అదొక విశాలమైన గది
నా మనసుగది
దానిలో ఒక నిలువుటద్దం
నీ ప్రతిబింబం కనిపించగానే
విస్తీర్ణం పెరిగింది.
అందులో
సగం నిజం
సగం భ్రమ.
రెంటికీ మధ్య
గిరి గీయడం కష్టం
గీతలకు దోరకని లావణ్యిం
నన్ను నేను నమ్మలేని నిజం
ఏంటీ కాని నిజం
నాది కాదని తెల్సి
నా మనసెందుకో నీకోసం
ఆరాట పడుతుంది
వాస్తవం మొక్క అయితే
స్వప్నం మొగ్గ.
స్వప్నానికి
గత చింతన ఉండదు
భవితవ్యానికది వంతెన.
ఎత్తులకెగిరే విమానానికి
లోయలోని కొండలు
సంధ్యలో ఎరుపెక్కిన
బుగ్గల్లా మారుతున్న సూర్యిని సాక్షిగా
నాకు నేనే తెలియ్ని నిజంలా
కర్త కనిపించని క్రియలు
అర్థంకాని విక్రియలుగా
చలిస్తాయి.
కెరటాన్నీ
దాని నురగనూ
కోసినట్టు విడదీయలేము.
పెట్టె తెరిస్తే
లోపల అనర్ఘరత్నాలు
కాని రెప్పమూస్తే
లోపల
అద్భుత ప్రపంచాలు
పువ్వుకోసం వెతికితే
మట్టి దొరికినట్టు
ఇదిగో
ఈ కవిత మీకోసం