ఒంటరిగా మిగిలిపోయాను
విశాల ప్రపంచంలొ
విరిగిన మనసు ముక్కల నేరుకొని
నేనేంటో తెలియని జన సమూహంలో
ఒంటరిగా మిగిలా ..కాదు కాదు మిగిలేల చేసింది
ఓటమిని నామొహాన పడేసి
మనసులేని మనుసులే నన్నిలా చేశారు
నిజంలో దాగున్నా అనుకున్నా
అబద్దమనే నకిలీ మెరుగులకోసం
పరుగులు పెడుతున్న
ఆ మనిషిని చూసి నవ్వుకొంటున్నా
చేజారిన కొన్నిని కన్నీటితో తడిసిన క్షణాలను
పట్టుకొని ఇంకా మురిసిపోతూనే వున్నా
తను దూరమై సంత్సరాలు గడిచినా
ఇంకా పక్కనే వున్నట్టు వెర్రి ఆలోచనలు
తను నా నుండి దురం అవుతూ
నాలో విసిరేసిన విషాదంతో కాలం వెల్లదీస్తున్నా
అస్పష్టమౌతున్న చూపులతో వెనుదిరగ్గానే
నేను చితిమీద తగలబడుతున్న
కట్టెగా మారిపోయాను
తనెళ్ళిపోయాక నాలోంచి
ఆవిరైపోయిన ఆనందం
ప్రపంచంలో ప్రతీ ఒక్కరి పెదాలపై
మళ్ళె మొగ్గలై విరుస్తూనే వుందిగా
ఒక్క నా పెదలపై తగలబడే విషాదం
ప్రతిక్షనం నన్ను వెక్కిరిస్తూనే వుంది
విశాల ప్రపంచంలొ
విరిగిన మనసు ముక్కల నేరుకొని
నేనేంటో తెలియని జన సమూహంలో
ఒంటరిగా మిగిలా ..కాదు కాదు మిగిలేల చేసింది
ఓటమిని నామొహాన పడేసి
మనసులేని మనుసులే నన్నిలా చేశారు
నిజంలో దాగున్నా అనుకున్నా
అబద్దమనే నకిలీ మెరుగులకోసం
పరుగులు పెడుతున్న
ఆ మనిషిని చూసి నవ్వుకొంటున్నా
చేజారిన కొన్నిని కన్నీటితో తడిసిన క్షణాలను
పట్టుకొని ఇంకా మురిసిపోతూనే వున్నా
తను దూరమై సంత్సరాలు గడిచినా
ఇంకా పక్కనే వున్నట్టు వెర్రి ఆలోచనలు
తను నా నుండి దురం అవుతూ
నాలో విసిరేసిన విషాదంతో కాలం వెల్లదీస్తున్నా
అస్పష్టమౌతున్న చూపులతో వెనుదిరగ్గానే
నేను చితిమీద తగలబడుతున్న
కట్టెగా మారిపోయాను
తనెళ్ళిపోయాక నాలోంచి
ఆవిరైపోయిన ఆనందం
ప్రపంచంలో ప్రతీ ఒక్కరి పెదాలపై
మళ్ళె మొగ్గలై విరుస్తూనే వుందిగా
ఒక్క నా పెదలపై తగలబడే విషాదం
ప్రతిక్షనం నన్ను వెక్కిరిస్తూనే వుంది