నా గుండె గదులు కబ్జా చేసి
మోయలేనంత భారంగా
దూరలేనంత చిక్కంగా
ఆకాశంలా అనంతమౌతూన్న
నన్ను నన్ను గా ఎప్పుడు గుర్తిస్తావో
మనుషుల మధ్య ఉన్నా
ఎక్కడైనా ఎప్పుడైనా
తొంగి చూసే నిన్ను
తరిమి కొట్టలేక
దిగమింగుకోనూలేక
ఎన్ని అగ్నిపర్వతాలు
నాగుండెల్లోబద్దలవలేదూ?!
అవమానమనే
లావాలో పొంగిపొర్లిన
నాదేహం ఎన్నిసార్లు
చితికిపోలేదు?!
నిజాన్ని మోయలేక
అబద్దన్ని దాచుకోలేక
నా గుండె ఎంత
వేదన పడుతుందో నీకేం తెల్సు
మోయలేనంత భారంగా
దూరలేనంత చిక్కంగా
ఆకాశంలా అనంతమౌతూన్న
నన్ను నన్ను గా ఎప్పుడు గుర్తిస్తావో
మనుషుల మధ్య ఉన్నా
ఎక్కడైనా ఎప్పుడైనా
తొంగి చూసే నిన్ను
తరిమి కొట్టలేక
దిగమింగుకోనూలేక
ఎన్ని అగ్నిపర్వతాలు
నాగుండెల్లోబద్దలవలేదూ?!
అవమానమనే
లావాలో పొంగిపొర్లిన
నాదేహం ఎన్నిసార్లు
చితికిపోలేదు?!
నిజాన్ని మోయలేక
అబద్దన్ని దాచుకోలేక
నా గుండె ఎంత
వేదన పడుతుందో నీకేం తెల్సు