నాకు నువ్వు గుర్తుకొచ్చినప్పుడు
నీ ఒడిలో తల ఉంచి
గుండెలు పగిలేలా ఏడ్వాలని ఉంది
మనసారా నవ్వాలని ఉంది.
ఎందుకో తెలీదు గెలిచాననికాదు
ఎంతదారునంగా ఓడిపోయానో అని
ఏం చేయాలో తెలీక చావచచ్చి
నా మనసంత నీ ముందర పరచాలని ఉంది.
మన ఊహ లన్ని
పంచుకోవాలని ఉంది. కాని ఏంలాభం.
ఇప్పుడు నువ్వే నాతో లేవుగా?
నన్నొదిలి వెళ్ళాలని నీకెలా అనిపించింది?
నువ్వు వదలనని ఎన్ని బాసలు చేసావు!
నాతో ఒకప్పుడు అన్నవన్నీ కల్లలేనా ?
చూడు!నీకోసం నా కన్నులు
నీరు ఎలా ప్రవహిస్తుందో.అవే నీవు ఉన్న
ఆవిశాల లోకం లోకి రావాలి
అని నిన్ను కరిగించాలి ఆని .
నాకు నిన్ను చూడాలని ఉంది.
ఏమి చేయాలో తెలియడంలేదు
అసలు నాకు తెలియని
మరో ప్రేమలోకాన్ని
చూపించి పరిచయం చేసింది నీవే కదా
ప్రకృతి పచ్చదానాన్ని ..
పంటివిరుల కమ్మదనాన్ని
కార్లో చుట్టూ పచ్చని చెట్లూ మనిద్దరమే
అలా సాగిపోతూ ఎంత దూరం
అయినా పోవాలనిపించేది
మరెందుకు అగిపోయి
నీదారు నీవు చూసుకున్నావు చెప్పవూ
అల అర్దాంతరంగా
వెళ్లి పోయి ఏమి మాట్లాడరెందుకు?
ఎలా విడిచి వెళ్ళాలనిపించింది ?
ఎందుకో నా అత్రుతలా ఉంది
ఏ అలికిడి ఐన నీవు వచావనే ఆశ
ఎవరు పిలిచినా నీ పిలుపే ననే ద్యాష
నను ఉలికిపాటుకి గురి చేసి
ప్రతి రోజు భారంగా
కనురెప్పలు వాల్చేస్తున్నాను
నీ తీపి గురుతులే జ్ఞాపకాలుగా
కాలాల ను గెంటు కుంటూ
ఈ లోకంలో ఉన్నన్తవరకూ
నా జీవన ప్రయాణం ఎడారిలో
ఒయాసిస్సై విలపిస్తూ నీ కోసం నిరీక్షి స్తూ
చావలేక బ్రతుకుతూ
ఎన్నాల్లిలా ఎదురు చూడను చెప్పు
నీ ఒడిలో తల ఉంచి
గుండెలు పగిలేలా ఏడ్వాలని ఉంది
మనసారా నవ్వాలని ఉంది.
ఎందుకో తెలీదు గెలిచాననికాదు
ఎంతదారునంగా ఓడిపోయానో అని
ఏం చేయాలో తెలీక చావచచ్చి
నా మనసంత నీ ముందర పరచాలని ఉంది.
మన ఊహ లన్ని
పంచుకోవాలని ఉంది. కాని ఏంలాభం.
ఇప్పుడు నువ్వే నాతో లేవుగా?
నన్నొదిలి వెళ్ళాలని నీకెలా అనిపించింది?
నువ్వు వదలనని ఎన్ని బాసలు చేసావు!
నాతో ఒకప్పుడు అన్నవన్నీ కల్లలేనా ?
చూడు!నీకోసం నా కన్నులు
నీరు ఎలా ప్రవహిస్తుందో.అవే నీవు ఉన్న
ఆవిశాల లోకం లోకి రావాలి
అని నిన్ను కరిగించాలి ఆని .
నాకు నిన్ను చూడాలని ఉంది.
ఏమి చేయాలో తెలియడంలేదు
అసలు నాకు తెలియని
మరో ప్రేమలోకాన్ని
చూపించి పరిచయం చేసింది నీవే కదా
ప్రకృతి పచ్చదానాన్ని ..
పంటివిరుల కమ్మదనాన్ని
కార్లో చుట్టూ పచ్చని చెట్లూ మనిద్దరమే
అలా సాగిపోతూ ఎంత దూరం
అయినా పోవాలనిపించేది
మరెందుకు అగిపోయి
నీదారు నీవు చూసుకున్నావు చెప్పవూ
అల అర్దాంతరంగా
వెళ్లి పోయి ఏమి మాట్లాడరెందుకు?
ఎలా విడిచి వెళ్ళాలనిపించింది ?
ఎందుకో నా అత్రుతలా ఉంది
ఏ అలికిడి ఐన నీవు వచావనే ఆశ
ఎవరు పిలిచినా నీ పిలుపే ననే ద్యాష
నను ఉలికిపాటుకి గురి చేసి
ప్రతి రోజు భారంగా
కనురెప్పలు వాల్చేస్తున్నాను
నీ తీపి గురుతులే జ్ఞాపకాలుగా
కాలాల ను గెంటు కుంటూ
ఈ లోకంలో ఉన్నన్తవరకూ
నా జీవన ప్రయాణం ఎడారిలో
ఒయాసిస్సై విలపిస్తూ నీ కోసం నిరీక్షి స్తూ
చావలేక బ్రతుకుతూ
ఎన్నాల్లిలా ఎదురు చూడను చెప్పు