడు చేసిన బొమ్మను కదా
అదేవు డే చిత్ర విచిత్రంగా
ముక్కలు చేస్తున్నాడు
మనసును రంపపు కోతకోసాడు
ఇప్పుడు గుండెకు తూట్లు పొడుస్తున్నాదు
నిన్నటికీ రేపటికి మద్యి ఇరుక్కొని
ఇంకా నలిగిపోతూనే వున్నా
గతం చురకత్తినా
నా గొంతుకను కోస్తూ
పచ్చి నెట్టురు తాగుతోంది
ఆయాస ప్రయాసలలో కాలం నన్ను
కొండ చిలువై మింగేస్తోంది!
ఆ కాస్తా మిగిలిన క్షణాలను
బతికిన క్షణాల్లోకి ఒంపుకుంటూ,
బ్రతకాలని లేకున్నా
బ్రతుకు నీడ్చలేక
మౌనంగా రోదిస్తూ
బ్రతుకుతున్నా శవంలా
నీవు రావు రాలేవని తెలిసి
అట్టానే నిరీక్షించనూ?
మృత్యుకళికలోకి..
వెల్లి నన్ను నేను కప్పెసుకుంటున్నా
కాలేందుకు కట్టెగా మారాను
అగరొత్తుల పొగను వెలిగించింది
సమాధిలోకి..
అత్తరు పరిమళాల్లో
ప్రారంభమవుతుందనుకున్నావా?
తలదగ్గర పెట్టీన దీపం ఏప్పుడు
ఆరిపోదామాని చూస్తుంది
నన్ను కాదని వెల్లిన నిజాన్ని చూడలేక
వెర్రివాని నవ్వులా జనం లోలోన
విరగబడి నవ్వుతూ...
పైకి మాత్రం ఉదాసీన ముఖాల ముసుగేసుకొని,
నాలుక చివరన వ్రేలాడే మాటల్లో
చివరి కన్నీటి చుక్కను జారుస్తారు
అయినా.. నేను మాత్రం అక్షర నక్షత్రమై
విషాద రాతలు రాస్తూ
నేనేంటో తెలియని క్షనాల్లో
నన్ను నేను మర్చి ఏమర్చి
నిర్జీవంగా మరిపోయా
గతాన్ని గెలిపించలేని ప్రస్తునం సాక్షిగా
ఆవాహన అయిపోయాయి
పొరలు పొరలుగా జారిపోతున్న నిసర్గరాత్రి!
మృత్యుధ్వజంపై అచ్చేసిన
బొమ్మ నాదే
దేవుడు చేసిన బొమ్మను కదా
అదేవు డే చిత్ర విచిత్రంగా
ముక్కలు చేస్తున్నాడు
మనసును రంపపు కోతకోసాడు
ఇప్పుడు గుండెకు తూట్లు పొడుస్తున్నాదు
నిన్నటికీ రేపటికి మద్యి ఇరుక్కొని
ఇంకా నలిగిపోతూనే వున్నా
గతం చురకత్తినా
నా గొంతుకను కోస్తూ
పచ్చి నెట్టురు తాగుతోంది
ఆయాస ప్రయాసలలో కాలం నన్ను
కొండ చిలువై మింగేస్తోంది!
ఆ కాస్తా మిగిలిన క్షణాలను
బతికిన క్షణాల్లోకి ఒంపుకుంటూ,
బ్రతకాలని లేకున్నా
బ్రతుకు నీడ్చలేక
మౌనంగా రోదిస్తూ
బ్రతుకుతున్నా శవంలా
నీవు రావు రాలేవని తెలిసి
అట్టానే నిరీక్షించనూ?
మృత్యుకళికలోకి..
వెల్లి నన్ను నేను కప్పెసుకుంటున్నా
కాలేందుకు కట్టెగా మారాను
అగరొత్తుల పొగను వెలిగించింది
సమాధిలోకి..
అత్తరు పరిమళాల్లో
ప్రారంభమవుతుందనుకున్నావా?
తలదగ్గర పెట్టీన దీపం ఏప్పుడు
ఆరిపోదామాని చూస్తుంది
నన్ను కాదని వెల్లిన నిజాన్ని చూడలేక
వెర్రివాని నవ్వులా జనం లోలోన
విరగబడి నవ్వుతూ...
పైకి మాత్రం ఉదాసీన ముఖాల ముసుగేసుకొని,
నాలుక చివరన వ్రేలాడే మాటల్లో
చివరి కన్నీటి చుక్కను జారుస్తారు
అయినా.. నేను మాత్రం అక్షర నక్షత్రమై
విషాద రాతలు రాస్తూ
నేనేంటో తెలియని క్షనాల్లో
నన్ను నేను మర్చి ఏమర్చి
నిర్జీవంగా మరిపోయా
గతాన్ని గెలిపించలేని ప్రస్తునం సాక్షిగా